సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ ద్వారా కాపులకు ఆర్థిక సహయం అందజేయడం ఆనందకరమని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. బుధవారం ఆయన ఎంపీ వంగా గీతతో కలిసి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘కాపు సోదరీమణులు ఇళ్ళు దాటి బయట ఎటువంటి పనులకు వెళ్ళరు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . ప్రస్తుత పరిస్ధితుల వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక భరోసా ఇవ్వాలని సీఎం జగన్ ముందు చూపుతో చేసిన నిర్ణయానికి ధన్యవాదాలు. వచ్చే నెలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరీమణులకు కూడా ఇటువంటి పథకం అమలు అవుతుంది. ఇప్పటికే కేబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. త్వరలోనే ఈ పథకం ప్రారంభించే తేది ఖరారు అవుతుంది. దేశంలోనే బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు సంబంధించిన ఒక గొప్ప పధకాన్ని సీఎం జగన్ అమలు చేయబోతున్నారు’ అని అన్నారు. (కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్ )
కాకినాడ ఎంపీ వంగా గీతా మాట్లాడుతూ...‘కాపు కుటుంబాల తరపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు. ఆర్ధిక ఇబ్బందులు, కరోనా కష్టాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అర్హత ఉన్న లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నించేవి. కానీ సీఎం జగన్ పాలనలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాపు, తెలగ, ఒంటరి కులాల్లో మహిళలకు మానిటరీ బెనిఫిట్ అందించడంతో పాటుగా అదనంగా అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా పథకాల ద్వారా సహాయం చేస్తున్నారు. మహిళలకు అందించే ప్రతి రూపాయి కూడా తమ కుటుంబ సంక్షేమానికే ఖర్చు పెడతారు’ అని ఆమె అన్నారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం)
Comments
Please login to add a commentAdd a comment