
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో పేర్కొన్న జరిమానాల కంటే తక్కువ జరిమానాలు ఏ రాష్ట్రమూ అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం పేర్కొంది. మోటారు వాహన (సవరణ) చట్టం–2019 పార్లమెంటులో ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సమ్మతి లేకుండా అందులో పేర్కొన్న దానికంటే తక్కువ జరిమానాలు విధించరాదని రాష్ట్రాలకు సూచించింది. చట్టంలో పేర్కొన్న దానికంటే తక్కువ జరిమానాలు విధించాలని ఓ రాష్ట్రం చూసినందున రవాణా శాఖ న్యాయ శాఖ సలహా తీసుకుంది. కొన్ని నేరాల్లో గుజరాత్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్‌లు జరిమానాలను తగ్గించాయని కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment