
సాక్షి, కాకినాడ: గత టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరోజైనా 108 వాహనాల పని తీరును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్షించారా? అని ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారన్నారని మండిపడ్డారు. (సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం)
టీడీపీ నేతలను రాష్ట్ర ప్రజలు క్షమించరని పిల్లి ధ్వజమెత్తారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఆర్థికంగా ఎంతో వెనకపడిన పేద ప్రజలకు సంక్షేమం.. ఆరోగ్య పథకాల విషయాలో ఏపీ విజయకేతనం ఎగురవేస్తోందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో 108, 104 వాహనాలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయన్నారు. బెంజి సర్కిల్‌లో జరిగిన ఘటనను దేశ ప్రజలంతా చూశారన్నారన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం ఆయన అన్నారు.