checkup
-
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
భావిపౌరులకు ఆరోగ్య భద్రత
వచ్చే నెల మెుదటి వారం నుంచి సంచార వాహనాల ద్వారా వైద్యసేవలు 30 రకాల వైద్యపరీక్షల నిర్వహణ అవసరమైన వారికి జీజీహెచ్‌లో చికిత్స బాలాజీచెరువు (కాకినాడ): భావి పౌరులైన చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంచార వాహనాల ద్వారా నేరుగా వారి వద్దకు వెళ్లి పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో దాదాపు నాలుగు లక్షల మందికి పైగా అంగన్వాడీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లస్లర్లకు రెండేసి చొప్పున వాహనాలను ఏర్పాటు చేసి, వాటిలో వైద్యసేవలు అందించేందుకు 68 మంది వైద్యులు, 34 మంది ఫార్మాసిస్టులతో పాటు ఏఎన్ఎంలను నియమించనున్నారు. రెండు సంవత్సరాల క్రితం బాలల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘రాషీ్ట్రయ స్వస్థ్య బాల’ కార్యక్రమం చేపట్టారు. ఒక సంచార వాహనం కేటాయించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఇద్దరు వైద్యులను, సిబ్బందిని కేటాయించి వైద్యసేవలు అందించేవారు. అయితే తర్వాత వైద్యులకు ఇతర బాధ్యతలు కేటాయించడంతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. దీని వల్ల విద్యార్థుల అనారోగ్య సమస్యలు పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీంతో రాష్ట్రప్రభుత్వం రాషీ్ట్రయ స్వస్థ్య బాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం సంచార వాహనాలతో పాటు ప్రత్యేకంగా వైద్యులను, సిబ్బందిని నియమించనుంది. వచ్చే నెల మెుదటి వారం నుంచి సేవలు అందించాలని సంకల్పించారు. క్లస్టర్‌కు రెండు వాహనాలు జిల్లాలో ఉన్న 4,412 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నాలుగు లక్షల 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి క్లస్టర్‌కు రెండు సంచార వాహనాలలో 18 సంవత్సరాల లోపువయస్సు కలిగిన బాలబాలికలు, యువతీయువకులకు 30 రకాల వైద్యపరీక్షలు, సేవలు అందజేస్తారు. ఒకో సంచార వాహనంలో ఇద్దరు వైద్యులు (విధిగా ఒక మహిళా వైద్యురాలుండాలి), ఫార్మాసిస్టు, ఏఎన్ఎం ఉంటారు. వీరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్ కళాశాలలకు వెళ్లి రోజుకు వంద నుంచి 130 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. వారికి ఒక కార్డు ఇచ్చి గుర్తించిన అనారోగ్యసమస్యలను దానిపై రాస్తారు. చిన్న చిన్న సమస్యలకు చికిత్స చేసి, మందులు ఇస్తారు. అవసరమైతే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి మెరుగైన వైద్యం అందిస్తారు. వెన్నెముక, పుర్రె, మెదడు సంబంధిత లోపాలు, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, అంగుట్లో చీలిక, వంకరపాదాలు, కంటిపొర, పుట్టుకతో వచ్చే చెవుడు, సాంక్రమిక గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చే కంటిలోపం, అయోడిన్ లోపం, చర్మవ్యాధులు, గజ్జి, తామర, శ్వాసకోశవ్యాధులు, పిప్పిపళ్లు, మాటలు సరిగా రాకపోవడం, చిన్నగడ్డం, మూర్ఛ, నాడీ సంబంధిత సమస్యలు, విటమిన్ ఏ, విటమిన్ డీ లోపం వంటి వాటికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు. -
డమ్మీ డాక్టర్!
