వ్యవసాయ కూలీ హత్య
రాజుపాలెం (గుంటూరు) : గుర్తు తెలియని వ్యక్తులు వివాహితుడైన వ్యక్తిని మారణాయుధాలతో నరికి చంపిన సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఏటుకూరి రాజు(40) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద నుంచి నడుచుకుంటూ గ్రామంలోకి వెళుతున్నాడు. వెనుకే వాహనాలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రైస్ మిల్లు ఎదుట గొడ్డళ్లతో నరికి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏటుకూరి రాజ అక్కడిక్కడే మృతి చెందాడు. రాజు వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ అనీల్‌కుమార్ సంఘట స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు.