విశాఖపట్నం (గోపాలపట్నం), న్యూస్‌లైన్: సుంకం చెల్లించకుండా కేజిన్నర బంగారాన్ని రవాణా చేస్తున్న ఓ ముఠా విశాఖ విమానాశ్రయంలో అధికారులకు చిక్కింది. శ్రీలంకకు చెందిన చెందిన నలుగురు యువకులు దుబాయ్ నుంచి మంగళవారం కేజీన్నర బంగారంతో విశాఖ విమానాశ్రయంలో దిగారు.
విమానానికి ఎస్కార్ట్‌గా హైదరాబాదు నుంచి విశాఖ వచ్చిన నిఘా అధికారులు వీరి కదలికలను అనుమానించారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి 35వేల విలువకు మించి బంగారంతో వస్తే ప్రభుత్వానికి సుంకం చెల్లించాలి. విమానం నుంచి వెంబడిస్తున్న అధికారులు కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వారిని గుర్తించి తనిఖీలు జరపడంతో కేజీన్నర బంగారం బయటపడింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు తెలిసింది. విమానాశ్రయం బయట ఓ ఏజెంట్ కూడా తప్పించుకున్నట్లు తెలిసింది.
దుబాయి విమానంలో దొంగ బంగారం
Published Wed, Aug 21 2013 4:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement