ఆస్పత్రి ఎదుట ఆందోళన
ఆస్పత్రి ఎదుట ఆందోళన
Published Mon, Jul 25 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
సూర్యాపేటమున్సిపాలిటీ
శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు..పట్టణంలోని చర్చికాంపౌండ్‌కు చెందిన రాంశెట్టి హైమావతికి పురిటినొప్పులు రావడంతో ఆదివారం పట్టణంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హైమావతిని పరిశీలించిన వైద్యులు అదే రోజు రాత్రి ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును అదే ఆస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో వైద్యులు పరిశీలించి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపినట్టు బంధువులు చెప్పారు. అయితే సోమవారం ఒక్కసారిగా సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పిన గంట వ్యవధిలోనే శిశువు మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆందోళనకు దిగారు. హైమావతి భర్త వినయ్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడమేమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాసిత్ సిబ్బందితో సదరు ఆస్పత్రి వద్దకు చేరుకొని బంధువులు, వైద్యులను పిలిపించి మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
Advertisement