రిమ్స్‌లో కలెక్టర్ హడల్ | Collector Babu checkup on rims hospital | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో కలెక్టర్ హడల్

Published Sat, Aug 24 2013 6:51 AM | Last Updated on Thu, Mar 21 2019 8:22 PM

Collector  Babu  checkup on rims hospital

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : అది శుక్రవారం ఉదయం 11.30 గంటలు. కలెక్టర్ ఏ.బాబు వాహ నం దిగి రిమ్స్‌లోకి ప్రవేశించారు. చెట్టుకిందికి వెళ్లి సిబ్బంది తన వెంటరావద్దని చెప్పి ఔట్ పేషెంట్ విభాగంలోకి వెళ్లారు. ఎదురుగా ఓ రోగి వైద్య పరీక్షలు చేయించుకుని ఔట్ పేషెంట్ విభాగంలోకి వెళ్తున్నాడు. ఆ రోగిని కలెక్టర్ ఆస్పత్రికి ఎందుకు వచ్చావని అడిగారు. సారూ.. కండ్లు క నిపిత్తలేవు. డాక్టరుకు చూపించుకుంటే మందులు రిసిచ్చిండు అని చెప్పాడు. మందులు తీసుకోకుం డానే వెళ్లి పోతున్నావని కలెక్టర్ అడుగగా, ప్రైవే టు మందుల దుకాణంలో తీసుకోమ్మని డాక్టర్ చెప్పాడని రోగి తెలిపాడు. వెంటనే మందులు రాసిచ్చిన వైద్యుడి వద్దకు వెళ్లి మందులు బయట ఎందుకు తీసుకొచ్చుకోమంటున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకుని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హైరానా పడుతూ ఆయన వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ సమాచారం లేకుండా రావడంతో ఆస్పత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. కలెక్టర్ అన్ని వార్డులను ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీ చేశారు.
 
 ఓపీ విభాగంతో మొదలు..
 మొదట ఈఎంటీ విభాగంలోకి వెళ్లిన కలెక్టర్ అక్కడ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఈసీజీ, ఫిమేల్ మెడికల్ ఓపీ, అప్తాలమాలజీ విభాగాలను పరిశీలించారు. ప్రతి రోజు కేసులు నమోదు చేసుకోవాలని సూచించారు. రోగులకు బయటి మందులు రాసివ్వకూడదని, సాధ్యమైనంత వరకు కావాల్సిన మందులు ఆస్పత్రిలో తీసుకునే వాటిని రాసివ్వాలని వైద్యులకు సూచించారు. ఓపీ విభాగంలోని మొదటి అంతస్తులో ఉన్న ఏఆర్‌టీ సెంటర్, రక్తపరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. సింకు బూజుపట్టి ఉండటం, అపరిశుభ్రంగా ఉండటంతో వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డెంటల్, ఎంఆర్‌డీ సెంటర్, పిడియాట్రిక్, ఐసీటీసీ విభాగాలను పరిశీలించారు. అనంతరం వికలాంగ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే సదరం క్యాంపు విభాగాన్ని సందర్శించారు. రిజిస్టర్‌లో క్లర్క్ సంతోష్ సంతకాలు వారం రోజుల నుంచి లేకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరం ద్వారా ఎంత మందికి సర్టిఫికేట్లు జారీ చేశారని, ఏఏ రోజు క్యాంపు నిర్వహిస్తున్నారని సిబ్బందిని అడిగారు. కచ్చితంగా రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
 
 మరుగుదొడ్లు లేవా?
 ఔట్ పేషెంట్లు రోజు దాదాపు 500 మందికి పైగా వస్తారు. అలాంటిది ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో అధికారుల తీరపై కలెక్టర్ అసంతృప్తి చేశారు. ఒక మరుగుదొడ్డి ఉండగా దానికి తాళం వేసి ఉండడంతో వెంటనే తెరవాలని సూ చించారు. లోపల ఉన్న సింకులు పగిలిపోయాయని, అందుకు తేళాం వేశామని అధికారులు చె ప్పాడంపై కలెక్టర్ మండిపడ్డారు. వెంటనే సదరు ఇంజనీరింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ఓపీలో రోగులకు సమాచారం అందించేందు కు విచారణ కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక సి బ్బంది నియమించాలన్నారు. అనంతరం పక్కనే ఉన్న డ్రెసింగ్ రూంకి వెళ్లిన కలెక్టర్ అక్కడి అపరిశభ్రుతపై సదరు సిబ్బందిని మందిలించారు. అనంతరం ఆరోగ్య శ్రీ ఓపీ విభాగాన్ని పరిశీలించారు.
 
 ఆరోగ్య శ్రీపై నిర్లక్ష్యం తగదన్నారు. ఏటా రూ. కోటి బడ్జెట్ విడుదల కావాల్సి ఉండగా కేవలం రిమ్స్‌కు రూ.10 లక్షల వరకు మాత్రమే వస్తుండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంత మంది రోగులు వైద్యం చేయించుకుంటే అంత ఎక్కువ బడ్జెట్ విడుదలవుతుందని, కానీ ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరోగ్య శ్రీలో రోగులకు వైద్యం అందకపోవడంపై మండిపడ్డారు. కాగా రిమ్స్ నూతన భవనంలోని నాలుగించిలో మూడు పనిచేయక పోవడంపై ఎలక్ట్రీషిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లిఫ్ట్‌కు మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంలో సూపర్ వైజర్ కిరణ్, ఫ్లంబర్ మహేందర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మరమ్మతు చేయించాలని సూచించారు.
 
 సమస్యల పరిష్కారానికి కృషి..
 రిమ్స్ ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. రిమ్స్‌లో తనిఖీల అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించానని, వాటర్, పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఆస్పత్రిలో మరో 200 పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యులు, అధికారులు సమన్వయలోపంతోనే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వైద్యులు వెంటనే క్లినిక్‌లు ఎత్తివేయాలని, లేని యెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు బయట మెడికల్ మందులు రాసివ్వకూడదని తెలిపారు. అదేవిధంగా వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు కూడా తెలుసుకుంటానని పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత మళ్లీ రిమ్స్‌లో తనిఖీ చేస్తానని, అప్పుడుకూడా తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement