సింగిల్ టైర్ బైక్..
కేవలం ఒకే చక్రమున్న మోటారు సైకిల్ ఇది. పేరు రైనో. అమెరికాకు చెందిన రైనో మోటర్స్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీలో దీంతో ఎంచక్కా దూసుకుపోవచ్చని.. మోటారుసైకిల్‌తో పోలిస్తే.. చాలా తక్కువ స్థలం ఆక్రమించే దీన్ని ఫుట్‌పాత్‌లు, ఇంటి కారిడార్‌లలోనూ నడపొచ్చని సదరు కంపెనీ సీఈవో క్రిస్‌హాఫ్‌మన్ (చిత్రంలోని వ్యక్తి) చెబుతున్నారు. అంతేకాదు..
లిఫ్ట్‌లోకి(పక్కనున్నవారు ఒప్పుకుంటే) కూడా తీసుకెళ్లవచ్చని అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
బ్యాటరీని తీసేసి.. మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని నడిపే విధానం వేరేగా ఉంటుంది. నడిపేటప్పుడు మనం ముందుకు వంగితే వేగం పెరుగుతుంది. వెనక్కు వెళ్తే.. వేగం తగ్గుతుంది. 57 కిలోల బరువున్న రైనో బైక్ ధర రూ.3.3 లక్షలు.