Bike accidents
-
Viral Video: బైక్ లో అతివేగంగా వచ్చి.. కారుపై కూర్చున్న యువకుడు
-
బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు దుర్మరణం
హస్తినాపురం: బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు ఘన్పూర్ మండలం, బస్వరాజ్‌పల్లి గ్రామానికి చెందిన పి.నవీన్(22) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ వనస్థలిపురంలోని పద్మావతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే జిల్లాకు చెందిన అతడి స్నేహితుడు అడ్డూర్ పవన్‌కల్యాన్(22), కరీంనగర్‌కు చెందిన జె.శివ(23)ఉద్యోగం కోసం మూడు రోజుల క్రితం నవీన్ వద్దకు వచ్చారు. గురువారం రాత్రి హయత్‌నగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడు నిమ్మల సాయి కుమార్ సాయికుమార్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు ముగ్గురు కలిసి హయత్‌నగర్ వెళ్లారు. పార్టీ అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా పద్మావతినగర్ కాలనీ మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నవీన్, పవన్ కల్యాన్ అక్కడికక్కడే మృతి చెందారు. శివకు స్వల్పగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: పరారీలో యూట్యూబర్ కటారియా.. ఆచూకీ చెబితే రూ.25వేల రివార్డ్) -
ఎదురేమొచ్చినా తగ్గేదేలే! రాంగ్ రూట్లో రయ్.. రయ్!
‘కరీంనగర్ పట్టణంలో నివాసం ఉండే విశ్రాంత ప్రభుత్వ లెక్చరర్ పాపారావు దంపతులు ఈనెల 12న పనినిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద రాంగ్రూట్లో వస్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. పాపారావు దంపతులతో పాటు కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా విషాదం నింపింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.’ ‘కరీంనగర్‌లోని ఓ కార్ల షోరూంలో పనిచేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం భోజనం చేసేందుకు బైక్‌పై ఇంటికి వస్తున్నాడు. కోతిరాంపూర్ సమీపంలో రాంగ్రూట్లో వస్తున్న మరో బైక్ ఇతడిని ఢీకొట్టింది. లక్ష్మణ్ తలకు తీవ్రగాయం కాగా.. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.’ కరీంనగర్‌క్రైం: నిబంధనలు పాటించండి.. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండంటూ ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పురావడం లేదు. రాంగ్రూట్లో రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుండడంతో ఎదురుగా వచ్చేవారు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. రద్దీగా ఉండే కరీంనగర్ సిటీతో పాటు వేగంగా వాహనాలు దూసుకొచ్చే హైవేల పైనసైతం రాంగ్రూట్లలో వెళ్తూ ప్రాణాలు తీస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు జీవితాన్ని చీకటిమయం చేస్తుండగా పోలీసులు, రవా ణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా వాహనదారుల్లో మార్పురావడం లేదు. కరీంనగర్ పట్టణంలో రాంగ్‌రూట్ ప్రాంతాలు ► కల్పన హోటల్ నుంచి ఎస్బీఐ కమాన్ బ్రాంచ్ వైపు ► పోచమ్మవాడ నుంచి కమాన్ వైపు ► కోతిరాంపూర్ చౌరస్తా వద్ద ► విద్యుత్ కార్యాలయం, జిల్లా కోర్టు సమీపంలో ఎస్సారార్ కళాశాల సమీపంలో ► బైపాస్ ఎన్టీఆర్ చౌరస్తా ► ఆదర్శనగర్ బోర్డు నుంచి మంచిర్యాల చౌరస్తా వైపు ► రాంనగర్ చౌరస్తా.. మంకమ్మతోట ► తెలంగాణ చౌక్ ప్రాంతం (పోలీసులు మొత్తం 12 రాంగ్‌రూట్ ప్రాంతాలను గుర్తించారు) నగరంలో యథేచ్ఛగా.. కొన్నాళ్లక్రితం వరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటుచేసి పలు కూడళ్లవద్ద రాంగ్రూట్లలో వెళ్లేవారిపై నిఘాపెట్టేవారు. రాంగ్రూట్లలో వెళ్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించేవారికి ఈ– చలాన్లు విధించేవారు. ఇప్పటికీ పలుచోట్ల ఈ పద్ధతి అమలు చేస్తున్నా.. చాలా వరకు కూడళ్ల వద్ద పోలీసు నిఘా కనిపించని పరిస్థితి నెలకొంది. 12 కూడళ్ల వద్ద రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. రాజామెస్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు, కోతిరాంపూర్‌లో, పోచమ్మవాడ నుంచి కమాన్‌వైపు, కల్పన హోటల్ నుంచి కమాన్ ఎస్బీఐ బ్యాంకు వైపు రాంగ్రూట్లో ఎక్కువగా వెళ్తున్నారు. అదే విధంగా మంకమ్మతోట, గీతాభవన్, విద్యుత్‌శాఖ కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడుతుండగా.. సిటీలో మరణాలు తక్కువే. ఇక మెయిన్రోడ్లపై కూడా రాంగ్‌రూట్ డ్రైవింగ్ ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ జాతీయరహదారిపై రాంగ్రూట్లో ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. కాకతీయ కాలువ, ఇంజినీరింగ్ కళాశాలలు, తిమ్మాపూర్ నుంచి మొదలుకుని నుస్తులాపూర్ వరకు కూడా పలు ప్రాంతాల్లో రాంగ్రూట్లలో వెళ్తు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రూట్లో రాంగ్‌రూట్ మరణాలు సైతం ఎక్కువే. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన డివైడర్లను రాకపోకలకు అనుగుణంగా మార్చాలని, తద్వారా రాంగ్‌రూట్ ఇబ్బంది ఉండదని సిటీ ప్రజలు అంటుండగా.. రాంగ్రూట్లో వెళ్లే వాహనాలపై నిఘా పెడుతున్నామని, నిత్యం జరిమానా విధిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాంగ్‌రూట్.. వెరీ డేంజర్ రాంగ్రూట్లో వెళ్లకుండా పోలీసులు, రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నా తీరుమారడం లేదు. రోజురోజుకు రాంగ్రూట్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ రెండు,మూడు నెలల్లోనే రాంగ్‌రూట్ ప్రమాదాలు జిల్లాలో 20కి పైగా చోటుచేసుకున్నాయి. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదని పోలీసులు చెబుతున్నారు. యువత మద్యం మత్తులో రాంగ్రూట్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కరీంనగర్ సిటీతో పాట జిల్లావ్యాప్తంగా రాంగ్రూట్లో వెళ్లేప్రాంతాలను పోలీసులు, రవాణా అధికారులు గుర్తించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కోపంగా చూశాడని కత్తులతో పొడిచి చంపేశారు
యశవంతపుర: ఐటీ సిటీ బెంగళూరులో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరగడం మామూలు విషయమైంది. బైకు తగలడంతో కోపంగా చూశాడని కెంగేరి వద్ద యువకున్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం రాత్రి కెంగేరిలో కరగ ఉత్సవం జరిగింది. భరత్ అనే యువకుడు చూడడానికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైకుపై వెళ్తుండగా అతని బైక్‌కు మరొక బైక్ తగిలింది. దీంతో భరత్ కోపంగా చూశాడు. నన్నే గుర్రుగా చూస్తావా అని మరో బైకిస్టు స్నేహితులతో కలిసి భరత్‌ను కత్తులతో పొడిచి చంపారు. శవాన్ని ఈడ్చుకొంటూ వెళ్తుండగా కెంగేరి రైల్వే పోలీసులు రావడంతో హంతకులు పారిపోయారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
ట్రిపుల్... ట్రబుల్
సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ ఉల్లంఘనకు పాల్పడుతూ నిత్యం ప్రమాదాల బారినడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురానాపూల్ హరా దర్వాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నగరంలో తరచు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మంగళ్‌హాట్ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుడు సైతం మద్యం తాగి ఉన్నారని, దీని వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించే వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. సాధారణంగా టూ వీలర్స్ వినియోగించేది వీరే ఎక్కువ కావడంతో ప్రమాదాలబారిన పడుతున్న వారిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. బంధువుల కంటే స్నేహితులతో కలిసే ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతుంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు కనిపించినా... జంక్షన్ వచ్చినా... ఆఖరులో కూర్చున్న యువకుడు తక్షణం దిగిపోయి నడుస్తూ ముందుకు వెళ్లడం పరిపాటి. ఇలా చేస్తూ ట్రిపుల్ రైడర్లు అనేక సందర్భాల్లో పోలీసులను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దూసుకుపోతూ తరచు ప్రమాదాలకు లోనవుతున్నారు. అదుపు అసాధ్యం... ప్రతి వాహనానికీ దానిని తయారు చేసే కంపెనీ కొన్ని ప్రమాణాలు నిర్దేశిస్తుంది. ఇందులో భాగంగానే టూ వీలర్‌ను కేవలం ఇద్దరు వినియోగించడానికి వీలుగానే రూపొందిస్తుంది. ముందు డ్రైవర్, వెనుక పిలియన్ రైడర్ మాత్రమే ప్రయాణించాలంటూ తమ నిబంధనల్లో స్పష్టం చేస్తుంది. దీనికి సాంకేతికంగానూ ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇంజిన్ కెపాసిటీ: మోటారు వాహనాలకు ఉండే ప్రతి ఇంజిన్‌కు ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. దీనిని సాంకేతికంగా ఇంజిన్ కెపాసిటీ అంటారు. ఆ వాహనం ఎందరు ప్రయాణించడానికి అనువుగా రూపొందిస్తారో... అదే సామర్థ్యంలో ఇంజిన్ అభివృద్ధి చేస్తారు. నిర్దేశించిన ప్రయణికుల కంటే ఎక్కువ మంది ఆ వాహనంపై ప్రయాణిస్తే దాని ప్రభావం ఇంజిన్‌పై పడుతుంది. యాక్సిలరేటింగ్ కెపాసిటీ: ఓ వాహనం ఎంత వేగంతో దూసుకుపోవాలనేది స్పష్టం చేసేదే యాక్సిలరేటింగ్ కెపాసిటీ. సదరు వాహనంపై పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కినప్పుడు ఈ కెపాసిటీ తగ్గుతుంది. సాధారణంగా గంటకు 60 కిమీ వేగంతో దూసుకుపోయే వాహనం ఇలాంటప్పుడు 40 కిమీ మించదు. ఈ ప్రభావం ఓవర్‌టేకింగ్ తదితర సమయాల్లో ప్రమాదాలకు కారణమవుతుంది. బేకింగ్/బ్యాలెన్సింగ్ కెపాసిటీ: ఏదైనా వాహనం ప్రమాదానికి లోనుకాకుండా ఉండాలంటే ఈ రెండూ అత్యంత కీలకం. సరైన సమయానికి బ్రేక్ వేయగలగటం, అవసరమైన స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ట్రిపుల్ రైడింగ్ వంటివి చేసినప్పుడు ఈ ప్రభావం ఈ రెండు కెపాసిటీల పైనా పడి... ఎదురుగా ముప్పును గుర్తించినా తక్షణం స్పందించి వాహనాన్ని ఆపలేరు. ఈ ఏడాది జరిగిన ‘ట్రిపుల్’ యాక్సిడెంట్స్‌లో కొన్ని... ♦రామ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ తన స్నేహితురాళ్లు అనూష, పల్లవితో కలిసి తన బైక్‌పై సంఘీ టెంపుల్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. గోపి మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦ఛత్తీస్‌గఢ్ నుంచి వలసవచ్చిన సురేష్ అహ్మద్‌గూడ వద్ద మోది కన్స్ట్రక్షన్స్లో పని చేసేవాడు. భార్య రాధిక, బావమరిది ఉదయ్‌లతో పాటు చిన్నారుల్ని తీసుకుని బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. సురేష్ మరణించగా మిగిలిన వారు క్షతగాత్రులయ్యారు. ♦డీ పోచంపల్లికి చెందిన సాయి తన స్నేహితులు కృపాకర్, విష్ణులతో కలిసి బైక్‌పై వెళుతుండగా జరిగిన ప్రమాదంలో సాయి చనిపోగా... మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ♦తాగాజా బుధవారం తెల్లవారుజామున మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు చనిపోగా... మరొకరు క్షతగాత్రులయ్యారు. వీరు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు చెబున్నారు. -
మర్యాదగా బండి నడపండి...
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో యువత నెత్తురోడుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరుగుతున్నప్రమాదాల్లో యువతే పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు.అదే సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. దీంతో వేలాది కుటుంబాలు సంపాదించే వాళ్లను కోల్పోయి రోడ్డునపడుతున్నాయి. రహదారి భద్రతా నిబంధనల పట్ల నిర్లక్ష్యం, అపరిమితమైన వేగం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. 80 శాతం ప్రమాదాలు ఓవర్‌స్పీడ్ వల్లనే జరుగుతున్నట్లు అంచనా. గత రెండేళ్లలో సుమారు 3536 మంది చనిపోయారు. రహదారి భద్రతా సంస్థ, రవాణా శాఖ అంచనాల మేరకు వారిలో 75 శాతం మంది 18 నుంచి45 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను కబలిస్తోందని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ‘యువశక్తిని ’లక్ష్యంగా చేసుకున్నాయి. రహదారి భద్రతకు యువశక్తి ఎంతో అవసరమని నినదిస్తున్నాయి. ఇటు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు, అటు దేశానికి ఎంతోకీలకమైన యువతలో రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూత్ సేఫ్టీయే రోడ్‌సేఫ్టీ... ఒకవైపు ఓవర్‌స్పీడ్. మరోవైపు దానికి ఆజ్యం పోస్తున్న మద్యం. దీంతో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన కార్లు 130 నుంచి 150 కిలోమీటర్ల వరకు పరుగులు తీస్తున్నాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మొదలుకొని ఔటర్ రింగ్‌రోడ్డు వరకు, నగరంలోని అనేక చోట్ల ఈ వేగమే యువత ప్రాణాలను కబలిస్తోంది. ఖరీదైన వాహనాలపైన అపరిమితమైన వేగంతో దూసుకుపోవడాన్ని ఎంతో క్రేజీగా భావిస్తున్నారు. కార్లు, బైక్‌లపైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బంగారు భవిష్యత్తు రక్తసిక్తమవుతుంది. గతేడాది తెలంగాణలో 21,588 ప్రమాదాలు జరిగితే వాటిలో 6434 ప్రమాదాలు ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే చోటుచేసుకున్నాయి. 1863 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 8790 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 75 శాతం కుటుంబాన్ని పోషించే వాళ్లే. దీంతో అప్పటి వరకు ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా ప్రశాంతంగా గడిపిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కకావికలమవుతున్నాయి. సికింద్రాబాద్ ఆర్టీఏ వద్ద వాహనదారులకు నిబంధనలు తెలియజేస్తున్న దైవజ్ఞశర్మ, ఆర్టీఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఓవర్‌స్పీడ్ వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం పేద, మధ్యతరగతి వర్గాలే ఉన్నారు.ద్విచక్రవాహనదారులు, పాదచారులే ఎక్కువగా చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్ధిక తోడ్పాటు ఎంతో ముఖ్యమేనని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం డ్రైవర్ల ప్రవర్తన వల్లనే జరుగుతున్నాయి. పరిమితికి మించిన వేగం, పరిమితికి మించిన బరువు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లు మాత్రం పాదచారులు, సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులే.’ అని ప్రముఖ రోడ్డు భద్రతా నిపుణులు నరేష్ రాఘవన్ అన్నారు. ‘ఒకప్పటి ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఇప్పుడు లేదు, న్యూక్లియర్ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టపడుతారు. ఎన్నో కలలు కంటారు. కానీ అలాంటి ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తే చనిపోవడం వల్ల మొత్తం కుటుంబమే దిక్కులేనిదవుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మర్యాదగా బండి నడపండి... రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోన్న రవాణాశాఖ వాహనదారులు మర్యాదగా బండి నడపాలని సూచిస్తోంది. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రతి వాహనదారుడు, తన తోటి వాహనదారుడికి అవకాశం ఇస్తూ ప్రయాణం చేయడం ఒక బాధ్యతగా భావించాలి.ఈ లక్ష్యంతోనే వాహనదారుల్లో స్ఫూర్తిని కలిగిస్తూ హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నగరంలో గత రెండేళ్లుగానమోదైన ప్రమాదాల వివరాలు సంవత్సరం ప్రమాదాలు క్షతగాత్రులు మృతులు 2018 6434 8790 1863 2019 6523 8679 1673 -
‘ఫైన్’ డేస్!
సాక్షి, హైదరాబాద్: భారీ జరిమానాలతో కూడిన కొత్త మోటారు వాహన చట్టం అమలు దేశవ్యాప్తంగా వాహనదారుల్లో వణుకు పుట్టించింది. జరి మానాలపై మీడియాలో విపరీతమైన ప్రచారం జరగడంతో చాలా రాష్ట్రాల్లో ప్రజలు ఒళ్లు దగ్గరపెట్టుకొని వాహనాలు నడిపారు. అను మతిలేని/సరైన పత్రాలులేని వాహనాలను ప్రజలు బయటకు తీయ లేదు. రాష్ట్రంలోనూ రోడ్డు ప్రమాదాల్లో గణనీయమైన తగ్గుదల నమో దైంది. ఫలితంగా మరణాల సంఖ్యలో కూడా క్షీణత కనిపించింది. కొత్త వాహన చట్టం భయంతోనే.. కొత్త మోటారు వాహన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దానికి నెల ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు ప్రచార సాధనాలు, కూడళ్లలో ప్రచారం చేశారు. ప్రతి ఉల్లంఘనకు రూ. వేలల్లో ఉన్న జరిమానాలు వాహనదారులను హడ లెత్తించాయి. ఈ పరిణామం రాష్ట్ర వాహనదారులపైనా కనిపించింది. ఫలితంగా తెలంగాణ రోడ్ సేఫ్టీ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జనవరి నుంచి జూలై వరకు 3,316గా నమోదైన మరణాల సంఖ్య ఆగస్టు 6 నాటికి 3,833కి, సెప్టెంబర్ 3వ తేదీ నాటికి 4,187కు చేరింది. ఈ ఏడాదిలో ప్రతి నెలా సగటున 500 మందికిపైగా వివిధ రోడ్డు ప్రమాదాల్లో మరణించగా ఆగస్టులో నిర్వహించిన ప్రచారం కారణంగా మరణాల సగటు 350కి తగ్గింది. అంతేకాదు మిగిలిన అన్ని నెలల్లో ఒకరోజుకు సగటున 17 మంది మరణించగా అది 11–14కి పడిపోవడం గమనార్హం. క్షతగాత్రుల సంఖ్య రోజుకు సగటున 64 చొప్పున ఉండగా ఈ రెండు నెలల్లో 45 నుంచి 50కి తగ్గింది. మరోవైపు రాష్ట్ర రాజధానిలోనూ ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. జూలైలో 5 లక్షల వరకు ఉన్న కేసులు ఆగస్టు నాటికి 4 లక్షలకు, సెప్టెంబర్‌లో కేవలం 95 వేలుగానే నమోదయ్యాయి. అయితే భారీ జరిమానాల నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త వాహనచట్టాన్ని అమలు చేయబోమంటూ ప్రభుత్వం ప్రకటించడంతో గత 15 రోజులుగా క్రమంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం గమనార్హం. హైదరాబాద్ కమిషనరేట్‌లోనే కాదు పొరుగున ఉన్న సైబరాబాద్, రాచకొండలోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలు మన భద్రత కోసమే: మోటారు వాహనాల చట్టం సహా ఏ ఉల్లంఘన అయినా మన భద్రత కోసమే అన్నది గుర్తుంచుకోవాలి. ఎవరికి వారు నిబంధనల్ని కచ్చితంగా పాటించాలి. అలా కాకుంటే కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కోణంలో వాహనచోదకుల్లో మార్పు తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా అధిక వేగంతో వాహనాలు నడిపే టీనేజర్లు, కాలేజీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – ట్రాఫిక్ అధికారులు గ్రేటర్లో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు... కమిషనరేట్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ (15 వరకు) హైదరాబాద్ 5,19,043 4,13,743 95,602 1,02,536 రాచకొండ 1,68,303 1,29,894 54,459 44,091 సైబరాబాద్ 2,64,631 2,07,638 1,06,721 – నగర కమిషనరేట్‌లో ఇలా... జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కాంటాక్ట్ కేసులు 59,039 54,944 30,253 18,870 నాన్–కాంటాక్ట్ 4,22,134 3,23,074 42,931 69,604 ఇతర కేసులు 37,870 35,725 22,418 14,062 కీలక ఉల్లంఘనల్లో... జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డ్రంక్ డ్రైవింగ్ 2267 2204 810 606 వితౌట్ హెల్మెట్ 3,95,513 3,08,413 53,988 74,951 రాంగ్ పార్కింగ్ 27,634 31,876 11,479 9506 రాంగ్ సైడ్ డ్రైవింగ్ 25,878 17,751 1642 2281 రాంగ్ నెంబర్ ప్లేట్ 16,719 9390 3378 5262 -
'డెత్' స్పీడ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 196 ఫాటల్ యాక్సిడెంట్స్ (మరణాలు సంభవించిన ప్రమాదాలు) జరిగాయి. వీటిలో అత్యధికంగా 119 (60.71 శాతం) అతివేగంతోనే (ఓవర్ స్పీడ్) చోటుచేసుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్‌తో 46 ప్రమాదాలు జరగ్గా... డ్రంకన్‌డ్రైవ్‌తో 12 మందిమృత్యువాతపడ్డారు. మైనర్లు డ్రైవింగ్ చేసిన కారణంగా ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ విభాగం చీఫ్ అనిల్‌కుమార్ గురువారం వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ఫాటల్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాయని చెప్పారు. యాక్సిడెంట్స్ చోటుచేసుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. రహదారి భద్రత నిపుణులు నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహన చోదకుడికి ముప్పుగా మారేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పుగా మారేవి. రెండు, మూడో తరహా ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఉల్లంఘన అయితే వాహనం నడిపే వారితో పాటు ఏ పాపం ఎరుగని ఎదుటి వారికీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందో వాటిపై వరుసపెట్టి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టారు. దీని ప్రభావం సైతం రోడ్డు ప్రమాదాలు తగ్గడంపై ఉందని ట్రాఫిక్ పోలీసులు వివరిస్తున్నారు. నగర ట్రాఫిక్ పోలీసులు కేవలం ప్రమాదాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు/ వాహన చోదకులకు ఎదురవుతున్న ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకున్నారు. వీటిని నిరోధించడానికి ఈ ఏడాది చర్యలు తీసుకున్నారు. ఆ తరహా ఉల్లంఘనలపైనా పలుమార్లు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రధానంగా రహదారులపై నడిచే పాదచారుల కోసం అనేక చర్యలు తీసుకున్నారు. ఆక్రమణల తొలగింపు, మౌలిక వసతుల కల్పన తదిరాలతో ప్రమాదాల సంఖ్యను తగ్గించగలిగారు. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఫలితంగానే గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలివీ... ♦ నగరంలోని 174 విద్యాసంస్థల్ని సందర్శించిన అధికారులు 88,721 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ♦ సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా నగరంలో మొత్తం 60 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించారు. ♦ ఈ ప్రాంతాల్లో పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ♦ ఆయా విభాగాల సహకారం, సమన్వయంతో కీలక ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్, క్యారేజ్‌వేలు, కాజ్‌వేలు ఏర్పాటు చేయించారు. ♦ బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ ప్రాంతంలో ఎన్‌హెచ్ నంబర్ 44పై గార్డ్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ♦ టిప్పుఖానా–రామ్‌దేవ్‌గూడ మధ్య వీధి లైట్లు, మార్కింగ్స్ ఏర్పాటు చేయించారు. ♦ రాజ్‌భవన్ రోడ్లో డివైడర్‌పై పాదచారుల కోసం పెడస్ట్రియన్ గార్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. ♦ మిధానీ పరిధిలోని ధాతునగర్‌లో సెంట్రల్ మీడియన్ నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ♦ మెట్రో స్టేషన్ల వద్ద రోడ్డు దాటే వారు వాటికి సంబంధించిన మెట్లు, ఎలివేటర్స్, ఎస్కలేట ర్స్ వినియోగించేలా ప్రోత్సహించారు. ♦ ఎన్టీఆర్ మార్గ్‌లో, టోలిచౌకి వద్ద రంబ్లర్ స్ట్రిప్స్, సైనేజెస్ ఏర్పాటు చేశారు. సమన్వయంతో పని చేస్తున్నాం నగరంలో ప్రమాదాలను తగ్గించడానికి అన్ని విభాగాలతో కలిసి పని చేస్తున్నాం. ట్రాఫిక్ విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయడం ద్వారా సమస్యలు గుర్తించి ఆయా ప్రభుత్వ సంస్థల సాయంతో వాటిని పరిష్కరించడం ఫలితాలు ఇచ్చింది. బ్లాక్‌స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అవసరమైన చర్యలు తీసుకున్నాం. మైనర్ డ్రైవింగ్, డ్రంకన్డ్రైవ్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాం. రాంగ్ సైడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా నడపటం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్... ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి కఠిన చర్యలు చేపట్టాం. ఫలితంగా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గించగలిగాం. – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
ఎదురొచ్చిన మృత్యువు.. మావయ్యతో పాటు..
మీర్‌పేట: చిరునవ్వులు చిందిస్తూ తల్లిదండ్రులకు టాటా చెప్పి మావయ్యతో కలిసి స్కూల్‌కు వెళుతున్న ఓ బాలుడితో పాటు అతడి మామను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బడంగ్‌పేట ఏజీఆర్‌కాలనీకి చెందిన పానిగంటి సురేందర్, రేణుక దంపతులకు కుమారుడు శ్రేయస్ (10), లోక్షిత (7) ఉన్నారు. సురేందర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అతని సమీప బంధువులు వనపర్తి జిల్లాకు చెందిన గోర్ల శేఖరయ్య, శివమ్మ దంపతుల కుమారుడు బాలకృష్ణ (23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. సురేందర్‌కు వరుసకు బావమరిది అయిన అతను గత కొన్ని రోజులుగా సురేందర్ ఇంట్లోనే ఉంటూ ఓ ఆటోమొబైల్ షాపులో పని చేస్తున్నాడు. కాగా లోక్షిత, శ్రేయస్ బడంగ్‌పేటలోని డీపీఎస్ స్కూల్లో చదువుతున్నారు. రోజు మాదిరిగానే సోమవారం ఉదయం వారిద్దరూ బాలకృష్ణ బైక్‌పై స్కూల్‌కు బయలుదేరారు. బడంగ్‌పేట ప్రధాన రహదారిపై పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లార్డ్స్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు వెనుక చక్రాల కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద నలిగి తీవ్రంగా గాయపడిన బాలకృష్ణ, శ్రేయస్ అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారి లోక్షితకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోర్ల శేఖరయ్య, శివమ్మలకు ముగ్గురు కుమార్తెలు కాగా బాలకృష్ణ ఒక్కగానొక్క కుమారుడు. తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు మృతి చెం దడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శోకసంద్రంలో శ్రేయస్ తల్లిదండ్రులు... చెల్లెలు లోక్షిత, మావయ్య బాలకృష్ణలతో కలిసి స్కూల్‌కు బయలుదేరిన చిన్నారి శ్రేయస్ అనంతలోకాలకు చేరుకున్నాడన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లి రేణుక శ్రేయస్ మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. -
ప్రాణం తీసిన అతివేగం
విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి) : మండలంలోని గిడిజాల పంచాయతీ వేమగొట్టిపాలెం వద్ద మంగళవారం మోటారు సైకిల్ అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెందుర్తి మండలం రాజయ్యపేట పంచాయతీ బంధంవానిపాలెం గ్రామానికి చెందిన నమ్మి కిషోర్(25), మొల్లి రాజేష్(26)లు ఆనందపురం మండలం జోడువానిపాలెం గ్రామంలో జరుగుతున్న వివాహానికి మంగళవారం మోటార్ బైక్‌పై బయలుదేరారు. వారు మార్గమధ్యలో గిడిజాలలో ఉన్న మద్యం షాపు వద్ద మద్యం తాగి పలువురితో గొడవ పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన గండ్రెడ్డి రాముతో గొడవ పడడంతోపాటు అతడిని బీర్ బాటిల్‌తో కొట్టి పరారయ్యే క్రమంలో మోటార్ బైక్‌ని నమ్మి కిషోర్ అతి వేగంగా నడడపడంతో వేమగొట్టిపాలెం వద్ద అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కిషోర్‌తోపాటు బైక్ వెనుక వైపు కూర్చున్న రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా అటు వైపుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్‌కు గెడ్డలో మూలుగులు వినబడడంతో పరిశీలించగా ఇద్దరు యువకులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి 108 వాహనానికి సమాచారం అందించాడు. ఈలోగా అటువైపు వెళ్తున్న పలువురు యువకులు క్షతగాత్రులకు సపర్యలు చేసి చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మోటార్ బైక్‌ని స్వాధీనం చేసుకొని స్థానికులను విచారించారు. సీఐ శంకరరావు ఆధ్వర్యంలో కేసుని స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని మహిళకు గాయాలు మండలంలోని వేములవలస పరిధిలో వేంకటేశ్వర పాఠశాలకు సమీపంలో రోడ్డు పై బైక్‌ని లారీ ఢీ కొనడంతో మహిళ తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆనందపురం వైపు నుంచి తగరపువలస వెళ్తున్న మోటార్ బైక్‌ని రోడ్డు పక్కన ఆపారు. ఈలోగా ఏలూరు నుంచి వస్తున్న లారీ మోటార్ బైక్‌ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక వైపు కూర్చున్న యాండ్రపు తౌడమ్మ కింద పడడంతో... ఆమె పైనుంచి లారీ వెళ్లి పోవడంతో రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ మేరకు తౌడమ్మను చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించి స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మోటారు సైకిల్ అదుపుతప్పి..
కర్నూలు , చిప్పగిరి: మోటారు సైకిల్ అతివేగం ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఏరూరు– చిప్పగిరి మార్గమధ్యంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏరూరు గ్రామానికి చెందిన బోయ గోవిందు, ఎర్రమ్మ దంపతులకు కుమారుడు రమేష్ (22), ఒక కుమార్తె ఉన్నారు. రమేష్ స్థానికంగానూ.. ఏరూరు, గుంతకల్లు, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు సురేష్‌రెడ్డితో కలిసి ఏరూరు నుంచి చిప్పగిరికి సొంత పనిమీద మోటారుసైకిల్‌పై బయలుదేరారు. గ్రామం దాటిన తర్వాత సిద్ధబసవన్న కుంట (మఠం) వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అతి వేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బండరాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ప్రయాణికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం ఆటోలో గుంతకల్లు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ మృతి చెందాడు. సురేష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. -
ప్రమాదం.. విషాదం..
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ ఇంట విషాదం ఆవరించింది. సరదాగా మనవడిని తీసుకుని స్కూటీపై బయటకు వెళ్లిన వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో తాతా మనవడు దుర్మరణం చెందారు. వైఎస్ఆర్ జిల్లా , రామాపురం : కర్నూలు – చిత్తూరు 40వ నెంబరు జాతీయ రహదారిపై రామాపురం మండలం గువ్వలచెరువు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం స్కూటీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు(55), అతని మనవడు యశ్వంత్(4) అక్కడికక్కడే మృతి చెందారు. రామాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గువ్వలచెరువుకు చెందిన సుబ్బరాయుడు తన మనవడైన యశ్వంత్‌తో స్కూటీలో పెట్రోల్ పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డుపైకి రాగానే కడప వైపు నుంచి వస్తున్న ఏపీ 04బీఎల్ 4915 నెంబరు గల కారు అధిక వేగంతో వచ్చి స్కూటీని ఢీ కొంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రామాపురం ఎస్ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలకు అంతరాయం లేకుండా చూశారు. గువ్వలచెరువులో విషాదం ఈ ప్రమాద విషయం తెలియగానే సంక్రాంతి పండుగ రోజున గువ్వలచెరువులో విషాదం చోటు చేసుకుంది. చిన్నారి యశ్వంత్ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే గడికోట దార్వకనాధరెడ్డి ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. -
ఆ మూడు గంటలు యమ ఘడియలు !
ఉడుకు నెత్తురు, ఉరకలెత్తే ఉత్సాహం, గాల్లో తేలిపోయే బైక్‌లు, కార్లు.. ఇవి చాలు నిండు నూరేళ్ల జీవితం అర్ధాంతంగా ముగిసిపోవడానికి, ఇంత జరుగుతున్నా యువతలో మాత్రం చైతన్యం రావడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి కర్ణాటక ,బనశంకరి : ఏడాదికేడాది బెంగళూరు నగరంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో నగరంలో రోడ్డు ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల గత ఏడాది కూడా బెంగళూరు నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే నమోదైనట్లు పోలీసుశాఖ వెల్లడించిన గణాంకాల ద్వారా తెలిసింది. గత ఏడాది బెంగళూరు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా సోమవారం రోజునే జరిగాయని అందులోనూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనే ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. ఈ మూడు గంటల వ్యవధిలో మొత్తం 768 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య 766 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఆరు గంటల వ్యవధిలో కార్యాలయాల నుంచి ఇళ్లకు బైక్‌లపై వెళ్లే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పాటు ఈ సమయంలో ద్విచక్రవాహనాల లైట్లు కూడా సరిగా పనిచేయకపోవడం ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం వరకు 720 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాత్రి తొమ్మిది గంటల నుంచి 12 గంటల మధ్య 536 రోడ్డు ప్రమాదాలు జరుగగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల మధ్య 474 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది బెంగళూరు నగరంలో మొత్తం 4,611 ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో 1,473 కారు ప్రమాదాలు ఉండగా 1,337 ద్విచక్ర వాహనాలు, 482 ట్రక్కులు, 392 బస్సులు ప్రమాదాలకు గురైనట్లు తెలిసింది. ద్విచక్ర వాహనదారులే అధికం : గత ఏడాది చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో కూడా ఎక్కువగా ద్విచక్రవాహనదారులు, పాదచారులే మృతి చెందినట్లు తెలుపుతున్నారు. బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 317 మంది ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా 276 మంది పాదచారులు మృతి చెందినట్లు తెలిసింది. మొత్తంగా గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 684 మంది మృతి చెందారు. నిర్లక్ష్యమే ముఖ్యకారణం : ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా ట్రాఫిక్ అదనపు కమిషనర్ హరిశేఖరన్ తెలిపారు. ముఖ్యంగా కార్లు,జీపు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. -
రాత్రిళ్లు హైవేలపై బైక్ ప్రయాణం నిషేధం
గుంటూరు వెస్ట్: రాత్రిళ్లు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవరసరంగా ప్రయాణించాల్సి వస్తే బస్సు, మరేదైనా పెద్ద వాహనంలో వెళ్లాలని సూచించారు. అవసరం కంటే ప్రాణం విలువైనదన్నారు. ట్రక్కులు, ట్రాక్టర్ల వల్ల కూడా ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయని, వారు రాత్రిళ్లు ప్రయాణించేటప్పుడు వెనుక రేడియం స్టిక్కర్లు వేయించుకోవాలన్నారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతడిపై ఆధారపడే కుటుంబం గురించి ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జాతీయ రహదారులు, ఆర్టీఓ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో అర్బన్, రూరల్ ఎస్పీలు విజయరావు, రాజశేఖరబాబు పాల్గొన్నారు. -
కొంపలు ముంచుతున్న అతివేగం
* భారీగా పెరుగుతున్న బైక్ ప్రమాదాలు * ర్యాష్ రైడింగ్‌తో ప్రాణాలు కోల్పోతున్న విద్యార్థులు, యువత * పట్టించుకోని కళాశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పలమనేరు: పలమనేరు పట్టణానికి చెందిన మునిచంద్రయ్య కుమారుడు స్థానిక మదర్‌థెరిస్సా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుండేవాడు. తల్లిదండ్రులతో కొట్లాడి బజాజ్ పల్సర్ 220 సీసీ బైక్ కొన్నాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కళాశాల సమీపంలో నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. మూడ్రోజుల క్రితం పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతూ ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. మూడు నెలలక్రితం పెళ్లయిన యువకుడు మృతి చెందగా, మరో యువకుడు ప్రస్తుతం కోమా లో ఉన్నాడు. ఇలాంటి ప్రమాదాలు జిల్లాలో మూడేళ్లుగా భారీగా పెరిగాయి. అతివేగంతోనే అనర్థాలు.. ప్రస్తుతం అధిక సామర్థ్యం కలిగిన పలు రకాల బైక్ లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనికితోడు సినిమాలు, టీవీల ప్రభావంతో యువత మోటర్‌బైక్‌ల వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. మార్కెట్లోకొ చ్చే కొత్త బైక్‌లను కొని రైడింగ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు బైక్ లేని దే బయటకు రావడం లేదు. కొందరు తల్లిదండ్రులను వేధించి మరీ కొంటున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఆర్భాటాలకు పోయి బైక్‌లు కొనిస్తున్నారు. అతివేగంగా వెళ్లడం, హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. భారీగా పెరుగుతున్న బైక్ ప్రమాదాలు.. రెండేళ్లుగా జిల్లాలో బైక్ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. 2013లో 58 బైక్ ప్రమాదాలు జరగగా ఎనిమిది మంది చనిపోయారు. 2014లో 38 రోడ్డు ప్రమాదాలు జరిగి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వారు 60 మందికి పైగా ఉన్నారు. ఈ ప్రమాదాలన్నీ అతివేగం కారణంగా జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బెట్టింగులు, ర్యాష్ రైడింగ్‌ల జోరు.. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట యువకులు బైక్ బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు బస్సుల్లో వెళ్లే తమ స్నేహితురాళ్లను ఫాలో అవుతూ బస్సు వెనకే రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇంకొందరు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలకు గురైన వారిలో చాలా మందికి లెసైన్సులు కూడా లేకపోవడం గమనార్హం. దీనిపై కళాశాల యాజమాన్యాలు, ఎంవీఐ, పోలీస్ యంత్రాంగం, తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిబంధనలు పాటించకపోతే చర్యలు.. బైక్‌లకు సంబంధించి ర్యాష్ డ్రైవింగ్, బెట్టింగ్ తదితరాలపై దృష్టి సారించాం. డ్రైవింగ్ లెసైన్స్, హెల్మెట్ లేకుండా వెళ్లే వారిపై చర్యలు తప్పవు. ముఖ్యంగా అండర్ ఏజ్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తాం. కళాశాల యాజమాన్యాలు సైతం విద్యార్థులకు అవగాహన కల్పించాలి. -డీఎస్పీ హరినాథరెడ్డి, పలమనేరు తల్లిదండ్రులు కాస్త ఆలోచించాలి.. ప్రిస్టేజీలకు పోయి పిల్లలకు బైక్‌లు కొనివ్వడం పొరపాటు. ప్రాణం పోతే తిరిగి రాదు. ఇప్పుడొస్తున్న కొత్త తరహా బైక్‌లు ఈ రోడ్లకు అనుకూలంగా లేవు. అధిక సీసీ కలిగిన బైక్‌లతో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అనుభవం లేని, డ్రైవింగ్ లెసైన్స్ లేని యువతపై దృష్టి సారిస్తాం. -మధుసూదన్, ఎంవీఐ, పలమనేరు