సాక్షి, హైదరాబాద్: భారీ జరిమానాలతో కూడిన కొత్త మోటారు వాహన చట్టం అమలు దేశవ్యాప్తంగా వాహనదారుల్లో వణుకు పుట్టించింది. జరి మానాలపై మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఒళ్లు దగ్గరపెట్టుకొని వాహనాలు నడిపారు. అను మతిలేని/సరైన పత్రాలులేని వాహనాలను ప్రజలు బయటకు తీయ లేదు. రాష్ట్రంలోనూ రోడ్డు ప్రమాదాల్లో గణనీయమైన తగ్గుదల నమో దైంది. ఫలితంగా మరణాల సంఖ్యలో కూడా క్షీణత కనిపించింది.
కొత్త వాహన చట్టం భయంతోనే..
కొత్త మోటారు వాహన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దానికి నెల ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రచార సాధనాలు, కూడళ్లలో ప్రచారం చేశారు. ప్రతి ఉల్లంఘనకు రూ. వేలల్లో ఉన్న జరిమానాలు వాహనదారులను హడ లెత్తించాయి. ఈ పరిణామం రాష్ట్ర వాహనదారులపైనా కనిపించింది. ఫలితంగా తెలంగాణ రోడ్ సేఫ్టీ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జనవరి నుంచి జూలై వరకు 3,316గా నమోదైన మరణాల సంఖ్య ఆగస్టు 6 నాటికి 3,833కి, సెప్టెంబర్ 3వ తేదీ నాటికి 4,187కు చేరింది. ఈ ఏడాదిలో ప్రతి నెలా సగటున 500 మందికిపైగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఆగస్టులో నిర్వహించిన ప్రచారం కారణంగా మరణాల సగటు 350కి తగ్గింది. అంతేకాదు మిగిలిన అన్ని నెలల్లో ఒకరోజుకు సగటున 17 మంది మరణించగా అది 11–14కి పడిపోవడం గమనార్హం. క్షతగాత్రుల సంఖ్య రోజుకు సగటున 64 చొప్పున ఉండగా ఈ రెండు నెలల్లో 45 నుంచి 50కి తగ్గింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. జూలైలో 5 లక్షల వరకు ఉన్న కేసులు ఆగస్టు నాటికి 4 లక్షలకు, సెప్టెంబర్‌లో కేవలం 95 వేలుగానే నమోదయ్యాయి. అయితే భారీ జరిమానాల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త వాహనచట్టాన్ని అమలు చేయబోమంటూ ప్రభుత్వం ప్రకటించడంతో గత 15 రోజులుగా క్రమంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం గమనార్హం. హైదరాబాద్ కమిషనరేట్‌లోనే కాదు పొరుగున ఉన్న సైబరాబాద్, రాచకొండలోనూ ఇదే పరిస్థితి ఉంది.
నిబంధనలు మన భద్రత కోసమే:
మోటారు వాహనాల చట్టం సహా ఏ ఉల్లంఘన అయినా మన భద్రత కోసమే అన్నది గుర్తుంచుకోవాలి. ఎవరికి వారు నిబంధనల్ని కచ్చితంగా పాటించాలి. అలా కాకుంటే కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కోణంలో వాహనచోదకుల్లో మార్పు తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా అధిక వేగంతో వాహనాలు నడిపే టీనేజర్లు, కాలేజీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – ట్రాఫిక్ అధికారులు
గ్రేటర్‌లో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు...
కమిషనరేట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ (15 వరకు)
హైదరాబాద్ 5,19,043 4,13,743 95,602 1,02,536
రాచకొండ 1,68,303 1,29,894 54,459 44,091
సైబరాబాద్ 2,64,631 2,07,638 1,06,721 –
నగర కమిషనరేట్‌లో ఇలా...
జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్
కాంటాక్ట్ కేసులు 59,039 54,944 30,253 18,870
నాన్–కాంటాక్ట్ 4,22,134 3,23,074 42,931 69,604
ఇతర కేసులు 37,870 35,725 22,418 14,062
కీలక ఉల్లంఘనల్లో...
జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్
డ్రంక్ డ్రైవింగ్ 2267 2204 810 606
వితౌట్ హెల్మెట్ 3,95,513 3,08,413 53,988 74,951
రాంగ్ పార్కింగ్ 27,634 31,876 11,479 9506
రాంగ్ సైడ్ డ్రైవింగ్ 25,878 17,751 1642 2281
రాంగ్ నెంబర్ ప్లేట్ 16,719 9390 3378 5262
Comments
Please login to add a commentAdd a comment