వ్యక్తి దారుణ హత్య
వ్యక్తి దారుణ హత్య
Published Wed, Oct 26 2016 11:06 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
- సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డోన్ సీఐ
- కుటుంబసభ్యులు అనుమానిస్తున్న వ్యక్తి ఇంటివద్దకు వెళ్లిన డాగ్‌స్క్వాడ్
కృష్ణగిరి: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన బోయ ప్రతాప్(55)ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి హత్య చేసి మోటార్‌సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకువచ్చి మృతుని పొలంలోనే పారవేసినట్లు అనుమానాలున్నాయి. బుధవారం ఉదయం మృతుని భార్య పొలానికి వెళ్లగా తన భర్త మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న డోన్ సీఐ శ్రీనివాసులు, కృష్ణగిరి ఎస్‌ఐ సోమ్లానాయక్, డోన్ రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీం బృందాలను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ సంఘటనాస్థలం నుంచి గ్రామంలోకి వెళ్లి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వ్యక్తి ఇంటివద్దకు వెళ్లి తిరిగి మృతదేహం వద్దకు చేరుకుంది. క్లూస్‌టీం సిబ్బంది మృతదేహం పరిసరాల్లో ఉన్న మద్యం బాటిళ్లు తదితర వాటిపై వేలిముద్రలను సేకరించారు. మృతుడు మంగళవారం గ్రామానికి చెందిన మరోవ్యక్తితో మోటార్‌సైకిల్‌పై తిరిగాడని అయితే రాత్రి అయినా తిరిగి రాలేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలియజేశారు. మృతుని భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
Advertisement
Advertisement