BJP Mirpet Corporator's Son Driving His Innova Car Without A Number Plate - Sakshi
Sakshi News home page

కమలం.. ఏమి అనరేం?

Published Wed, Feb 24 2021 3:09 PM | Last Updated on Wed, Feb 24 2021 6:26 PM

Meerpet Jillelaguda Corporator Son Innova Without Number Plate - Sakshi

మీర్‌పేట: ఈ కారుకు మోటార్‌ వాహన చట్టం నిబంధనలు వర్తించవా.? కొన్ని నెలలుగా నంబర్‌ ప్లేటు లేకుండానే రోడ్డెక్కుతున్న కారు. మీర్‌పేట కార్పొరేషన్‌ జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన ఓ కార్పొరేటర్‌ తనయుడు మోటారు వాహన చట్టం నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా తన ఇన్నోవా కారుకు నంబర్‌ ప్లేటు లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడు. నంబర్‌ ప్లేటులోని ఓ నంబర్‌ సరిగ్గా కనిపించకపోతేనే వాహనాన్ని ఆపి మరీ జరిమానాలు విధించే ట్రాఫిక్‌ అధికారులకు గత కొన్ని నెలలుగా అసలు నంబర్‌ ప్లేటు పూర్తిగా లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్న ఈ వాహనం కనిపించడం లేదా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

జరిమానా విధిస్తాం... 
ఈ విషయంపై వనస్థలిపురం ట్రాఫిక్‌ సీఐ బద్యానాయక్‌ను వివరణ కోరగా నంబర్‌ ప్లేటు లేకుండా వాహనాన్ని నడిపితే జరిమానాలు విధిస్తాం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement