కాపు నేతలకు విశ్వరూప్ సంఘీభావం
Published Fri, Nov 18 2016 10:50 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
అమలాపురం టౌన్ :
మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అమలాపురానికి చెందిన రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా వపన్‌కుమార్‌ను పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసు బందోబస్తు నడుమ పవన్ ఇంట్లోనే నిర్బంధించారు. ఇప్పటికే పవన్ తండ్రి, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తిని గురువారం నుంచి హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమలాపురంలో కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కూడా మూడు రోజులుగా హౌస్ అరెస్ట్‌లోనే ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న ఈ ముగ్గురు కాపు నేతలను వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ వారి ఇళ్లకు వెళ్లి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు కల్వకొలను బాబి, వాకపల్లి శ్రీను, రంకిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు ఉన్నా రు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు కూడా ఆ నేతలను కలిసి మద్దతు తెలిపారు.
పోలీసుల అనుమతితో కిర్లంపూడికి...
గృహ నిర్బంధంలో ఉన్న నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, రావులపాలెం నుంచి కాపు నేత ఆకుల రామకృష్ణ పోలీసు ఉన్నతాధికారుల అనుమతితో శుక్రవారం సాయంత్రం కిర్లంపూడికి వెళ్లారు. కాపు ఉద్యమ నేత ముద్రగడతో వాయిదా పడ్డ పాదయాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు వెళుతున్నట్టు వారు తెలిపారు.
Advertisement