గద్వాల ఏరియా ఆస్పత్రి తీరు నానాటికి తీసికట్టు...అనే చందంగా మారుతోంది. ఇటీవల జబ్బు ఒకటైతే మందు మరొకటి ఇచ్చి ఇద్దరు చిన్నారుల ప్రాణం పోయేంతా పనిచేశారు. ఇది మరకముందే మరోలీల బయటపడింది. ఓ డమ్మీ డాక్టర్ ఎంచక్కా ఇక్కడే తిష్టవేశాడు. రోగులకు దర్జాగా వైద్యపరీక్షలు నిర్వహించాడు. అతడు ప్రభుత్వ వైద్యుడే కాదు.. అసలు వైద్యుడో కాదో కూడా తెలియదు.. చివరకు ఈ తతంగం బయటపడటంతో మెల్లగా జారుకున్నాడు. గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ రమేష్ గురువారం రాత్రి రాజీవ్‌మార్గ్‌లో మోటార్ సైకిల్‌పై వస్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ రామ్‌జీ, ఇతర ఏజెంట్లు అక్కడి కి చేరుకున్నారు. అప్పటికే రమేష్‌కు డ్యూటీలో ఉన్న పేరు తెలియని వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తలకు తీవ్రగాయాలు అయ్యాయని, కర్నూలుకు తీసుకెళ్తామని స్నేహితులు వైద్యున్ని కోరారు. ఈ క్రమంలోనే ఏరియా ఆస్పత్రిలోనే పని చేసే డాక్టర్ విజయ్‌కుమార్‌ను కొంతమంది ఎల్ఐసీ ఏజెంట్లు సహకారంగా ఉంటుందని పిలిపించారు. ఆయ న ఆస్పత్రికి రాగానే అంతవరకు డ్యూటీ లో ఉండి చికిత్సచేసిన సదరు వ్యక్తి అక్కడినుంచి ఉడాయించాడు. దీంతో ఆ డాక్టర్ ఎవరని అక్కడున్న ఇతర సిబ్బం దిని ఎల్ఐసీ ఏజెంట్లు ప్రశ్నించారు. తమకు తెలియదని వారు సమాధానమిచ్చారు. దీంతో అసలు డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. చికిత్సచేసిన డాక్టర్ ప్రభుత్వ వైద్యుడు కాదని తెలిపోవడంతో రోగులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఇంతలో గాయపడ్డ రమేష్‌ను కర్నూలుకు తరలించారు. మీడి యా ఆస్పత్రికి చేరుకుని ఆరాతీయగా సదరు వ్యక్తి డమ్మీ డాక్టర్ అని తేలింది. సాయంత్రం 7 గంటల నుంచి చికిత్స చేసినట్లు గుర్తించారు. ఇంతకుముందు మరో ఇద్దరిని కర్నూలుకు రెఫర్చేసినట్లు తేలిం ది. ఇదిలాఉండగా డ్యూటీలో కిషోర్‌కుమార్ అనే వైద్యు డు ఉండాల్సి ఉండగా, అతడు అందుబాటులో లేడు. ఈ విషయమై అక్కడున్న స్టాఫ్ నర్సు ఇందిరను అడగ్గా చికిత్సచేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. అంతలోనే డాక్టర్ కిషోర్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వ్యక్తి పేరు బాషా అని, అతను తన వెంట వచ్చాడని తెలి పారు. లేబర్ రూములో మరో రోగికి తా ను చికిత్స చేస్తున్నానని అదే సమయంలో గాయపడ్డ వ్యక్తికి వైద్యపరీక్షలు చేయమని తానే చెప్పానని చెప్పుకొచ్చాడు. దీంతో స్థానిక వైద్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. -
అయ్యో..‘పాపం
నూనెపల్లె, న్యూస్‌లైన్: ఆ పాప ఇంకా కనులైనా తెరువలేదు. అంతలోనే కన్నవారి ప్రేమకు దూరమైంది. ఆడబిడ్డనో.. లేదంటే తాము పెంచి పోషించలేమనో ఆ పసిపాపను ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారు. ఈ ఘటన నంద్యాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆసుపత్రిలో రాత్రి క్యాజువాలిటీలో వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా భావించుకున్న చిన్నారి తల్లిదండ్రులు కన్న బిడ్డను వదిలి ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. కొద్దిసేపు తర్వాత పాప ఏడుపులు విన్న సిబ్బంది అక్కున చేర్చుకొని డ్యూటీలో ఉన్న డాక్టర్ మానసకు అప్పగించారు. ఆ పాపను ఆలించారు.. లాలించి పాప తల్లిదండ్రుల కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. పాప ఆరోగ్య స్థితిపై వైద్యులు పరీక్షలు చేసి చిన్నారిని ఆసుపత్రిలో శిశుసంజీవినిలో చేర్పించి మెరుగైన వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు అందించిన సమాచారంపై ఔట్‌పోస్టు హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
చికిత్స పొందుతున్న వృద్ధురాలి మృతి
నకిరేకల్, న్యూస్‌లైన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ఎముకల వైద్యుడు గత 20 ఏళ్లుగా పట్టణంలోని రఘురామ థియేటర్ పక్కన ఆస్పత్రి నిర్వహిస్తున్నా డు. పతి ఆదివారం ఇక్కడి వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేసి వెళ్తుంటాడు. కాగా తిప్పర్తి మండలంలోని చిన్నాయిగూడెంకు చెందిన బైరగోని పెంట మ్మ(62) మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఆది వారం ఆస్పత్రికి రాగా డాక్టర్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం డాక్టర్ ఆదేశాల మేరకు కంపౌండర్ పెన్సిలిన్ ఇం జక్షన్ ఇచ్చాడు. ఆ తరువాత పెంటమ్మ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వేరే ఆస్పత్రికి తరలించేం దుకు 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తుండగానే పెంటమ్మ మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట ఆందోళన పెంటమ్మ మృతిపట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు ది గారు. వైద్యం వికటించడం వల్లే పెంటమ్మ మృతి చెందిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఆస్పత్రిపై దాడి చేసి ఫర్నిచర్, మందులను ధ్వం సం చేశారు. డాక్టర్‌ను నిలదీశారు. సమాచారం అం దుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబీకులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. వైద్యం వికటించడం వల్లే తమ తల్లి మృతి చెందిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తూ, మందులు విక్రయిస్తున్న డాక్టర్‌పై చర్య తీసుకోవాలని కుమారులు జానయ్య, శ్రీనువాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ వివరణ పెంటమ్మ మృతిపై డాక్టర్‌ను వివరణ కోరాగా తా ను వైద్యం చేసిన విషయం వాస్తవమేనన్నారు. అ యితే ఒక ఫ్లూయిడ్స్ పెట్టి, ఇంజక్షన్ తన సిబ్బంది తో వేయించానని చెప్పారు. దీంతో ఆమె కళ్లు తిరుగుతున్నాయని అంటూనే మృతి చెందిందని తెలిపా రు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించారు. -
రిమ్స్‌లో కలెక్టర్ హడల్
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : అది శుక్రవారం ఉదయం 11.30 గంటలు. కలెక్టర్ ఏ.బాబు వాహ నం దిగి రిమ్స్‌లోకి ప్రవేశించారు. చెట్టుకిందికి వెళ్లి సిబ్బంది తన వెంటరావద్దని చెప్పి ఔట్ పేషెంట్ విభాగంలోకి వెళ్లారు. ఎదురుగా ఓ రోగి వైద్య పరీక్షలు చేయించుకుని ఔట్ పేషెంట్ విభాగంలోకి వెళ్తున్నాడు. ఆ రోగిని కలెక్టర్ ఆస్పత్రికి ఎందుకు వచ్చావని అడిగారు. సారూ.. కండ్లు క నిపిత్తలేవు. డాక్టరుకు చూపించుకుంటే మందులు రిసిచ్చిండు అని చెప్పాడు. మందులు తీసుకోకుం డానే వెళ్లి పోతున్నావని కలెక్టర్ అడుగగా, ప్రైవే టు మందుల దుకాణంలో తీసుకోమ్మని డాక్టర్ చెప్పాడని రోగి తెలిపాడు. వెంటనే మందులు రాసిచ్చిన వైద్యుడి వద్దకు వెళ్లి మందులు బయట ఎందుకు తీసుకొచ్చుకోమంటున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకుని ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది హైరానా పడుతూ ఆయన వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ సమాచారం లేకుండా రావడంతో ఆస్పత్రి వర్గాలు ఖంగుతిన్నాయి. కలెక్టర్ అన్ని వార్డులను ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీ చేశారు. ఓపీ విభాగంతో మొదలు.. మొదట ఈఎంటీ విభాగంలోకి వెళ్లిన కలెక్టర్ అక్కడ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఈసీజీ, ఫిమేల్ మెడికల్ ఓపీ, అప్తాలమాలజీ విభాగాలను పరిశీలించారు. ప్రతి రోజు కేసులు నమోదు చేసుకోవాలని సూచించారు. రోగులకు బయటి మందులు రాసివ్వకూడదని, సాధ్యమైనంత వరకు కావాల్సిన మందులు ఆస్పత్రిలో తీసుకునే వాటిని రాసివ్వాలని వైద్యులకు సూచించారు. ఓపీ విభాగంలోని మొదటి అంతస్తులో ఉన్న ఏఆర్టీ సెంటర్, రక్తపరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. సింకు బూజుపట్టి ఉండటం, అపరిశుభ్రంగా ఉండటంతో వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డెంటల్, ఎంఆర్డీ సెంటర్, పిడియాట్రిక్, ఐసీటీసీ విభాగాలను పరిశీలించారు. అనంతరం వికలాంగ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే సదరం క్యాంపు విభాగాన్ని సందర్శించారు. రిజిస్టర్లో క్లర్క్ సంతోష్ సంతకాలు వారం రోజుల నుంచి లేకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరం ద్వారా ఎంత మందికి సర్టిఫికేట్లు జారీ చేశారని, ఏఏ రోజు క్యాంపు నిర్వహిస్తున్నారని సిబ్బందిని అడిగారు. కచ్చితంగా రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు లేవా? ఔట్ పేషెంట్లు రోజు దాదాపు 500 మందికి పైగా వస్తారు. అలాంటిది ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో అధికారుల తీరపై కలెక్టర్ అసంతృప్తి చేశారు. ఒక మరుగుదొడ్డి ఉండగా దానికి తాళం వేసి ఉండడంతో వెంటనే తెరవాలని సూ చించారు. లోపల ఉన్న సింకులు పగిలిపోయాయని, అందుకు తేళాం వేశామని అధికారులు చె ప్పాడంపై కలెక్టర్ మండిపడ్డారు. వెంటనే సదరు ఇంజనీరింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ఓపీలో రోగులకు సమాచారం అందించేందు కు విచారణ కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక సి బ్బంది నియమించాలన్నారు. అనంతరం పక్కనే ఉన్న డ్రెసింగ్ రూంకి వెళ్లిన కలెక్టర్ అక్కడి అపరిశభ్రుతపై సదరు సిబ్బందిని మందిలించారు. అనంతరం ఆరోగ్య శ్రీ ఓపీ విభాగాన్ని పరిశీలించారు. ఆరోగ్య శ్రీపై నిర్లక్ష్యం తగదన్నారు. ఏటా రూ. కోటి బడ్జెట్ విడుదల కావాల్సి ఉండగా కేవలం రిమ్స్‌కు రూ.10 లక్షల వరకు మాత్రమే వస్తుండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంత మంది రోగులు వైద్యం చేయించుకుంటే అంత ఎక్కువ బడ్జెట్ విడుదలవుతుందని, కానీ ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరోగ్య శ్రీలో రోగులకు వైద్యం అందకపోవడంపై మండిపడ్డారు. కాగా రిమ్స్ నూతన భవనంలోని నాలుగించిలో మూడు పనిచేయక పోవడంపై ఎలక్ట్రీషిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లిఫ్ట్‌కు మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లలో చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంలో సూపర్ వైజర్ కిరణ్, ఫ్లంబర్ మహేందర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో మరమ్మతు చేయించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి.. రిమ్స్ ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. రిమ్స్‌లో తనిఖీల అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించానని, వాటర్, పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఆస్పత్రిలో మరో 200 పడకలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యులు, అధికారులు సమన్వయలోపంతోనే సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వైద్యులు వెంటనే క్లినిక్‌లు ఎత్తివేయాలని, లేని యెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు బయట మెడికల్ మందులు రాసివ్వకూడదని తెలిపారు. అదేవిధంగా వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు కూడా తెలుసుకుంటానని పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత మళ్లీ రిమ్స్‌లో తనిఖీ చేస్తానని, అప్పుడుకూడా తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు. -
దుబాయి విమానంలో దొంగ బంగారం
విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్‌లైన్: సుంకం చెల్లించకుండా కేజిన్నర బంగారాన్ని రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ విమానాశ్రయంలో అధికారులకు చిక్కింది. శ్రీలంకకు చెందిన చెందిన నలుగురు యువకులు దుబాయ్ నుంచి మంగళవారం కేజీన్నర బంగారంతో విశాఖ విమానాశ్రయంలో దిగారు. విమానానికి ఎస్కార్ట్‌గా హైదరాబాదు నుంచి విశాఖ వచ్చిన నిఘా అధికారులు వీరి కదలికలను అనుమానించారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి 35వేల విలువకు మించి బంగారంతో వస్తే ప్రభుత్వానికి సుంకం చెల్లించాలి. విమానం నుంచి వెంబడిస్తున్న అధికారులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వారిని గుర్తించి తనిఖీలు జరపడంతో కేజీన్నర బంగారం బయటపడింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిసింది. విమానాశ్రయం బయట ఓ ఏజెంట్ కూడా తప్పించుకున్నట్లు తెలిసింది.