
'మతతత్వ బీజేపీతో జనసేన... ఆశ్చర్యం'
మతతత్వ భారతీయ జనతాపార్టీ (బీజేపీ)తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల స్థాపించిన జనసేన పార్టీ కలవడం ఆశ్చర్యంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విస్మయం వ్యక్తం చేశారు. జనసేనకు తోడు టీడీపీ, లోక్సత్తా పార్టీలు కూడా బీజేపీతో పొత్తుకు తహతహలాడటం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్లో బీవీ రాఘవులు మాట్లాడుతూ... తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలలో మతతత్వ బీజేపీ బలపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్తో సీపీఐ పొత్తు పెట్టుకుంటే తాము సీపీఐకి దూరంకాక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము పొత్తుకు సిద్దమని రాఘవులు స్పష్టం చేశారు.