
పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న అమలాపురం సీఐ సురేష్‌బాబు
సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): మద్యం లోడుతో వెళుతున్న వ్యానులో ఉన్న భారీ మద్యం బాటిళ్లను శనివారం అర్ధరాత్రి నోడల్ ఆఫ్ కాండాక్టు స్వా్కడ్ సిబ్బంది, అమలాపురం రూరల్ సీఐ జి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్సై డి.సురేష్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ కథనం ప్రకారం మాచవరం శివారు పోతాయిలంక నుంచి అంబాజీపేట వైపు వెళుతున్న బొలోరో వ్యాన్ పోలీసులు గస్తీ చేస్తుంటే, ఒక్కసారిగా వేగంతో దూసుకుపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ వ్యానును నిలిపి తనిఖీ చేశారు. బిల్లులు లేకుండా రవాణా చేస్తున్న రూ.5.50 లక్షల విలువ జేసే 4,795 మద్యం సీసాలు, 624 చిన్న బీరు బాటిళ్ల స్వాధీనం చేస్తున్నారు. రాజోలు మండలం కడలికి చెందిన వ్యాన్ డ్రైవర్ బోణం సాయి నరసింహమూర్తి, అతనితో ఉన్న అంత్రి రాజేష్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ వ్యాను ఎక్కడ నుంచి వస్తుందో తెలియదని, మామిడికుదురులో వ్యాన్‌ను తనకు అప్పగించారని వ్యాన్ డ్రైవర్ చెప్పాడని తెలిపారు. అంబాజీపేటలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఫోన్ ద్వారా తెలియజేస్తామని చెప్పాడని ట్రైనీ ఎస్సై తెలిపారు. బోడసుకుర్రు వచ్చిన తరువాత సెల్‌ఫోన్ కాన్ఫరెన్స్‌లో అంబాజీపేట వైపు రమ్మని చెప్పారన్నారు. వ్యాను ముందు బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వెళుతూ ఫోన్ కాన్ఫరెన్స్‌లోనే సంభాషించినట్టు తెలిపాడు. ఈ వ్యాన్‌పై జనసేన స్టిక్కర్ ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment