motor vehicle act
-
మొక్కుబడిగా స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ కొత్తగా రూపొందించిన వాహనాల స్క్రాప్ పాలసీ గందరగోళంగా ఉంది. వాహనాల తుక్కు ప్రక్రియలో స్పష్టత కొరవడింది. ఆర్టీఏ అంచనాల మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 18 లక్షల వరకు కాలపరిమితి ముగిసిన వాహనాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని వాటి యజమానులు రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించుకొని వినియోగిస్తున్నారు. మరికొన్ని వాహనాలు వినియోగానికి పనికి రాకుండా మూలనపడ్డాయి. ఆర్టీఏ ప్రమేయం లేకుండానే తుక్కు కింద మారాయి. మరోవైపు లక్షలాది వాహనాలు గల్లంతయ్యాయి. చోరీకి గురైన వాహనాల జాడ లేదు. ఇలా వివిధ రకాలుగా వినియోగంలో లేని వాహనాలపైన తాజా స్క్రాప్ పాలసీలో ఎలాంటి స్పష్టత లేదని వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలసీ వల్ల కనిపించని ప్రయోజనం రవాణాశాఖ లెక్కల్లో మాత్రమే కనిపించే ఈ వినియోగంలో లేని వాహనాలపైన వాహనదారులు పెద్దమొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొత్త బండి కొనుగోలు చేసే సమయంలో రెండో వాహనంగా పరిగణించి 2 శాతం పన్నును అదనంగా విధిస్తున్నారు. దీంతో కార్లు, తదితర నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసే వారు రూ.వేలల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు రెండో బండి కింద ద్విచక్ర వాహనాల కొనుగోలుపై కూడా భారం మోపుతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగంలో లేని వాహనాలను తుక్కుగా పరిగణించకుండానే రూపొందించిన కొత్త పాలసీ వల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. పాత వాహనాలపై ఫిర్యాదుల వెల్లువ.. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కాలపరిమితి ముగిసినవిగా పరిగణిస్తారు. తాజా నిబంధనల మేరకు వాటిని తుక్కు చేయాల్సి ఉంటుంది. ఇక వ్యక్తగత వాహనాల కేటగిరీలోకి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. వద్దనుకుంటే స్వచ్ఛందంగా తుక్కు చేసి కొత్త వాహనం కొనుగోలు చేసుకోవచ్చు. పాతబండి స్క్రాబ్ చేయడం వల్ల 2 శాతం అదనపు పన్ను నుంచి ఊరట లభిస్తుంది. అలాగే కొత్త వాహనం జీవితకాల పన్నులోనూ రాయితీ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వినియోగంలో లేని వాహనాల సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కాలపరిమితి ముగిసి వినియోగానికి పనికి రాకుండా ఉన్నవి ఆటోమేటిక్‌గానే తుక్కుగా మారాయి. పెద్ద సంఖ్యలో చోరీకి గురయ్యాయి. అలాంటి వాటిపైన పోలీస్స్టేషన్లలో, ఆర్టీఏ కార్యాలయాల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదై ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ఫిర్యాదులు పరిష్కారానికి నోచడం లేదు.ఊరించి ఉస్సూరుమనిపించారు.. కాలపరిమితి ముగిసిన వాటిలో ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు, డీసీఎంలు, లారీలు, టాటాఏస్‌లు వంటి వివిధ కేటగిరీలకు చెందిన రవాణా వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. రవాణా వాహనాలకు 15 ఏళ్లు కాలపరిమితి కాగా, వ్యక్తిగత వాహనాలకు నిర్దిష్టమైన పరిమితి లేదు. 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకోవచ్చు. దీంతో ఈ కేటరికీ చెందినవి ఎక్కువ. అదే సమయంలో వినియోగంలో లేనివి కూడా వ్యక్తిగత వాహనాల కేటగిరీలోనే అత్యధికంగా ఉన్నాయి. అలాంటి వాటిపైన ఈ పాలసీ ఊరించి ఉస్సూరుమనిపించింది.చదవండి: 15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం అపహరణకు గురైనప్పటికీ.. పోగొట్టుకున్న వాహనాలు లభించకపోవడంతో కొత్తవి కొనుగోలు చేసే సమయంలో 2 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అపహరణకు గురైనప్పటికీ ఆ వాహనం సదరు యజమాని పేరిట నమోదై ఉందనే సాకుతో రవాణా అధికారులు అదనపు భారం మోపుతున్నారు. వినియోగంలో లేకపోయినా పన్ను చెల్లించాల్సి రావడం అన్యాయమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా రూపొందించిన స్క్రాప్ పాలసీలో తమకు ఊరట లభించవచ్చని చాలామంది భావించారు. కానీ వాటిపైన ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. వాహనదారులు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయవచ్చని మాత్రం వెల్లడించారు. -
గృహిణుల సేవలకు వెలకట్టలేం: సుప్రీం
న్యూఢిల్లీ: ఇంట్లో గృహిణులు రోజంతా చేసే పనులకు వెలకట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణి బాధ్యతలు ఎంతో గౌరవప్రదమైనవని, డబ్బుతో వాటిని పోల్చలేమని తెలిపింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ తీర్పు వెలువరించింది. 2006లో ఓ మహిళ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆమె నడిపే వాహనానికి బీమా చేయించలేదు. మృతురాలి భర్త, మైనర్ కుమారుడికి కలిపి రూ.2.5 లక్షలు చెల్లించాలని మోటారు వాహన క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని ఆదేశించింది. దీనిపై మృతురాలి కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. మృతురాలు ఉద్యోగిని కాదు, కేవలం గృహణి మాత్రమే. పరిహారాన్ని ఆమె జీవిత కాలాన్ని, నామమాత్రపు ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తారు’అని పేర్కొంటూ పరిహారం మొత్తాన్ని పెంచేందుకు నిరాకరిస్తూ 2017లో తీర్పు చెప్పింది. దీనిపై బాధితులు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. విచారించిన ధర్మాసనం ‘ఒక గృహిణి సేవలను రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా నిర్ణయిస్తారు? ఈ విధానాన్ని మేం అంగీకరించడం. గృహిణి విలువను ఎన్నడూ తక్కువగా అంచనా వేయరాదు’అని పేర్కొంటూ రూ.6 లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
HYD: బంకుల్లో నో పెట్రోల్.. వాహనదారుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక -
Vizag: మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్.. నేరమని తెలియదా?
ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి వాటిని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి దడపుట్టిస్తున్నారు. 90 శాతం వాహనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మనిషి సాధారణంగా 60 డెసిబుల్స్ శబ్దం వరకు వినగలదు. 120 డెసిబుల్స్ కన్నా ఎక్కువగా వినడం చెవుడుకు దారితీస్తుంది. ఆకతాయిలు చేస్తున్న ఇలాంటి న్యూసెన్స్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటున్నారు. – దొండపర్తి(విశాఖ దక్షిణ) విశాఖ జిల్లాలో వాహనాల శబ్ద కాలువ్యం ఎక్కువైంది. రోడ్డుపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనం వేగం పెరిగితే అది వెలువరించే శబ్దం బాగా పెరుగుతుంది. శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు. మోటారు వాహనాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రతి వాహనం నిర్ణీత శబ్దాన్ని వెలువరించేలా, దాని సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతి ఇస్తుంది. కంపెనీ సైలెన్సర్లకు ఒక సీరియల్ నంబర్ కూడా ఉంటుంది. దాని ద్వారా కంపెనీ సైలెన్సర్‌ను గుర్తించవచ్చు. ఇలా కాకుండా వాటిలో ఏమైనా మార్పులు చేసినా, రవాణా శాఖ అనుమతి లేని వాటిని వాడినా శబ్ద తీవ్రత మారిపోతుంది. ఉలిక్కి పడాల్సిందే.. బుల్లెట్ వాహనాలు దర్జాకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కేటీఎం కుర్రకారుకు క్రేజ్‌గా మారుతున్నాయి. అలాగే పాతబడ్డ యమహా ఆర్ఎక్స్ –100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరించే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తూ.. ఎదుటివారి ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్లపై వాహనాలను నడుపుతుండడం దడ పుట్టిస్తోంది. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లలో కొంత మంది మార్పులు చేస్తుంటే.. మరికొంత మంది దానిని పూర్తిగా మార్చేసి అధిక శబ్దం వచ్చే వాటిని బిగించుకుంటున్నారు. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని గుర్తించలేకపోతున్నారు. బుల్లెట్, ఆర్ఎక్స్–100 లాంటి వాహనాల నుంచి ఒక్కోసారి బాంబు పేలిన శబ్దం వస్తుంటుంది. యువత దీన్ని క్రేజ్‌గా భావిస్తున్నారు. వాహనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు దానిలో కొన్ని మార్పులు చేస్తే బుల్లెట్ సైలెన్సర్ నుంచి బాంబు పేలిన శబ్దం వస్తుంది. పక్క నుంచి వెళ్తూ ఒక్కసారిగా ఇలాంటి శబ్దం వస్తే ఎంతటి వారైనా ఉలిక్కిపడాల్సిందే. గుండె జబ్బులున్న వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కో సైలెన్సర్ ఒక్కో శబ్దం ద్విచక్రవాహనాలకు రకరకాల సైలెన్సర్లు బిగిస్తున్నారు. ఒక్కో మోడల్ సైలెన్సర్ ఒక్కో రకమైన శబ్దం విడుదల చేస్తుంది. దాన్ని బట్టి వాటికి ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. అడవి పంది అరుపులా ఉంటే దానికి వైల్డ్బోర్ ఎగ్జాస్ట్ అన్ని పేరు పెట్టారు. మరొకటి మర తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే దానిని ‘టెయిల్ గన్నర్’ అంటారు. వీటితో పాటు బ్యారెల్, గ్రీసెస్, మెగా ఫోన్, కాక్టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్ఆర్ఓ పేరిట స్పేర్‌పార్ట్ దుకాణాల్లో సైలెన్సర్లు లభిస్తున్నాయి. సైలెన్సర్ మార్చినా.. మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు నమోదు చేస్తారు. కొంత మంది నిబంధనలను ఉల్లంఘించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తీసేసి వేరే వాటిని బిగిస్తున్నారు. మరికొందరు కంపెనీ సైలెన్సర్లు ఉంచినా దానిలో ఉండే పలు ఫిల్టర్లు తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతుంది. ఇది కూడా నేరమే అంటున్నారు పోలీసు అధికారులు. ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చట్టం ఏ చెబుతుందంటే.. ► ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. ► నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు. ► సంబంధిత వాహన చోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు. ► రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రత పెరిగిందా జబ్బులు ఖాయం మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. 100 డెసిబుల్స్ దాటిన ఏ శబ్దమైనా గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ► 110 డెసిబుల్స్ దాటితే.. చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది. ► 120 డెసిబుల్స్ దాటితే.. చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. ► 160 డెసిబుల్స్ దాటితే.. చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని కొంతస్థాయిలో శాశ్వతంగా వైకల్యం ఏర్పడుతుంది. ► 190 డెసిబుల్స్ దాటితే.. కర్ణ భేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపుస్థితి తీసుకురావడం చాలా కష్టం. అవగాహన కల్పిస్తున్నాం.. వినకపోతే కేసులు పెడతాం వాహనాలకు సైలెన్సర్లు మార్చడం చట్టరీత్యా నేరం. దీనికి తోడు రోడ్లపై ఇష్టం వచ్చిన రీతిలో వాహనాల ద్వారా సౌండ్ చేస్తూ వెళ్లడం న్యూసెన్స్ అవుతుంది. వీటిపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవలే ఇటువంటి వాహనాల సైలెన్సర్లను తొలగించడం జరిగింది. వాహనదారులు కంపెనీ సైలెన్సర్లు మాత్రమే ఉంచుకోవాలి. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. - సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ సాధారణ ధ్వని స్థాయి 60 నుంచి 70 డెసిబుల్స్. నమోదవుతున్న ధ్వని స్థాయి 80 నుంచి 120. ఫలితంగా జాతీయ రహదారులు, నగరంలోని ప్రధాన రహదారుల పక్కన నివసిస్తున్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉదయం 8 గంటల మొదలు రాత్రి 10 వరకు వాహనాల శబ్దాలు హడలెత్తిస్తున్నాయి. (క్లిక్: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు) -
ప్రభుత్వం సీరియస్.. ఇకపై బడి బస్సుల్లో అవి తప్పనిసరి
సాక్షి, చెన్నై: ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల్లో సీసీ కెమెరాలను ప్రభుత్వం తప్పని సరి చేసింది. అలాగే, నలువైపులా సెన్సార్ పరికరాల్ని అమర్చాలన్న ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. గతంలో ఓ ప్రైవేటు విద్యా సంస్థ బస్సులో ఉన్న రంధ్రం నుంచి కింద పడి ఓ విద్యార్థిని మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో జనంలో ఆగ్రహావేశాల్ని రగల్చడంతో కోర్టు జోక్యం చేసుకుంది. దీంతో విద్యాసంస్థల బస్సులు, విద్యార్థులను తరలించే ప్రైవేటు ఆపరేటర్ల వాహనాలకు సంబంధించిన నిబంధనలు కఠినం చేశారు. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా బస్సులను ఆర్టీఓ అధికారులు తనిఖీలు చేసి, సర్టిఫికెట్లను మంజూరు చేస్తూ వస్తున్నారు. అయినా, ఏదో ఒక చోట విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల వాహనాల కారణంగా విద్యార్థులకు ప్రమాదాలు తప్పడం లేదు. దీంతో మోటారు వెహికల్ చట్టంలో సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వుల జారీ.. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఫనీంద్రరెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు లగ్జరీ కార్లు వంటి వాహనాల్లో ఉండే విధంగా విద్యాసంస్థల బస్సులు, వాహనాల్లో ముందు, వెనుక భాగాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. అలాగే, వాహనాలకు నలువైపులా సెన్సార్ పరికరం అమర్చేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా బస్సు ముందు, వెనుక భాగంలో ఎవరైనా ఉన్నారా..? అని డ్రైవర్ తెలుసుకునేందుకు వీలుందని వివరించారు. అలాగే, సెన్సార్ పరికరం నుంచి వచ్చే సంకేతాల మేరకు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించేందుకు వీలుందని పేర్కొన్నారు. తక్షణం ఆయా బస్సులు, వాహనాల్లో వీటిని అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని, తనిఖీలు చేయాలని ఆర్టీఓ అధికారులను, పోలీసు యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. -
మూడు ఫుల్లు.. మూడు హాఫ్ టికెట్లు..
సామర్లకోట: ఇద్దరికే పరిమితం కావాల్సిన మోటార్ సైకిల్‌పై నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఆరుగురు ప్రయాణించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. సామర్లకోట – పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ మోటార్ సైకిల్‌పై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు. అసలే ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికం. ఏమాత్రం బ్రేక్ వేసినా వెనుక ఉన్న వారు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంది. అయినప్పటికీ ఇలా బైక్‌పై వెళ్లడమేమిటని పలువురు వ్యాఖ్యానించారు. -
ట్రాఫిక్ ఉల్లంఘనలకు 15 రోజుల్లోగా ఈ–చలాన్
న్యూఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇకపై 15 రోజుల్లోగా నోటీసు(ఈ–చలాన్) జారీ చేయాల్సి ఉంటుంది. ఉల్లంఘన జరిగిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నోటీసును వాహనదారుడికి చేరవేయాలి. చలాన్ సొమ్మును వాహనదారుడు చెల్లించేదాకా సదరు ఎలక్ట్రానిక్ రికార్డును భద్రపర్చాలి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహన చట్టం–1989కు ఇటీవల సవరణ చేయడం తెల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, శరీరంపై ధరించే కెమెరా, స్పీడ్ గన్, డ్యాష్‌బోర్డు కెమెరా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) వంటి సాంకేతిక పరికరాలను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. అధికంగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమున్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కీలకమైన జంక్షన్లు, నోటిఫికేషన్లో ప్రస్తావించిన 132 నగరాలతోపాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని రోడ్డు రవాణా, హైవేల శాఖ సూచించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా వీటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. నోటిఫై చేసిన నగరాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్‌లో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 నగరాలు ఉన్నాయి. -
ఈ కారుకు నిబంధనలు వర్తించవా?!
మీర్‌పేట: ఈ కారుకు మోటార్ వాహన చట్టం నిబంధనలు వర్తించవా.? కొన్ని నెలలుగా నంబర్ ప్లేటు లేకుండానే రోడ్డెక్కుతున్న కారు. మీర్‌పేట కార్పొరేషన్ జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్ తనయుడు మోటారు వాహన చట్టం నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఇన్నోవా కారుకు నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడు. నంబర్ ప్లేటులోని ఓ నంబర్ సరిగ్గా కనిపించకపోతేనే వాహనాన్ని ఆపి మరీ జరిమానాలు విధించే ట్రాఫిక్ అధికారులకు గత కొన్ని నెలలుగా అసలు నంబర్ ప్లేటు పూర్తిగా లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్న ఈ వాహనం కనిపించడం లేదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జరిమానా విధిస్తాం... ఈ విషయంపై వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ బద్యానాయక్‌ను వివరణ కోరగా నంబర్ ప్లేటు లేకుండా వాహనాన్ని నడిపితే జరిమానాలు విధిస్తాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. -
‘పాపం.. అతడి తెలివే చలానా కట్టేలా చేసింది’
ఓ వ్యక్తి ట్విటర్లో ద్విచక్ర వాహనం నెంబరు ప్లేటును షేర్ చేస్తూ.. పుణె ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు. ఇందుకు ఓ పోలీసు అధికారి చమత్కారంగా స్పందించి.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాలు... పుణేకు చెందిన పంకజ్ అనే ట్విటర్ యూజర్ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న తెలుపు రంగు స్కూటీ నెంబర్ ప్లేటుపై.. కిరీటం ఉన్న స్టిక్కర్‌ను గుర్తించి ట్విటర్లో షేర్ చేశాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి ‘ ఈ స్కూటీ యజమానికి ఉన్న అతి తెలివి.. పాపం ఆయనను త్వరలోనే చలాన కట్టేలా చేసింది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి. కాగా మోటారు వాహన చట్టం- 1988, కేంద్ర మోటారు వాహన చట్టం 1989లోని నిబంధనల ప్రకారం.. నెంబరు ప్లేటుపై రిజిస్ట్రేషన్ నెంబరు తప్ప మరేమీ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా బొమ్మలు కానీ ఇతరత్రా గుర్తులు ఉంటే నిబంధనల ఉల్లంఘన కింద వారి మీద చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సదరు పోలీసు అధికారి పైవిధంగా స్పందించారు. His highness will unfortunately have to oblige us with a Challan soon! 📃 #TrafficRules #TrafficViolation https://t.co/rgq6OFInSF — PUNE POLICE (@PuneCityPolice) January 7, 2020 -
అంతకంటే తక్కువ జరిమానా వేయొద్దు
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో పేర్కొన్న జరిమానాల కంటే తక్కువ జరిమానాలు ఏ రాష్ట్రమూ అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. మోటారు వాహన (సవరణ) చట్టం–2019 పార్లమెంటులో ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సమ్మతి లేకుండా అందులో పేర్కొన్న దానికంటే తక్కువ జరిమానాలు విధించరాదని రాష్ట్రాలకు సూచించింది. చట్టంలో పేర్కొన్న దానికంటే తక్కువ జరిమానాలు విధించాలని ఓ రాష్ట్రం చూసినందున రవాణా శాఖ న్యాయ శాఖ సలహా తీసుకుంది. కొన్ని నేరాల్లో గుజరాత్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్‌లు జరిమానాలను తగ్గించాయని కేంద్రం వెల్లడించింది. -
రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు రైట్ రైట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రైవేటు, పెట్టుబడిదారీ విధానాలకు అనుగుణంగా ప్రపంచం పయనిస్తున్న తరుణంలో ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయం సముచితమేనని పేర్కొంది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం.. కోర్టు సమయం ముగిసిన తర్వాత 45 నిమిషాలపాటు తీర్పును వెలువరించింది. ‘దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు రవాణా వ్యవస్థ కూడా వాటిలోకి వస్తోంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పోటీతత్వం బాగా ఉంటుంది. పోటీ విధానాన్ని స్వాగతించాలి. తిరస్కరించడం సరికాదు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 67 (3)కు కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీన చేసిన సవర ణల ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల రోడ్డు రవాణాకు సమాంతరంగా 50 శాతం మించకుండా ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సర్వాధికారాలు రాష్ట్రాలకు సిద్ధించాయి. సెక్షన్ 102, 67లను కలిపి బేరీజు వేస్తే రాష్ట్రా నికి అధికారాలు ఉన్నాయని తేటతెల్లం అవుతోంది. ఇలా చేయడం ఆర్టీసీకి పోటీగా ప్రైవేటు బస్సు రూట్లను ప్రవేశపెట్టినట్లు కాదు. ఆ రెండూ సమాంతరంగా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలన్నదే చట్ట సవరణ ఉద్ధేశం. అందుకు లోబడే కేబినెట్ నిర్ణయం ఉంది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. కేంద్రమే రాష్ట్రాలకు సర్వాధికారం ఇచ్చింది.. ‘మోటారు వాహనాల చట్టం–1988లోని 67 (3), 102 సెక్షన్ల ప్రకారం రవాణా రూట్లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆర్టీసీ గుత్తాధిపత్యం లేకుండా చేసేందుకు, ఆ రవాణా వ్యవస్థకు సమాంతరంగా ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రైవేటు గ్యారేజీలకు అనుమతి ఇచ్చే అధికారం కేంద్రం చేసిన చట్ట సవరణ ద్వారా రాష్ట్రానికి వచ్చింది. అయితే, రూట్ల ప్రైవేటీకరణ 50 శాతానికి మించకూడదు. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సమ్మె వల్ల రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా రూట్ల ప్రైవేటీకరణకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లకు ఆస్కారం ఇవ్వడం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది. దురుద్ధేశాలు ఉన్నాయని భావించలేం. అడ్వొకేట్ జనరల్ వాదించినట్లుగా రాజ్యాంగం ప్రకారమే, సార్వభౌమత్వ విధానాలకు లోబడి న్యాయబద్ధమైన నిర్ణయంగానే దీనిని పరిగణించాలి. కేబినెట్ నిర్ణయం గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినందున అందులోని విషయాల్ని తీర్పులో ప్రస్తావించడం లేదు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తారు. చట్టంలోని సెక్షన్లను వేర్వేరుగా విశ్లేషించకుండా అన్ని సెక్షన్లను క్రోడీకరించితే కేబినెట్ నిర్ణయం న్యాయబద్ధంగానే ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కాలంలో రవాణా ఏర్పాట్లు లేక ఆర్టీసీలు ఏర్పాటు జరిగి నేటికీ గుత్తాధిపత్యంతో కొనసాగుతోంది. ఇప్పుడు ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు ఆపరేటర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే నిర్ణయం అమల్లోకి వస్తే కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల శ్రీకారం చుట్టినట్లు అవుతుంది’అని హైకోర్టు అభిప్రాయపడింది. కేబినెట్ తప్పుగా సిఫార్సు చేసింది.. మోటార్ వాహన చట్టంలోని 102(1)(2) ప్రకారం ఆర్టీసీ గుత్తాధిపత్యాన్ని సరిచేసే అధికారం రాష్ట్రానికి ఉందని.. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఉండే ఆర్టీసీ, ఇతర రవాణా సంస్థలకు నోటీసులు ఇచ్చి వాళ్ల వాదనలు తెలుసుకోవాలని ధర్మాసనం సూచించింది. ‘గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, 30 రోజుల గడువు ఇవ్వాలి. ఎంపిక చేసిన తేదీ/ప్రదేశాల్లో అభ్యంతరాలు స్వీకరించి వాటిపై విచారణ జరిపి పరిష్కరించాలి. అయితే మంత్రివర్గం ప్రైవేటు రూట్ల అంశాన్ని పరిశీలించాలని ఆర్టీసీ కార్పొరేషన్‌ను కోరుతూ తీర్మానం చేసింది. ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. కేబినెట్ ఆ ప్రతిపాదనను రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి చేయాలి. ఆర్టీసీ ప్రభుత్వం కాదు.. అది క్వాజీ జ్యుడీషియరీ అథారిటీ మాత్రమే. ప్రభుత్వమే చేయాలంటే ఆ అధికారిని ఉద్ధేశించి కేబినెట్ సిఫార్సు చేయాలి. అయితే, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారానే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేశాం. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉండాలి. సెక్షన్ 102 ప్రకారం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది చట్టబద్ధంగానే ఉంది. కాబట్టి మేం జోక్యం చేసుకోవడం లేదు. పిల్‌ను తోసిపుచ్చుతున్నాం. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’అని ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని, పది రోజులపాటు తీర్పు అమలును సస్పెన్షన్‌లో ఉంచాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేబినెట్ తీర్మానంపై న్యాయసమీక్ష చేయొచ్చు.. తొలుత వాదనల సమయంలో.. రాజ్యాంగంలోని 166వ అధికరణం కింద కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోరాదని ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయం తర్వాత గవర్నర్ పేరుతో లేఖ లేదా ఉత్తర్వులు వెలువడినా వాటిని న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని అధికరణం చెబుతోందని గుర్తు చేసింది. ఈ కేసులో కేబినెట్ తీర్మానాన్నే సవాల్ చేశారు కాబట్టి న్యాయసమీక్ష చేయవచ్చునని తేల్చి చెప్పింది. కేబినెట్ నిర్ణయం చట్టపరిధిలోనే జరిగిందని ఏజీ చెప్పగానే, ధర్మాసనం కల్పించుకుని.. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంపై ముందుకు వెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కేబినెట్ కోరడం తప్పు అని, ఈ ప్రక్రియ నిర్వహించే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని, దీని ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిని కేబినెట్ కోరాల్సి ఉంటుందని చెప్పింది. దీంతో ముఖ్య కార్యదర్శి ద్వారానే రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని ఏజీ హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణంలో కేబినెట్ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడం విశ్వాసరాహిత్యమే అవుతుందని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. కాగా, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం ఇంకా విచారించాల్సి ఉంది. -
డ్రైవింగ్‌లో ఫోన్ ముట్టుకుంటే ఫైన్!
న్యూఢిల్లీ : రోడ్లపై డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడటాన్ని దాదాపు అన్ని దేశాలు నిషేధించిన విషయం తెల్సిందే. అయినప్పటికీ అంతటా కొందరు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారు. బ్రిటన్‌లో భారీ ఫైన్లు, కఠిన శిక్షలు ఉన్నప్పటికీ అక్కడి కూడా మొబైల్ ఫోన్ల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ఫోన్లే మాట్లాడినట్లు సీసీ టీవీ కెమేరాలకు ఒకటి, రెండు సార్లు ఫైన్లు, అంతకన్నా ఎక్కువ దొరికితే లైసెన్స్ రద్దు లాంటి శిక్షలు విధించినా ఎందుకు నేరాలు తగ్గడం లేదనే కోణంలో పరిశీలించగా బ్రిటన్ మోటారు వాహన చట్టంలో లోపం ఉన్నట్లు తేలింది. ఇంతవరకు ఫోన్లో మాట్లాడితేనే శిక్షలు విధిస్తూ వస్తున్నారు. మొబైల్ ఫోన్లో ఫోటోలు చూసినా, తీసినా, మిస్సెజ్‌లు చదివినా, మ్యూజిక్ ఆప్‌లు సర్చ్ చేసినా శిక్షలు లేవు. మొబైల్లో ఫోన్లో ఇలాంటి చేయడం వల్లనే ప్రమాదాలు తగ్గడం లేదని నిపుణులు సూచించడంతో బ్రిటన్ ఈ రోజు నుంచి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. వాహనాన్ని నడుపుతూ ఏ కారణంతోనైనా మొబైల్ ముట్టుకుంటే చాలు 200 పౌండ్ల (18.500 రూపాయలు) వరకు ఫైన్. ఆరు పాయింట్ల విధింపు. 35 పాయింట్ల లోపున్న యువకుల్లో 17 నుంచి 25 శాతం వరకు డ్రైవర్లు మిస్సేజ్‌లు చూడడమో, సోషల్ మీడియాలు చెక్ చేసుకోవడమో చేస్తున్నారు. ఫోన్ మాట్లాడితే అద్దాల గుండా కనిపిస్తోంది. ఫోన్‌ను ముట్టుకుంటే ఎలా తెలియాలి! అందుకని అన్ని వీధుల్లో హెచ్డీ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలని బ్రిటన్ అధికారులు నిర్ణయించారు. -
‘ఫైన్’ డేస్!
సాక్షి, హైదరాబాద్: భారీ జరిమానాలతో కూడిన కొత్త మోటారు వాహన చట్టం అమలు దేశవ్యాప్తంగా వాహనదారుల్లో వణుకు పుట్టించింది. జరి మానాలపై మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఒళ్లు దగ్గరపెట్టుకొని వాహనాలు నడిపారు. అను మతిలేని/సరైన పత్రాలులేని వాహనాలను ప్రజలు బయటకు తీయ లేదు. రాష్ట్రంలోనూ రోడ్డు ప్రమాదాల్లో గణనీయమైన తగ్గుదల నమో దైంది. ఫలితంగా మరణాల సంఖ్యలో కూడా క్షీణత కనిపించింది. కొత్త వాహన చట్టం భయంతోనే.. కొత్త మోటారు వాహన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దానికి నెల ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రచార సాధనాలు, కూడళ్లలో ప్రచారం చేశారు. ప్రతి ఉల్లంఘనకు రూ. వేలల్లో ఉన్న జరిమానాలు వాహనదారులను హడ లెత్తించాయి. ఈ పరిణామం రాష్ట్ర వాహనదారులపైనా కనిపించింది. ఫలితంగా తెలంగాణ రోడ్ సేఫ్టీ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జనవరి నుంచి జూలై వరకు 3,316గా నమోదైన మరణాల సంఖ్య ఆగస్టు 6 నాటికి 3,833కి, సెప్టెంబర్ 3వ తేదీ నాటికి 4,187కు చేరింది. ఈ ఏడాదిలో ప్రతి నెలా సగటున 500 మందికిపైగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఆగస్టులో నిర్వహించిన ప్రచారం కారణంగా మరణాల సగటు 350కి తగ్గింది. అంతేకాదు మిగిలిన అన్ని నెలల్లో ఒకరోజుకు సగటున 17 మంది మరణించగా అది 11–14కి పడిపోవడం గమనార్హం. క్షతగాత్రుల సంఖ్య రోజుకు సగటున 64 చొప్పున ఉండగా ఈ రెండు నెలల్లో 45 నుంచి 50కి తగ్గింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. జూలైలో 5 లక్షల వరకు ఉన్న కేసులు ఆగస్టు నాటికి 4 లక్షలకు, సెప్టెంబర్‌లో కేవలం 95 వేలుగానే నమోదయ్యాయి. అయితే భారీ జరిమానాల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త వాహనచట్టాన్ని అమలు చేయబోమంటూ ప్రభుత్వం ప్రకటించడంతో గత 15 రోజులుగా క్రమంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం గమనార్హం. హైదరాబాద్ కమిషనరేట్‌లోనే కాదు పొరుగున ఉన్న సైబరాబాద్, రాచకొండలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలు మన భద్రత కోసమే: మోటారు వాహనాల చట్టం సహా ఏ ఉల్లంఘన అయినా మన భద్రత కోసమే అన్నది గుర్తుంచుకోవాలి. ఎవరికి వారు నిబంధనల్ని కచ్చితంగా పాటించాలి. అలా కాకుంటే కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కోణంలో వాహనచోదకుల్లో మార్పు తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా అధిక వేగంతో వాహనాలు నడిపే టీనేజర్లు, కాలేజీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – ట్రాఫిక్ అధికారులు గ్రేటర్లో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు... కమిషనరేట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ (15 వరకు) హైదరాబాద్ 5,19,043 4,13,743 95,602 1,02,536 రాచకొండ 1,68,303 1,29,894 54,459 44,091 సైబరాబాద్ 2,64,631 2,07,638 1,06,721 – నగర కమిషనరేట్‌లో ఇలా... జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కాంటాక్ట్ కేసులు 59,039 54,944 30,253 18,870 నాన్–కాంటాక్ట్ 4,22,134 3,23,074 42,931 69,604 ఇతర కేసులు 37,870 35,725 22,418 14,062 కీలక ఉల్లంఘనల్లో... జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డ్రంక్ డ్రైవింగ్ 2267 2204 810 606 వితౌట్ హెల్మెట్ 3,95,513 3,08,413 53,988 74,951 రాంగ్ పార్కింగ్ 27,634 31,876 11,479 9506 రాంగ్ సైడ్ డ్రైవింగ్ 25,878 17,751 1642 2281 రాంగ్ నెంబర్ ప్లేట్ 16,719 9390 3378 5262 -
హెల్మెట్ పెట్టుకోలేదని బస్సు డ్రైవర్‌కు చలాన్!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా విధించేస్తున్నారు. తాజాగా బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ పెట్టుకోలేదని ఆన్లైన్ చలాన్ విధించారు. హెల్మెట్ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ. 500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. నోయిడాకు చెందిన నిరాంకార్ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని, అందుకు రూ. 500 చలాన్ చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు నోటిసు పంపారు. దీంతో నిరాంకర్ సింగ్, ఆయన డ్రైవర్ బస్సు నడిపేందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్ వస్తే.. ఇక మిగతా చలాన్లు ఎంతవరకు సవ్యంగా వస్తున్నాయన్నది సందేహాలు రేకెత్తిస్తోందని, దీనిపై ట్రాఫిక్ అధికారులను సంప్రదించడమే కాదు.. అవసరమైతే న్యాయం పోరాటం చేస్తానని నిరాంకర్ సింగ్ స్పష్టం చేశారు. -
హెల్మెట్ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!
అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన చట్టంతో జనం బెంబేలెత్తుతున్నారు. భారీ చలాన్లకు భయపడి వాహనాలతో రోడ్లపైకి రావాలంటేనే జడుసుకుంటున్నారు. అయితే, ఉదయ్‌పూర్ జిల్లాలోని బొడేలిలో నివాముండే జకీర్ మోమన్ అనే వ్యక్తి మాత్రం హెల్మెట్ లేకుండానే యథేచ్ఛగా బైక్‌పై తిరుగుతున్నాడు. దీంతో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకుని భారీ ఫైన్ వేశారు. కానీ, అతను జరిమానా చెల్లించేందుకు నిరాకరించాడు. ఆ చుట్టుపక్కల పట్టణాలన్నీ వెతికినా తన తలకు సరిపడా హెల్మెట్ దొరకడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. దయుంచి తన భారీ తలకు ఓ హెల్మెట్ జాడ చెప్పండని వేడుకున్నాడు. కావాలంటే చెక్ చేసుకోండని అక్కడున్న హెల్మెట్లు పెట్టుకుని చూశాడు. ఒక్కటి కూడా అతని తలకు సరిపోలేదు. భారీ తల కారణంగానే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నానని.. తనకు ఫైన్ వేయొద్దని పోలీసులకు విన్నవించాడు. (చదవండి : ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు) జకీర్ వాహనానికి మిగతా అన్ని పేపర్లు సక్రమంగా ఉండటంతో అతనికి ఎలాంటి ఫైన్ వేయకుండా ట్రాఫిక్ పోలీసులు వదిలేశారు. ఇదిలాఉండగా.. నూతన మోటారు వాహన సవరణ చట్టంపై తీవ్ర విమర్శలు రావడంతో గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్టున్న ముఖ్యమంత్రి విజయ్ రూపాని ప్రకటించారు. ఇక గుజరాత్ బాటలోనే కర్ణాటక ప్రభుత్వం నడిచే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో అన్నారు. (చదవండి : ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!) -
ఎడ్ల బండికి చలానా
న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో భారీ చలాన్లపై ప్రజలు తీవ్ర ఆందోళన చేశారు. వారి నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తుండటంతో ఆగ్రహం చెందిన డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. చార్బా గ్రామానికి చెందిన రియాజ్ హసన్ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం మొదలైంది. అయితే వాహన చట్టంలో ఎడ్లబండికి చలానా విధించే నిబంధన లేదని తెలుసుకున్న పోలీసుల నాలిక్కరుచుకున్నారు. అనంతరం చలాన్ రద్దు చేసినప్పటికీ, రైతుల్లో ఈ విషయం తీవ్ర ఆవేదన కలిగించింది. భారీ చలాన్లపై రైతులు సోమవారం రోడ్డెక్కడంతో నిరసన హింసాత్మకంగా మారింది. -
భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు నిర్ణయిస్తూ కేంద్ర మోటారు వాహనాల చట్టంకు చేసిన సవరణలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ చలాన్లు విధిస్తున్నారు. హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లో మొదటి ఐదు రోజులు నిర్వహించిన తనిఖీల్లోనే ట్రాఫిక్ పోలీసులు 1.4 కోట్ల రూపాయలను చలాన్ల రూపంలో రాబట్టారు. కొన్ని సార్లు వాహన ఖరీదు కంటే జరిమానా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. గురుగావ్‌లో ఓ ద్విచక్ర వాహనం దారుడికి పలు నిబంధనల ఉల్లంఘన కింద ట్రాఫిక్ పోలీసులు ఏకంగా 23 వేల రూపాయల జరిమానా విధించారు. రాజస్థాన్‌లో రిజిస్టర్ అయిన ఓ ట్రక్కుకు సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీ పోలీసులు 1. 41 లక్షల రూపాయల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి తద్వారా పోతున్న ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచింది. అయితే దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావించడం పొరపాటే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముందుగా రోడ్డు ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణం విలువెంతనే అంశంపైన దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ అమిత్ భట్ చెప్పారు. కొన్ని సార్లు జరిమానాలు వాహనం విలువకన్నా ఎక్కువగా ఉంటున్నాయని, అది ఎంత అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అధిక రెవెన్యూ వసూళ్ల కోసమే మోదీ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాలను పెంచిందంటూ విమర్శిస్తున్న వారూ ఉన్నారని భారీగా పెంచిన జరిమానాలను పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిరాకరించగా, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు జరిమానాల మొత్తాన్ని తగ్గించాయి. రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలు ఈ అంశాన్ని ఇంకా పరిశీలిస్తున్నాయి. ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణాల విలువను ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఎలా లెక్క గడుతుందో చూడండంటూ భట్ వ్యాఖ్యానించారు. వాహనదారుల నడవడికను పరిశీలించకుండా ట్రాఫిక్ జరిమానాలను పెంచుకంటూ పోవడం హ్రస్వ దృష్టియే అవుతుందని పారిశ్రామిక పరిశోధన సంస్థ ‘కేర్ రేటింగ్స్’ డిప్యూటీ మేనేజర్ దర్శిణి కన్సారా అన్నారు. జరిమానాలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు కూడా దేశంలో ఎంత మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో, వారిని ఎలా అరికట్ట వచ్చో అనే అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జరిమానాలను పెంచడం వల్ల ప్రయోజనం లేదని, పైగా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలను కని పెట్టడం కూడా కష్టమేనని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘బిహేవియరల్ సైంటిస్ట్’ ఆనంద్ దామిని తెలిపారు. అతి వేగం వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయని, ముందుగా అతి వేగాన్ని అరికట్టే విషయంపై దష్టిని కేంద్రీకరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. 2018 సంవత్సరంలో జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 వేల మంది మరణించారని, వారిలో కేవలం 5 శాతం కేసులో తాగి నడిపిన కేసులు ఉన్నాయని, మిగతా ప్రమాదాల్లో ఎక్కువ వరకు అతి వేగం వల్ల జరిగినవేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రకటించడం ఇక్కడ గమనార్హం. -
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
-
ప్రమాదాల నివారణకు నయా రూల్!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలోని ఏ రోడ్డును చూసినా రక్తపు మరకలే కనిపిస్తాయి. నిబంధనలు పాటించకపోవడంతో జాతీయ రహదారి, అంతర్రాష్ట్ర రహదారులు, గ్రామీణరోడ్లపై సైతం ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతేడాది 763 ప్రమాదాలు జరిగితే.. ఈ ఏడాది జూలై వరకు 337 ప్రమాదాలు జరిగినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదాలను నివారించడానికి పోలీసుశాఖ నిబంధనలను కఠినతరం చేసింది. నేటినుంచి ఎవరైనా ట్రిపుల్‌రైడింగ్ చేసినా..హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపినా.. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ, సీటుబెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసినా..లైసెన్సు లేకున్నా.. చివరికి చిన్నపిల్లలకు వాహనాలు ఇచ్చినా.. భారీగా జరిమానాలతోపాటు జైలుశిక్ష వేయనున్నారు. పెరిగిన వాహనాల వినియోగం జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఒక రోజులో 90కిపైగా ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ చే స్తున్నారు. ఇక కార్లు 5నుంచి 8వరకు ఉంటున్నా యి. ఆటోల ఇతర వాహనాలు కలిపి మరో పది కి పైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 4,25,470 వాహనాలు ఉంటే దీంట్లో కార్లు 21,603, ద్విచక్ర వాహనాలు 3,20,457 ఉన్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక ద్విచక్ర వా హనం ఉంటోంది. కొందరి వద్ద రెండేసి ఉంటున్నాయి. అవసరం లేకున్నా హోదా కోసం కొను గోలు చేస్తున్నారు. సరకుల రవాణా, ప్రయాణి కుల తరలింపు కోసం కూడా వాహనాలు కొ నేస్తున్నారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 600 వరకు వాహనాలు ఉన్నట్లు అధికారుల అంచనా. నిత్యం ఎన్నో ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వినియోగం జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇదే సమయంలో ఈ వాహనాల ప్రమాదాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్ల ప్రమాదం జరిగితే, మరికొన్ని సందర్భాల్లో ఇతర వాహనదారుల తప్పిదంతో చోటు చేసుకుంటున్నాయి. సందర్భం ఏదైనా ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో.. తాగి వాహనాలు నడిపేవారు ఇటీవల పెరిగారు. వీరి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై లారీలు ఇతర భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు రాత్రివేళల్లో మద్యం తాగుతున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు నడిపే వారుసైతం మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. మత్తులో వాహనాలను ఇష్టారాజ్యంగా నడపటంతో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లోనూ రహదారుల వెంబడి బార్లు, మద్యం దుకాణాలు ఉండటంతో ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. నూతన చట్టంతోనైనా మారాలి నూతన మోటారు వాహన చట్టాన్ని కేంద్రం తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం ఇది వరకున్న జరిమానాలు దాదాపు ఐదింతలకు పెంచారు. ప్రధానంగా మద్యం తాగి, అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్లకు బైక్‌లు ఇచ్చే అంశాలపై జరిమానా భారీగా పెంచారు. అయితే పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో వాహనదారులను చైతన్యం చేస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. వేలల్లో కేసులు..రూ.కోట్లలో జరిమానాలు మహబూబ్‌నగర్ జిల్లాలో గత జనవరి నుంచి జూలై వరకు మైనర్ డ్రైవింగ్‌లో 2,743, హెల్మెట్ 5,765, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన కేసులు 4,321, ట్రిబుల్ రైడింగ్ 680, ఓవర్‌స్పీడ్ 2,345, సీటు బెల్టు 1,132 కేసులు నమోదు చేశారు. మొత్తంగా 18,640 కేసులు నమోదు చేయగా వాటిలో రూ.1,52,68,110 జరిమానాలు విధించారు. 290 డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో రూ.4,45,000 జరిమానాలు విధించా రు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి నుంచి ఆగస్టు వరకు ఓవర్ లోడ్ 78 కేసులు, లైసెన్స్ లేకుండా 433 కేసులు నమోదు చేశారు. నేటినుంచే అమలు నేటి నుంచే కొత్త జరిమానాలు రానున్నాయి. రోడ్లపై వాహనాలు నడిపే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజు రానే వచ్చింది. గతంలో ఏం అవుతుందిలే అనుకున్న వాళ్ల జేబులకు నేటి నుంచి చిల్లు పడనుంది. నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వస్తే నెల జీతం పోలీసులకు కట్టాల్సిందే అనే విషయం వాహనదారులు గుర్తు పెట్టుకుని రోడ్లపైకి రావాలి. -
దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త వెహికిల్ చట్టం
-
రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్
మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తెలిసీతెలియని తనంలోని మైనర్లకు తల్లిదండ్రులే బైక్ ఇచ్చి జనం ప్రాణాలకు మీదుకు తెస్తున్నారు. రహదారిపై డ్రైవింగ్ రూల్స్ పాటించకుండా వన్‌వేలో వెళ్లడం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. తాగి వాహనంతో రోడ్డెక్కితే, మైనర్లకు వాహనాలు నడిపితే కారకులకు పెనాల్టీల వాతలు పెట్టడానికి నిబంధనలు కఠినం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి వారికి భారీగా పెనాల్టీ కిక్ ఇవ్వనున్నారు. సాక్షి, నెల్లూరు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.. పెనాల్టీలతో కిక్ దింపనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వ మోటారు వాహన చట్టానికి సవరణ తెచ్చింది. ఇందుకు అవసరమైన బిల్లుకు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం లభించింది. ఈ చట్ట సవరణ ద్వారా వాహన చోదకులకు భరోసా కల్పించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే అంశాల విషయంలో కూడా తీసుకునే చర్యలను కఠిన తరం చేసింది. ఇక జరిమానాలతో పాటు ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ అంశంలో ‘సమాజసేవ’ చేయాలనే శిక్షను కూడా ఈ చట్ట సవరణతో అమల్లోకి తెస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల రక్షణార్థం చేసే వైద్య సహాయ చర్యలను సదుద్దేశంతో పరిగణించే అంశాన్ని చట్టంలో పొందు పరిచారు. ఈ విధంగా సహాయం చేసే వారికి పోలీసు, కోర్టు, వేధింపులు లేకుండా ఈ చట్ట సవరణ దోహద పడుతోంది. మైనర్లు వాహనాలు నడిపితే నేరమే ఇకపై జరిగే రోడ్డు ప్రమాదాలకు రోడ్ల నిర్మాణం లోపమే కారణమైతే సదరు రోడ్డు నిర్వహణ శాఖ నుంచి పరిహారాన్ని వసూలు చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకు రూ.25 వేలు జరిమానాను విధించడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తే దానికి మూల్యాన్ని కారకుడైన మైనర్ తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో పాటు వాహన యజమాని కూడా చెల్లించాల్సి వస్తుంది. వాహన ప్రమాదాల్లో పరిహారం కోసం దాఖలు చేసుకొనే వ్యాజ్యాలను ఇకపై ప్రమాదం జరిగిన ఆరు నెలల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తు తెలియని వాహనాల ప్రమాదంలో సంభవించే మరణాల కుటుంబాలకు క్షత్రగాత్రులకు పరిహారాన్ని చెల్లించే ఈ చట్టంలో పొందు పరిచారు. ఈ పథకం కింద మరణానికి రూ.2 లక్షలు, క్షత్రగాత్రులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం దక్కేలా చర్యలు చేపడతారు. కొత్తగా వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పన్నులు, సీజ్‌ల ద్వారా ఈ నిధిని సమకూర్చుతారు. ఈ నిధి ద్వారా వాహన ప్రమాద బాధితులకు వినియోగిస్తారు. ఇలా అనేక మార్పులతో పాటు నిబంధనలు ఉల్లంఘనలకు జరిమానాలను విపరీతంగా పెంచుతూ ఈ దిగువ సవరణలు చేశారు. జిల్లాలో కొనసాగతున్న స్పెషల్ డ్రైవ్ నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో జరుగుతుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంవీ యాక్ట్ కింద 1,23,309 కేసులు నమోదు చేయగా, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారు. జిల్లాలో కేసుల వివరాలు సంవత్సరం ఎంవీ యాక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ 2017 1,33,402 1,172 2018 2,53,978 4,260 2019 1,23,,309 6,015 (ఇప్పటి వరకు) -
ఉల్లంఘిస్తే జరిమానాల మోతే
సాక్షి, హైదరాబాద్: సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాన్ని నడుపుతున్నారా? రూ. వందే కదా ఫైన్ కట్టేసి పోదామనుకుంటున్నారా? మీరు పొరబడ్డట్టే. ఇక నుంచి ఇలాంటి తప్పిదాలకు రూ. వెయ్యి సమర్పించుకోవాల్సిందే. తాగిన మైకంలో డ్రైవింగ్ చేసి రూ. 2 వేలు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకోకండి. చట్టం దాన్ని రూ. 10 వేలకు పెంచింది మరి. ఇష్టమొచ్చినట్లు బండి నడిపితే ఎవరు చూస్తారులే అని గప్‌చుప్‌గా ఉందామనుకుంటే ట్రాఫిక్ పోలీస్ రూ. వెయ్యికి బదులు రూ. 5,000 కట్టించుకుంటాడు. లైసెన్సే లేకుండా భేషుగ్గా వాహనం నడిపేస్తున్నారా? రూ. 500 నోటు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతిలో పెడితే అయిపోతుందనుకోకండి. అందుకు రూ. 5,000 జరిమానా కడితే తప్ప మీరు తప్పించుకోలేరు. ఫోన్లో మాట్లాడుతూ బండి నడిపితే ప్రస్తుతం రూ. వెయ్యి కట్టించుకుంటున్నారా.... ఇకపై రూ. 5,000 కట్టితీరాల్సిందే. రోడ్డు ప్రమాద బాధితులకు ఇప్పటివరకూ ప్రభుత్వం ఇస్తున్న రూ. 25,000 కాస్తా ఇకపై రూ. 2 లక్షలకు పెరగనుంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్న నాణ్యతలేని రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు చెక్‌పెట్టే రోజులొచ్చేశాయి మరి. ఇప్పుడివన్నీ ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా? అదేనండీ ప్రస్తుతం లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ ఆమోదం కోసం వేచి ఉన్న మోటారు వాహనాల సవరణ బిల్లు 2017 పాస్ అయితే పైవన్నీ అమల్లోకి వస్తాయి. ఏటా 1.46 లక్షల రోడ్డు ప్రమాదాలతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న భారత్ 2020కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రమాదాల అంచున సాగే ప్రయాణాలకు ఫుల్స్టాప్ పడుతుందని అంతా ఆశిస్తున్నారు. బిల్లులో ఇంకా ఏమున్నాయి....? ♦ వాహనం నిర్ణీత ప్రమాణాల మేరకు లేకపోతే ప్రభుత్వం వాటిని వెనక్కు తెప్పించవచ్చు. కంపెనీలకు సైతం రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ♦దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరి చేశారు. ♦ కాలంచెల్లిన డ్రైవింగ్ లైసెన్స్‌ను తిరిగి పునరుద్ధరించుకోవడానికి గతంలో ఉన్న నెల గడువును ఏడాదికి పెంచారు. ♦ ప్రమాదాల్లో మరణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిమితిని రూ. 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు గురయ్యే వారికి రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇకపై ఆ పరిమితి ఉండదు. రోడ్డు ప్రమాదాల్లో 6 నెలల్లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మోటారు వాహనాల యాక్సిడెంట్ ఫండ్‌లో ఇకపై ఇన్సూరెన్స్‌ను కూడా చేర్చారు. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహన యజమాని లేదా మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులు, వాహన యజమానులకు ఈ ప్రమా దం తెలియకుండా జరిగినట్టు లేదా తాము నివారించే ప్రయత్నం చేశామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయి తే మోటారు వాహన రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. జువైనల్ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణ కల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. -
ఫోన్లో మాట్లాడుతూ నడిపితే 5 వేలు ఫైన్!
రోడ్డు ప్రమాదాల నివారణకు అత్యంత కీలకంగా భావిస్తోన్న మోటారువాహనాల సవరణ బిల్లు 2017, లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. రాష్ట్రప్రభుత్వాల అధికారాలను ఈ బిల్లు నియంత్రిస్తోందనీ, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైందన్న ఆరోపణలతో విపక్షాలు ఈ బిల్లుని అడ్డుకున్నాయి. అయితే విచ్చలవిడిగా జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే కీలకమైన అంశాలు ఈ బిల్లులో పొందుపరిచారు. యేడాదికి 1.46 లక్షల ప్రమాదాలతో ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉన్న భారతదేశం 2020 కల్లా రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రమాదాల అంచున సాగే ప్రయాణాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా ఆశిస్తున్నారు. ట్రాఫిక్ అతిక్రమణలకు విధించే ఫైన్లు మొదలుకొని, ప్రమాదాలకు కారణమైన మైనర్ల విషయంలో వాహన యజమానులను సైతం బాధ్యులను చేసేలా ఈ బిల్లుని తయారుచేశారు. ఈ బిల్లులో ఏముంది? 1. వాహన రిజిస్ట్రేషన్‌కీ, డ్రైవింగ్ లైసెన్స్‌కీ ఆధార్ తప్పనిసరి. 2. వాహనాలు ఢీ కొట్టి పారిపోయిన దుర్ఘటనల్లో ప్రభుత్వమే బాధితులకు నష్టపరిహారంగా ప్రస్తుతం చెల్లిస్తోన్న 25,000 రూపాయలను 2 లక్షలకు పెంచారు. 3. ప్రమాదాలకు మైనర్లు కారణమైన సందర్భంలో వాహనయజమాని కానీ, సదరు మైనరు సంరక్షకులుగానీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సంరక్షకులకు గానీ, వాహన యజమానులకు గానీ ఈ ప్రమాదం తెలియకుండా జరిగినట్టు, లేదా తాము నివారించే ప్రయత్నం చేసామని నిరూపించుకుంటే తప్ప వారే మైనర్ల ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వారికి తెలిసి జరిగినట్టయితే మోటారు వాహనం రిజిస్ట్రేషన్ రద్దుఅవుతుంది. జువైనల్ చట్టం ప్రకారం నేరస్తులను విచారిస్తారు. 4. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునే వారికి ఈ బిల్లు రక్షణకల్పిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తోడ్పడిన వారిని నేరంలో భాగం చేయకుండా ఇది నివారిస్తుంది. బాధితులను ఆసుపత్రిలో చేర్చినప్పుడు సైతం వారు కోరితే వారి వివరాలను పోలీసులు, ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. 5. మత్తుపానీయాలు సేవించి వాహనాలు నడిపిన వారికి ఇప్పుడు విధించే ఫైన్‌ని 2000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. 6. ఇష్టమొచ్చినట్టు రాష్‌గా వాహనాలు నడిపితే విధించే జరిమానాను 1000 రూపాయల నుంచి 5000 రూపాయలకు పెంచారు. 7. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన నేరానికి యిప్పుడు విధిస్తోన్న 500 రూపాయల జరిమానాను 5000 రూపాయలకు పెంచారు. 8. అతివేగంగా వాహనాలు నడిపినందుకు ప్రస్తుతం విధిస్తున్న 400 రూపాయల ఫైన్‌ని 1000, 2000 వరకు పెంచారు. 9. సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనం నడిపితే ప్రస్తుతం 100 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. దాన్ని 1000 రూపాయలకు పెంచారు. 10. ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే ప్రస్తుతం 1000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. అది 5000లకు పెంచారు. 11. మోటారు వాహనాల యాక్సిడెంట్ ఫండ్‌లో ఇన్సూరెన్స్ ని కూడా చేర్చారు. 12. దివ్యాంగులకు అవసరమైన రీతిలో వాహనాల నిర్మాణాన్ని తప్పనిసరిచేసారు. 13. నాణ్యతలేని రోడ్లను వేసినందుకు కాంట్రాక్టర్లు సైతం ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 14. రోడ్డు ప్రమాదాల్లో ఆరునెలల లోపే బాధితులు నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15. ప్రమాదాల్లో మరణాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పరిమితిని 10 లక్షలు, తీవ్రమైన గాయాలకు 5 లక్షల చొప్పున చెల్లించాలని 2016 చట్టం పేర్కొంది. ఇప్పుడు 2017 మోటారు వాహనాల బిల్లు ఈ పరిమితిని ఎత్తివేసింది. 16. కాలం తీరిన డ్రైవింగ్ లైసెన్స్‌ని తిరిగి నమోదుచేయించుకోవడానికి గతంలో ఉన్న నెల రోజుల గడువుని యేడాదికి పెంచారు. 17. ఉండాల్సిన స్థాయిలో వాహనం మోటారు నాణ్యత లేనట్టు భావిస్తే ఆయా వాహనాలను ప్రభుత్వమే తిరిగి రప్పించుకోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన వాహనాలు తయారు చేసినందుకుగాను 500 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఈ బిల్లులో కల్పించారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రాణాలు ముఖ్యమా? రాజకీయాలా!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై నడుస్తున్న వాహనాల్లో రెండు శాతం వాహనాలు మాత్రమే దేశీయ రోడ్లపై నడుస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం ప్రమాదాలు భారత్‌లోనే జరుగుతున్నాయని అంతర్జాతీయ లెక్కలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా ఒకటిన్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ స్వయంగా పార్లమెంట్‌కు తెలియజేశారు. దేశంలో రోడ్డు నెట్వర్క్ అత్యంత అధ్వాన్నంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల కారణంగా భారత్‌కు ప్రతి ఏటా తన జాతీయ స్థూలాదాయంలో మూడు శాతం అంటే, 5,8000 లక్షల డాలర్ల నష్టం వాటిల్లుతోందని ‘ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక వ్యవహారాల కమిషన్’ తెలియజేసింది. ఈ నేపథ్యంలో దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరగుపర్చాల్సిన అవసరం ఉందని, అందుకు 30 ఏళ్ల నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలని నితిన్ గడ్కారీ నిర్ణయించారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చిన కొత్తలోనే బిల్లు ప్రతిపాదన తీసుకరాగా, సుదీర్ఘ కసరత్తు తర్వాత 2017లో బిల్లు తుది రూపు దాల్చింది. ఈ బిల్లును అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో లోక్‌సభ ఆమోదించగా, రాజ్యసభ అదే సంవత్సరం ఆగస్టు నెలలో ‘ఎంపిక కమిటీ’ పరిశీలనకు పంపించింది. ఆ కమిటీ నుంచి తగిన సూచనలతో బిల్లు సోమవారం నాడు రాజ్యసభలో చర్చకు వచ్చింది. దీన్ని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను సడలిస్తుందన్న కారణంగా అన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకించగా, కార్పొరేషన్లకు మేలు చేసే విధంగా కూడా ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాస్తవానికి బిల్లులో చాలా మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచడంతోపాటు రోడ్ల నిర్మాణంలో, డిజైన్లలో, నిర్వహణలో లోపాలుంటే అందుకు కాంట్రాక్టర్లను, కన్సల్టెంట్లను, ప్రభుత్వ సంస్థలను బాధ్యులను చేస్తూ కఠిన శిక్షలు విధించడం, కొన్ని రకాల యాక్సిడెంట్లలో బాధితులకు నష్టపరహారం చెల్లించడం కోసం రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేయడం, సరైన ప్రమాణాలకు అనుగుణంగా లేని మోటారు వాహనాలను, విడిభాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని సంబంధిత కంపెనీలకు పంపించడం, ఓ కంపెనీపై 500 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం విధించడం లాంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో బాధితులను ఆదుకునే పౌరులకు అధికారుల నుంచిగానీ చట్టం నుంచిగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడడం, వీలైతే రివార్డులివ్వడం లాంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. తాగి వాహనాన్ని నడిపితే పదివేల రూపాయల జరిమానా, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే ఐదువేల రూపాయలు, రెడ్ సిగ్నల్ దాటినా, సీటు బెల్టు పెట్టుకోక పోయినా, హెల్మట్ ధరించక పోయినా వెయ్యి రూపాయల జరిమానాలను విధించాలని ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. 30 ఏళ్ల అనంతరం తొలిసారి జరిగిన కసరత్తును రాష్ట్ర పాలకపక్ష పార్టీలు కాదనడం బాధాకరమే. రాష్ట్రాలు కూడా చట్టాలు తేవచ్చు దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఒక్క కేంద్రమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రాలు కూడా తమ పరిధిలో పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. ‘విజన్ జీరో ప్రోగ్రామ్’ పేరిట హర్యానా ప్రభుత్వం గతేడాది చర్యలు తీసుకుంది. దీర్ఘకాలంలో రోడ్డు ప్రమాదం కారణంగా ఒక్కరి ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో తీసుకున్న చర్యల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రమాదాలు ఐదు శాతం తగ్గాయి. అదే తరహాలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ‘జీరో రోడ్ ఫాటలిటీ’ కార్యక్రమాన్ని చేపట్టగా ఇప్పటికీ పది శాతం ప్రమాదాలు తగ్గాయి. -
ఐదుగురు ఎంవీఐలపై సస్పెన్షన్ వేటు
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లపై సర్కార్ కొరడా సాక్షి, హైదరాబాద్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన ఐదుగురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల(ఎంవీఐ)పై సోమవారం ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మోటారు వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి విజయవాడ ఆటోనగర్‌లో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు నగరంలోని ఖైరతాబాద్, ఉప్పల్, బండ్లగూడతో పాటు వికారాబాద్, ఖమ్మం రవాణా కార్యాలయాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు బాధ్యులైన కె.చంద్రశేఖర్(ఖైరతాబాద్), షకీల్ అహ్మద్(బండ్లగూడ), ఎం.సురేశ్‌రెడ్డి(ఉప్పల్), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(వికారాబాద్), బి.శంకర్(ఖమ్మం) అనే ఐదుగురు ఎంవీఐలపైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరానికి చెందిన సుమారు 50కి పైగా ఆయిల్ ట్యాంకర్లను పరిశీలించకుండా విజయవాడలో ఉన్న వాటికి కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టడం సంచలనమైంది. ఏప్రిల్, మే నెలల్లో చోటుచేసుకున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉపరవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో కమిటీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. విజయవాడలో నిర్మాణ దశలో ఉన్న వాహనాల ఫొటోలతో సహా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా వాహనాల ఇంజిన్, చాసీస్ నంబర్లను స్కానింగ్ చేయాలని సూచించింది. తెల్ల కాగితంపైన ఈ నంబర్లను పెన్సిల్‌తో నమోదు చేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని పేర్కొంది. కమిటీ అందజేసిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
లైసెన్సు లేకుండా నడిపితే.. 5వేల ఫైన్!
మోటారు వాహనాల చట్టం వసరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీని ప్రకారం ఇప్పటివరకు ఉన్న జరిమానాలన్నీ భారీగా పెరిగిపోనున్నాయి. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపేవారికి ఇంతకుముందు రూ. 500 జరిమానా విధిస్తుండగా అది 5 వేలకు చేరుకుంది. అలాగే డ్రంకెన్ డ్రైవింగ్‌కు గతంలో రూ. 2వేల జరిమానా విధిస్తే, ఇప్పుడది రూ. 10 వేలకు పెరిగింది. హెల్మెట్ లేకపోతే గతంలో వంద రూపాయలు కడితే సరిపోయేది. ఇప్పుడు వెయ్యి కట్టడంతో పాటు మూడు నెలల పాటు లైసెన్స్ కూడా సస్పెండవుతుంది. ప్రయాణికులను ఓవర్లోడింగ్ చేస్తే, ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున కట్టాలి. మైనర్లు వాహనం నడిపినప్పుడు ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే, వాళ్ల తల్లిదండ్రులకు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. అలాగే బాధితుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పదిరెట్లు పెంచారు. థర్డ్ పార్టీ బీమా, టాక్సీ సంస్థల నియంత్రణ, రహదారి భద్రత లాంటి పలు అంశాలపై కూడా ఈ కొత్త బిల్లు స్పష్టతనిస్తుంది. కొత్త చట్టం ప్రకారం మోటారు వాహన ప్రమాదాల్లో థర్డ్ పార్టీ బాధ్యత అపరిమితం అవుతుంది. ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షల చొప్పున చెల్లించాలి. రోడ్డు మీద నడిచే అన్ని వాహనాలకు తప్పనిసరిగా బీమా ఉండాలని నిర్దేశిస్తోంది. పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులు, గార్డియన్లను బాధ్యులుగా చేస్తోంది. దాంతోపాటు.. వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా రద్దు చేస్తున్నారు. -
అధిక పరిహారం మంజూరు చేయొచ్చు
హైకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం కింద బాధితులు కోరే పరిహారం కన్నా అధిక పరిహారాన్ని మంజూరు చేసే అధికారం కోర్టులకు, ట్రిబ్యునళ్లకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు ఆర్.సుభాష్‌రెడ్డి, కె.సి.భాను, నూతి రామ్మోహనరావు, పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన విస్తృత ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ అంశంపై పడిగాల లింగారెడ్డి వర్సెస్ సట్ల శ్రీనివాస్ కేసులో జస్టిస్ మోతీలాల్ బి.నాయక్, జస్టిస్ రోహిణిలతో కూడిన ధర్మాసనం 2001లో తీర్పునిచ్చింది. ఈ తీర్పునకు పూర్తి విరుద్ధంగా, 2002 జనవరిలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ చింతల అలియాస్ ఎ.నర్సింహ కేసులో జస్టిస్ బి.ఎస్.ఎ.స్వామి, జస్టిస్ డి.ఎస్.ఆర్.వర్మలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటైంది. 2002, 2013, 2014, 2015లలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విస్తృత ధర్మాసనం.. తాజా తీర్పు వెలువరించింది. గతంలో జస్టిస్ బి.ఎస్.ఎ. స్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. -
ఇక బాదుడే..
ఆదిలాబాద్ క్రైం : నేటి యువతరం రయ్‌మని రోడ్లపైకి దూసుకెళ్లడం.. ప్రమాదాలకు గురికావడం పరిపాటి. ప్రస్తుతం కుర్రకారు స్పీడుకు బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్త చట్టం తెస్తోంది. వాహనం తీసి రోడ్లపైకి రావాలంటేనే భయపడేలా చట్టానికి పదును పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ఈ చట్టం ద్వారా భారీగా జరిమానా విధించి కొరడా ఝులింపించాలని భావిస్తోంది. అంతా పెద్ద మొత్తంలో జరిమానా కట్టేదానికన్నా.. అన్ని పత్రాలు ఉంటేనే వాహనం రోడ్డుపైకి తీద్దాం అనే భయాన్ని నెలకొల్పనుంది. ఇప్పటి వరకు చిన్నపాటి జరిమానాలతో సరిపెట్టి.. స్పెషల్ డ్రైవ్‌ల పేరుతో హల్చల్ చేసినా.. వాహ నదారుల్లో పెద్ద మార్పులేవి రావడం లేదు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లెసైన్సు లేకుండా యువకులు విచ్చలవిడిగా బైకులపై రయ్మంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కాలరాస్తూ.. ట్రాఫిక్ సిగ్నల్స్‌లను తెంచేస్తూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదే ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టం తీసుకురానుంది. వేలల్లో జరిమానా.. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపితే ఇకపై భారీ జరిమానా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టానికి రూపకల్పన చేస్తోంది. దీని ప్రతిపాదనల ముసాయిదాను ( డ్రాప్ట్బిల్లు ) అభ్యంతరాల కోసం రాష్ట్రానికి పంపింది. దీని ప్రకారం డ్రైవింగ్ లెసైన్సు లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు, ద్విచక్రవాహనం నడిపే వారికి హెల్మెట్ లేకపోతే రూ.500, పత్రాలు లేకుండా నడిపితే రూ.500, ఇన్సురెన్స్ లేకుంటే రూ.10 వేల జరిమానా విధించేలా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. నాలుగు చక్రాల వాహనాలను బెల్టు లేకుండా నడిపితే రూ.వెయ్యి, ఇన్సురెన్సు లేకపోతే రూ.10 వేలు, పత్రాలు లేకపోతే రూ.5 వేలు, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేల చొప్పున జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మూడు సార్లు పట్టుబడితే వాహనాలు జప్తు లేదా.. లెసైన్సుల రద్దు చేస్తారు. ఇంతటి కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తే వాహనదారుల్లో భయం ఏర్పడి.. నిబంధనల ప్రకారం నడుచుకుంటారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణ రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో అమాయకులు బలవుతున్నారు. వాహన చట్టాలు కఠినంగా లేకపోవడం, వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెసైన్సు లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలు పాటించకుండా వేగంగా వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు జరుగుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే వారిలో భయంలేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు. అదే విదేశాల్లో వాహన చట్టాలు కఠినంగా ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కఠినమైన చట్టాలతో అరెస్టులు చేయడం లాంటి చర్యలతో వాహనదారుల్లో భయం ఏర్పడి నిబంధనల మేరకు డ్రైవింగ్ జరుగుతుందనే భావన ఉంది. ఇప్పుడే మన దగ్గర కూడా అది అమలవుతే రోడ్డు ప్రమాదాలు నివారించే అవకాశాలు లేకపోలేదు. -
తాగి బండి నడిపితే.. 25వేల జరిమానా!!
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అయ్యేవాళ్ల మీద కొరడా ఝళిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకమీదట ఎవరైనా తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ. 25వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండూ, వాటితో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. అదే రెండోసారి అయితే 50వేల రూపాయల జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష, లేదా రెండూ, వాటితో పాటు ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు. మూడోసారి కూడా అలా పట్టుబడ్డారో.. ఇక లైసెన్సును శాశ్వతంగా రద్దుచేయడంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. మోటారువాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్తగా మార్పుచేర్పులు చేస్తోంది. స్కూలు బస్సు డ్రైవర్లు తాగి పట్టుబడితే వారికి రూ. 50వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దాంతోపాటు తక్షణం వాళ్ల లైసెన్సు రద్దుచేస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల మీద కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రమాదాల్లో ఎవరైనా చిన్నపిల్లల మృతికి కారణమైతే వాళ్లకు రూ. 3లక్షల జరిమానా, కనీసం ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని తలపెట్టింది. వాహనాన్ని సురక్షితం కాని పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష లేదా రెండూ విధించొచ్చట. ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే.. రూ. 15వేల జరిమానా, లైసెన్సు నెలరోజుల పాటు సస్పెన్షన్, తప్పనిసరి శిక్షణ ఉండాలట. -
వాద్రా కారుని ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన వ్యక్తి అరెస్ట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ప్రయాణిస్తున్న కారును అతివేగంగా, అతి ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేసిన స్థానిక వ్యాపారస్టుడికి పోలీసులు జరిమానా విధించారు. ఓక్లా నుంచి వాద్రా తన కారులో వస్తుండగా అగ్నేయ ఢిల్లీలోని అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. స్థానిక వ్యాపారస్తుడు పశ్చిమ్ విహార్ ప్రాంతానికి చెందిన సురభ్ రస్తోగిగా గుర్తించారు. మారుతి రిట్జ్ కారులో రస్తోగి లాజ్ పత్ నగర్ నుంచి మోతి మిల్స్ కు వెళుతూ వాద్రా కారును అతివేగంగా ప్రమాదకర రీతిలో సుడులు తిప్పుతూ ఓవర్ టేక్ చేసినట్టు పోలీసుల కేసు నమోదు చేశారు. మితీ మీరిన వేగంతో కారును నడుపుతున్న వ్యక్తిపై వాద్రా భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేశారు. దాంతో మోటార్ వెహికిల్ యాక్టు కింద సెక్షన్ 184 ప్రకారం రస్తోగికి అరెస్ట్ చేసి జరిమానా విధించారు. ఆతర్వాత రస్తోగిని విడుదల చేశారు.