నూనెపల్లె, న్యూస్‌లైన్: ఆ పాప ఇంకా కనులైనా తెరువలేదు. అంతలోనే కన్నవారి ప్రేమకు దూరమైంది. ఆడబిడ్డనో.. లేదంటే తాము పెంచి పోషించలేమనో ఆ పసిపాపను ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారు. ఈ ఘటన నంద్యాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఆసుపత్రిలో రాత్రి క్యాజువాలిటీలో వైద్యులు, స్టాఫ్ నర్స్‌లు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా భావించుకున్న చిన్నారి తల్లిదండ్రులు కన్న బిడ్డను వదిలి ఏమీ ఎరుగనట్లు వెళ్లిపోయారు. కొద్దిసేపు తర్వాత పాప ఏడుపులు విన్న సిబ్బంది అక్కున చేర్చుకొని డ్యూటీలో ఉన్న డాక్టర్ మానసకు అప్పగించారు. ఆ పాపను ఆలించారు.. లాలించి పాప తల్లిదండ్రుల కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. పాప ఆరోగ్య స్థితిపై వైద్యులు పరీక్షలు చేసి చిన్నారిని ఆసుపత్రిలో శిశుసంజీవినిలో చేర్పించి మెరుగైన వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు అందించిన సమాచారంపై ఔట్‌పోస్టు హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
అయ్యో..‘పాపం
Published Fri, Dec 27 2013 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement