‘పేట’ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన రాష్ట్ర బృందం
‘పేట’ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన రాష్ట్ర బృందం
Published Tue, Oct 4 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
సూర్యాపేట : స్వచ్ఛ అభియాన్ కాయకల్ప్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం మంగళవారం సూర్యాపేట ఏరియాస్పత్రిని ఫ్యామిలీ ప్లానింగ్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభావతి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలను జిల్లాకో బృందం వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఏరియాస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల కల్పన ఎలా ఉందని రోగులను అడిగితెలుసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో దేవరకొండ, డిండి, చందంపేట, నల్గొండ, నకిరేకల్ ఆస్పత్రులను పరిశీలించామన్నారు. ఆమె వెంట యునీసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ ఉమా శంకర్, లీగల్ కన్సల్టెంట్ వాణి, ఏరియాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్, వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ మాండన్ సుదర్శన్‌సింగ్, మోహినుద్దీన్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement