ఎన్నికల బాండ్ల విషయంలో ఎల్లో మీడియా ఏడుపులు మాములుగా లేవు. అయితే.. ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపేణా భారీగానే డబ్బును మూటగట్టుకుంది. ఇక గుర్తింపులేని జనసేన కూడా ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. గురువారం సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ అందించిన ఎన్నికల బాండ్ల నంబర్ల ద్వారా ఏయే పార్టీకి ఎంత విరాళం అందిందో స్పష్టంగా వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 2019 ఏప్రిల్ నుంచి 2023 సెప్టెంబర్ దాకా రూ.80 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలుగా వచ్చాయి. అయితే సరిగ్గా ఎన్నికల ముందర సీన్ మారింది. కేవలం అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను విరాళంగా టీడీపీ స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం.
టీడీపీకి ఎన్నికల బాండ్లు విరాళాలుగా సమర్పించిన వాళ్లలో.. షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ రూ.28 కోట్లతో రెండోస్థానంలో నిలిచాయి. యూపీ పవర్‌ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్ రూ.14 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ రూ.13 కోట్లు.. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల లిమిటెడ్ రూ.10 కోట్లు ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్‌ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ తరఫున రూ. 5 కోట్లు ఇచ్చింది.
ఇక జనసేన సంగతి భిన్నంగా ఉంది. సాధారణంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు వచ్చిన దాఖలాలు లేవు. అయితే.. బీజేపీ, టీడీపీ కూటమి భాగస్వామి, జనసేన మాత్రం ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించింది. పవన్ కల్యాణ్ పార్టీకే కాదు.. 2019-21 మధ్య గుర్తింపు లేని ఏ ఒక్క పార్టీకి కూడా విరాళాలు రాలేదు. కానీ, 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి. కొత్త పార్టీలు లేదంటే మునుపటి ఎన్నికల్లో తగినన్ని ఓట్లను సంపాదించని రాజకీయ పార్టీలను గుర్తింపు లేని పార్టీలుగా ఈసీ ప్రకటిస్తుంది. తద్వారా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్న గుర్తింపు లేని పార్టీగా జనసేన నిలవడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment