
ఐటీ సిటీ బెంగళూరులో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరగడం మామూలు విషయమైంది.
యశవంతపుర: ఐటీ సిటీ బెంగళూరులో చిన్న చిన్న కారణాలకే హత్యలు జరగడం మామూలు విషయమైంది. బైకు తగలడంతో కోపంగా చూశాడని కెంగేరి వద్ద యువకున్ని కత్తులతో పొడిచి హత్య చేశారు. శనివారం రాత్రి కెంగేరిలో కరగ ఉత్సవం జరిగింది.
భరత్ అనే యువకుడు చూడడానికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో బైకుపై వెళ్తుండగా అతని బైక్‌కు మరొక బైక్ తగిలింది. దీంతో భరత్ కోపంగా చూశాడు. నన్నే గుర్రుగా చూస్తావా అని మరో బైకిస్టు స్నేహితులతో కలిసి భరత్‌ను కత్తులతో పొడిచి చంపారు. శవాన్ని ఈడ్చుకొంటూ వెళ్తుండగా కెంగేరి రైల్వే పోలీసులు రావడంతో హంతకులు పారిపోయారు. రైల్వే పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు)