Viswaroop
-
అధికారం శాశ్వతం కాదు.. కూటమికి వైఎస్సార్సీపీ నేతల హెచ్చరిక
తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు బెయిల్ మంజూరైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శ్రీకాంత్ విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాంత్ కోసం వైఎస్సార్సీపీ నేతలు జైలు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు. ఇప్పటి కంటే వడ్డీతో సహా కూటమి నేతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు. పార్టీని అణిచివేయాలనే ఉద్దేశంతో నాయకులు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగినందుకే కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో ఎన్నికల ముందు బెదిరించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయటం దారుణం. ఒకవైపు హింసాత్మక చర్యలు ఉండవంటూనే మరోవైపు హింసాత్మక చర్యలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం హింసాత్మక విధానాలను మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.రామచంద్రపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ..‘మాజీ మంత్రి పైన అతని కుమారుడి పైన కేసులు పెడతామని మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో మంత్రి బహిరంగంగా చెప్పాలి. ఎన్నికల అఫిడవిట్లో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడగడం తప్పా?. ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో ఆలోచించండి అంటూ హితవు పలికారు. -
‘బాబు కాళ్లు పట్టుకున్న నేతకు ఆ అర్హత లేదు’
-
ఘనంగా మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
-
‘తప్పు చేస్తే.. సీఎం జగన్ ఎవరిని క్షమించరు’
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రిలో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండనం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకున్నారని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ దళితుల పక్షపాతి. తప్పు చేస్తే ఎవరిని క్షమించరు. మాజీ ఎంపీ హర్షకుమార్ సంస్కారహీనంగా మాట్లాడారు. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. బహిరంగంగా చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్. ఎంపీ సీటు కోసం దళితుల ఆత్మగౌరవాన్ని ఆయన చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు. ఇద్దరు దళితులకు చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తే.. సీఎం జగన్ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఐదుగురికి కీలకమైన బాధ్యతలు కట్టబెట్టారు. ఒక ఎస్టీని డీజీపీగా, ఒక దళితుడిని ఎన్నికల కమిషనర్‌గా చేసిన వ్యక్తి సీఎం జగన్’ అని స్పష్టం చేశారు. (‘హర్షకుమార్.. నాలుక అదుపులో పెట్టుకో’) విశ్వరూప్ మాట్లాడుతూ.. ‘దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో హర్షకుమార్ పోటీ చేస్తే 9000 వేల ఓట్లు, ఆయన కుమారుడు పోటీ చేస్తే 600 ఓట్లు వచ్చాయి. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు విమర్శించారు. దళితులు శుభ్రంగా ఉండరన్న ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. చంద్రబాబు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. చంద్రబాబు ఊరు చివర అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చూస్తే సీఎం జగన్ విజయవాడ నడిబొడ్డున పెట్టాలని చూశారు. పేదలకు ఇంగ్లీషు మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. దళితులకు ఐదేళ్లలో టీడీపీ చేసిన ఖర్చుపైన.. ఏడాదిలో వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చుపైన బహిరంగ చర్చకు మేము సిద్ధం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దళితులకు రూ.11, 205 వేల కోట్లు ఖర్చు చేశారు’ అని తెలిపారు. -
టీడీపీ 108, 104లను నిద్రావస్థలో ఉంచింది: పిల్లి
సాక్షి, కాకినాడ: గత టీడీపీ పాలనలో 108, 104 వాహనాలను నిద్రావస్థలో పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరోజైనా 108 వాహనాల పని తీరును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్షించారా? అని ప్రశ్నించారు. వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారన్నారని మండిపడ్డారు. (సీఎం జగన్ నిర్ణయాలు చరిత్రాత్మకం) టీడీపీ నేతలను రాష్ట్ర ప్రజలు క్షమించరని పిల్లి ధ్వజమెత్తారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై సీఎం జగన్ దృష్టి సారించారని, ఆర్థికంగా ఎంతో వెనకపడిన పేద ప్రజలకు సంక్షేమం.. ఆరోగ్య పథకాల విషయాలో ఏపీ విజయకేతనం ఎగురవేస్తోందని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో 108, 104 వాహనాలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయన్నారు. బెంజి సర్కిల్లో జరిగిన ఘటనను దేశ ప్రజలంతా చూశారన్నారన్నారు. కరోనా కట్టడికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం ఆయన అన్నారు. -
టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: మంత్రి విశ్వరూప్
-
శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరు
-
కాపు నేతలకు విశ్వరూప్ సంఘీభావం
అమలాపురం టౌన్ : మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అమలాపురానికి చెందిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా వపన్కుమార్ను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసు బందోబస్తు నడుమ పవన్ ఇంట్లోనే నిర్బంధించారు. ఇప్పటికే పవన్ తండ్రి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తిని గురువారం నుంచి హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమలాపురంలో కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కూడా మూడు రోజులుగా హౌస్ అరెస్ట్‌లోనే ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ఈ ముగ్గురు కాపు నేతలను వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ వారి ఇళ్లకు వెళ్లి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, వాకపల్లి శ్రీను, రంకిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఉన్నా రు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు కూడా ఆ నేతలను కలిసి మద్దతు తెలిపారు. పోలీసుల అనుమతితో కిర్లంపూడికి... గృహ నిర్బంధంలో ఉన్న నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, రావులపాలెం నుంచి కాపు నేత ఆకుల రామకృష్ణ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శుక్రవారం సాయంత్రం కిర్లంపూడికి వెళ్లారు. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వాయిదా పడ్డ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు వెళుతున్నట్టు వారు తెలిపారు. -
రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..
భూ సేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోను తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వరూప్ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయని ఆర్డినెన్స్‌ను రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరవడానికే ప్రభుత్వం 166 జీవో చేసిందని, ఇది ప్రజాస్వామ్యమా? రాక్షస పాలనా? అని ప్రశ్నించారు. రైతులే స్వచ్ఛందంగా భూములిస్తున్నారన్న మంత్రులు ఇప్పడెందుకు భూ సేకరణకు సిద్ధం అయ్యారని విశ్వరూప్ ప్రశ్నించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవోను అడ్డు పెట్టుకుని ఏపీలో లక్షలాది ఎకరాల భూ సేకరణకు సిద్ధమైందన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఎంవోయూను ఇప్పటి కూడా ఏపీ ప్రభుత్వం బయటపెట్టడం లేదని విశ్వరూప్ విమర్శించారు. కాగా యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం-2013ను సవరిస్తూ గత నెల 3న కేంద్రం జారీ చేసిన అర్డినెన్స్‌లోని సెక్షన్ 10 (ఎ) (1) ప్రకారం.. ప్రజోపయోగ ప్రాజెక్టుల జాబితాలో 'రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు'ను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫలితంగా రాజధానిలో భూ సేకరణకు.. 'భూసేకరణ చట్టం-2013'లోని రెండు, మూడు చాప్టర్లలో పేర్కొన్న సామాజిక ప్రభావం అంచనా, ఆహార భద్రతకు సంబంధిత అంశాల నుంచి మినహాయింపు లభించింది. -
రైతుల నడ్డి విరవడానికే 166 జీవో..
-
'అమలాపురాన్ని కేరళగా మారుస్తా'
కోనసీమాలో భాగమైన అమలాపురాన్ని కేరళ లాగా అభివృద్ధి చేస్తామని ఆ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి పి.విశ్వరూప్ స్పష్టం చేశారు. కేరళలో కొబ్బరి తోటల సాగు, అక్కడి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలుపై అధ్యాయనం చేసి అమలాపురం ప్రాంతంలో అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వరూప్ మాట్లాడుతూ... అమలాపురం ప్రాంతాన్ని అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని ఆయన స్థానిక ప్రజలకు భరోసా ఇచ్చారు. అమలాపురాన్ని వ్యాపారానికి ముఖ్య కూడలిగా అభివృద్ధి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసువస్తానని చెప్పారు. గతంలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేతలు ఈ ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం ప్రజలకు తనపై పూర్తి నమ్మకం ఉందని... ఈ నేపథ్యంలో తనను అత్యధిక మేజార్టీతో స్థానిక ప్రజలకు గెలిపిస్తారని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో విశ్వరూప్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
వేగుచుక్కలా.. వైతాళికునిలా
జనం జేజేలు అందుకున్న జగన్ కోలంక నుంచి రామచంద్రపురం వరకూ జనగోదారులైన దారులు మండే ఎండను లక్ష్యపెట్టని ఆపేక్ష ‘మా ముఖ్యమంత్రి నువ్వే’ అంటూ మార్మోగిన నినాదాలు వేగుచుక్క రాక.. రానున్న ఉషోదయానికి సూచిక. నవయుగానికి మేలుకొలుపు పలికేవారిని వైతాళికుడు అంటారు. జనం.. మహానేత వైఎస్ తనయుడు జగన్మోహన్రెడ్డిని.. తమను కష్టాల పాలు చేసిన చీకటి రాజ్యాన్ని పారదోలి.. తమజీవితంలో వెలుగుల పూలు పూయించే నవోదయానికి నాంది పలికే వేగుచుక్కలా పరిగణిస్తున్నారు. కీడు కాలం తొలగి, అందరికీ మేలు నిశ్చయమయ్యే స్వర్ణయుగ వైతాళికుడిని ఆయనలో చూసుకుంటున్నారు. అందుకే జననేత వెళ్లిన ప్రతి తావునా.. ప్రేమాదరాల తావి గుబాళించింది. ‘జై జగన్’ నినాదం.. రేపటి మధుర గీతానికి పల్లవిలా ప్రతిధ్వనించింది. సాక్షి, రామచంద్రపురం : ఓవైపు గోదావరి కాలువల్లో జలం ఉరకలేస్తుంటే..మరో వైపు జనం పరవళ్లు తొక్కారు. భావి వెలుగులకు భరోసానిస్తున్న ‘యువ సూర్యుడి’ దిక్కుగా వారు పొద్దు తిరుగుడు పువ్వులవుతుంటే.. చండ్రనిప్పులు చెరిగే భానుడే బిత్తరపోయాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి గురువారం కాజులూరు మండలం కోలంక నుంచి రామచంద్రపురం వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనకు మంగళ హారతులిస్తూ, ఆయనపై పూలవర్షం కురిపిస్తూ సరిహద్దులు రద్దయిన తమ అనురాగాన్ని చాటారు. మహిళలు, వృద్ధులు, యువత, కూలీలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులు.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన జగన్‌లో వారు తమ ఆత్మబంధువును చూసుకున్నారు. దారిపొడవునా ‘జై జగన్! జగనన్నా.. నువ్వే మా ముఖ్యమంత్రివన్నా’ అన్న నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో నాలుగో రోజైన గురువారం జగన్ పర్యటన పోటెత్తిన జనంతో ఉధృత ప్రవాహాన్ని తలపించింది. ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు కన్నెర్ర చేసినా జనం ఖాతరు చేయలేదు. అంతకంతకూ ముదిరే ఎండను వెక్కిరిస్తున్నట్టు.. జగన్ పర్యటన సాగినంత మేరా.. ఆయనను చూసేందుకు, ఆయన పలుకులు ఆలకించేందుకు ఇసుక వేస్తే రాలనంతగా జనం ఎగబడ్డారు. వేగాయమ్మపేట, కుయ్యేరు, బాలాంతరం, ద్రాక్షారామ, తాళ్లపొలం, వెల్ల వంతెన సెంటర్లు జనసరోవరాల్ని తలపించాయి. అభిమాననేతను చూసేందుకు గోపాలపేట గ్రామస్తులు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లపై బాలాంతరం జంక్షన్‌కు వచ్చి, ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ ఈ పర్యటనలో జగన్ వెంట సాగారు. కోలంక నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామచంద్రపురానికి అరగంటలో చేరుకోవచ్చు. అయితే అడుగడుగునా వెల్లువెత్తిన జనాదరణే కాన్వాయ్‌కు స్పీడ్ బ్రేకర్‌గా మారి..కోలంక నుంచి ద్రాక్షారామ చేరుకునేందుకు నాలుగున్నర గంటలు, అక్కడి నుంచి రామచంద్రపురానికి మరో రెండున్నర గంటలు పట్టింది. ఇక జనభేరికి వచ్చిన జననేతను చూసేందుకు పోటెత్తిన ప్రజలతో రామచంద్రపురం వీధులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. జననేతపై విద్యార్థుల పూలవర్షం కోలంకలో దంతులూరి రామభద్రరాజు ఇంటి నుంచి ఉదయం 10.10 గంటలకు బయల్దేరిన జగన్‌కు తొలుత కోలంక పబ్లిక్ స్కూల్ చిన్నారులు దారికిరువైపులా బారులు తీరి అపూర్వ స్వాగతం పలికారు. జగన్ కూడా వారి మాదిరిగానే అభివాదం చేస్తూ, వారిని అక్కున చేర్చుకుని ముద్దాడారు. కోలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులైతే జననేతపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ ఉప్పుమిల్లి, కుయ్యేరు, బాలాంతరం, పంపన వారిపాలెం, కుడుపూడివారిపాలెం, ఎర్రపోతవరం, వేగాయమ్మపేటల మీదుగా ద్రాక్షారామ చేరుకున్నారు. అక్కడ భోజన విరామం అనంతరం జగన్నాయకులపాలెం, చినతాళ్లపొలం, పెదతాళ్లపొలం, వెల్లవంతెనల మీదుగా రామచంద్రపురం చేరుకున్నారు. పట్టణ వీధుల్లో పర్యటించిన అనంతరం జనభేరిలో పాల్గొన్నారు. కష్టజీవుల వెతలు వింటూ.. ఉప్పుమిల్లి వద్ద ఇటుక బట్టీ కార్మికులతో, పంపనవారిపాలెం వద్ద కల్లుగీత కార్మికులతో జగన్ మాట్లాడారు. రోజుకు ఎంత కూలి వస్తుంది, ఆ మొత్తం సరిపోతుందా?* అంటూ ఆరా తీశారు. బట్టీల్లో పనితో అనారోగ్యాల పాలవుతున్నామని, తమను ఆదుకునే వారు లేరని బట్టీ కార్మికులు ఎనకోట వీర్రాఘవులు, బుంగా సుబ్బారావు, మరియమ్మ మొరపెట్టుకున్నారు. ఒక చెట్టు ఏడాదికి ఎన్ని రోజులు కల్లు ఇస్తుంది, చెట్టుకు ఇన్స్యూరెన్స్ ఇస్తున్నారా? అని కల్లుగీత కార్మికులను అడగ్గా.. ఏడాదికి 90 రోజులు మాత్రమే కల్లు వస్తుందని, మహానేత వైఎస్సార్ హయాంలో చెట్టుకు ఇన్స్యూరెన్స్ ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదని కుడుపూడి రామకృష్ణ అనే గీత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. కోలంక వద్ద నడవలేని స్థితిలో ఉన్న నందికోళ్ల సోమరాజు అనే వికలాంగుడి వద్దకు జగన్ కారు దిగి వెళ్లి పరామర్శించారు. తనకు పింఛన్ రావడం లేదని మొర పెట్టుకోగా త్వరలోనే మంచిరోజులొస్తాయని ధైర్యం చెప్పారు. జగన్ వేగాయమ్మపేట చేరుకునే సరికి అక్కడ వీరభద్రుడి బోనం నిర్వహిస్తున్నారు. కొత్త పెళ్లికూతురైన చొల్లంగి దేవి ఆయన వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. వేగాయమ్మపేటతో పాటు ద్రాక్షారామ మండాలమ్మవారి పేటలో అంబేద్కర్ విగ్రహాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, సీఈసీ సభ్యుడు రెడ్డి వీర వెంకటప్రసాద్, సీజీసీ సభ్యుడు గంపల వెంకటరమణ, రాష్ర్ట యూత్ కమిటీ సభ్యుడు తాడి విజయభాస్కరరెడ్డి, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, మంతెన రవిరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వట్టికూటి సూర్యచంద్ర రాజశేఖర్, యనమదల గీత, రాష్ర్ట నీటి వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంగా ఉంచే సత్తా జగన్‌కే ఉంది: విశ్వరూప్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా గల నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఒక్కరేనని మాజీ మంత్రి విశ్వరూప్ చెప్పారు. అందుకే తాను వైఎస్ఆర్ సిపిలో చేరినట్లు తెలిపారు. ఎల్బి స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం తాను మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. రాష్ట్ర విభజనకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపడంతో పినిపే విశ్వరూప్ మంత్రి పదవికి, పార్టీకి గత నెలలో రాజీనామా చేశారు. నేరుగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కే ఆయన రాజీనామా లేఖ ఇచ్చారు. గవర్నర్ దానిని ఆమోదించారు. -
సమైక్యంగా ఉంచే సత్తా జగన్‌కే ఉంది: విశ్వరూప్
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విశ్వరూప్
హైదరాబాద్ : మాజీమంత్రి విశ్వరూప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ ....విశ్వరూప్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ....మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాను సుశిక్షితుడైన సైనికుడిలా పోరాడతానని చెప్పారు. -
'కిరణ్‌పై నమ్మకం లేకే రాజీనామా చేశా'
-
'కిరణ్‌పై నమ్మకం లేకే రాజీనామా చేశా'
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై నమ్మకం లేకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆయన శుక్రవారం నిమ్స్‌లో వైఎస్ జగన్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విశ్వరూప్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గటం లేదన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు విశ్వరూప్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తామంటూ పదవిలో కొనసాగేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వరూప్ ఈనెల 18న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. -
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ సవుర్పించిన రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోదించారు. విశ్వరూప్ నిర్వహించిన శాఖ బాధ్యతలను ఇకపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చూస్తారని గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ఆగస్టు మొదటి వారంలోనే రాజీనావూ చేశారు. అప్పట్లోనే వుుఖ్యవుంత్రికి రాజీనామా లేఖ సవుర్పించారు. అయితే నెల రోజులైనా తన రాజీనామా, ఆమోదం పొందకపోవడం, విభజనపై కాంగ్రెస్ హైకవూండ్ వైఖరిలో మార్పు రాకపోవడంతో విశ్వరూప్ రెండ్రోజుల క్రితం గవర్నర్‌కే స్వయుంగా రాజీనామా లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలో వుుఖ్యవుంత్రి శనివారం ఉదయం గవర్నర్‌కు ఫోన్ చేయుడం, విశ్వరూప్ రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం, రాజీనావూను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. -
ఆ ఇద్దరికీ మరింత సెగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్ గురువారం సమైక్యాంధ్ర కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని హైదరాబాద్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ పునరాలోచన చేసి, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే పార్టీలో కొనసాగుతానని, అందుకు నవంబర్ ఒకటోతేదీ డెడ్‌లైన్ అని చెప్పారు. అప్పటికీ విభజనపై కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోతే పార్టీకి కూడా గుడ్‌బై చెపుతానన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందచేసి తక్షణం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వరూప్ రాజీనామా చేయడంతో జిల్లాలో మరో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజుల మాటేమిటని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మంత్రి పదవులను పట్టుకు వేలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు తోట, పినిపే ఆగస్టు నెల మొదట్లో వారం రోజుల తేడాలో రాజీనామా చేశారు. అయితే రాజీనామాలను ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్‌కు అందచేశారు. కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు రాజీనామా మాట అటుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన తరువాత కనీసం జిల్లావైపు కన్నెత్తి చూడనేలేదు. రాష్ట్ర మంత్రుల రాజీనామాలను సమైక్యవాదులు రాజీడ్రామాలుగా అభివర్ణిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జిల్లాలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విశ్వరూప్ రాజీనామాతో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కూడా విశ్వరూప్ తెలిపారు. కాగా, విశ్వరూప్ రాజీనామా చేయడంతో తోట నరసింహం రాజీనామా కోసం సమైక్యవాదులు ఎదురు చూస్తున్నారు. తాను ప్రారంభంలోనే రాజీనామా చేశానని మంత్రి తోట చెపుతున్న మాటలకు విశ్వసనీయత లేదని వారు విమర్శిస్తున్నారు. 15 రోజులుగా మంత్రి తోట ఎక్కడకు వెళితే అక్కడ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. తాను రాజీనామా చేశానని చెపితే సరిపోదని, విశ్వరూప్ మాదిరిగా రాజీనామాను గవర్నర్‌కు అందచేసి ఆమోదింపజేసుకోవాలని ఇప్పుడు సమైక్యవాదులు తోటను డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ తోట రాజీనామా డ్రామాగానే మిగులుతుందంటున్నారు. పళ్లంరాజు ఏం చేస్తారో? మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 58 రోజుల్లో ఏ ఒక్క రోజూ కేంద్ర మంత్రి పళ్లంరాజు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయారు. పైకి మాత్రం సమైక్యాంధ్ర ముందు తన మంత్రి పదవి పెద్ద విషయం కాదని చెప్పుకొన్నారు. కానీ మంత్రి పదవిని వదల్లేక, సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి ఢిల్లీకే పరిమితమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం వెనక్కు తీసుకుంటుందని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్, ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు పదేపదే చెపుతున్నా పళ్లంరాజు స్పందించకపోవడం సమైక్యాంధ్రపై ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని జిల్లా జేఏసీ ప్రతినిధులంటున్నారు. ప్రజాప్రతిఘటన ఎదురైనా మిగిలిన కేంద్ర మంత్రులు తమ జిల్లాల్లో ఏదో సందర్భంలో పర్యటించినా పళ్లంరాజు ఆ సాహసం చేయలేదు. ఆయన జిల్లాలో అడుగుపెడితే తరిమికొట్టాలని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా పలువురు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో గురువారం పళ్లంరాజు సోనియాగాంధీతో 20 నిమిషాల సేపు జరిపిన భేటీలో ఏ విషయాలు చర్చించారు, సమైక్యాంధ్ర కోసం అసలు ఏమైనా మాట్లాడారా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన పదవిని వదులుకుంటారా లేక, పదవిని అంటిపెట్టుకుని ఢిల్లీకే పరిమితమవుతారో వేచి చూడాల్సిందే. -
పోలీసుల అదుపులో మంత్రి విశ్వరూప్ కుమారుడు