సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అష్టకష్టాలు పడుతున్నారు. పోటీ చేసే స్థానం మొదలు పెడితే ప్రచారం వరకు కూడా అన్ని విషయాల్లో పవన్‌కు చిక్కులే వచ్చిపడ్డాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీత ప్రచారంలో దూసుకుపోతుండగా.. పవన్ మాత్రం కష్టాలు తప్పించుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. భీమవరం ప్రజలు కొట్టిన దెబ్బకు ఏం చేయాలో పాలుపోని పవన్ కల్యాణ్‌కు కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంపై దృష్టిపెట్టారు. కాపు సామాజిక వర్గం ఓట్లను నమ్ముకుని పిఠాపురంలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
పిఠాపురం నుంచి పోటీ నుంచి వర్మ రెడీ అయ్యారో లేదో.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పెద్ద షాక్ ఇచ్చారు. అసలు పవన్ ఇక్కడ పోటీ చేయడమేమిటంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. అంతటితో ఆగకుండా టీడీపీ మహిళా నేతలతో బండ బూతులను తిట్టించారు వర్మ. ఇదేం కర్మరా అనుకుంటూ వర్మ ఇంటికెళ్లిన పవన్.. తనకు సహకరించాలంటూ వేడుకున్నారు. తనకు తెలియకుండా పిఠాపురంలో తిరగవద్దన్న వర్మ.. ఎన్నికలు మొత్తం తనకే వదిలేయాలనే కండీషన్ పెట్టారు. అంతేకాదు. ఎలక్షన్ ఫండ్ మొత్తం తనకే ఇవ్వాలని, ఖర్చులన్నీ చూసుకుంటానంటూ హుకుం జారీ చేశారు.
పేకాట క్లబుల వర్మ అంటూ గతంలో విమర్శించిన పవనే.. ఇప్పుడు వర్మ క్లబులో చేరాల్సి వచ్చింది. ఇక పిఠాపురంలో తన గెలుపు వర్మ చేతుల్లోనే ఉందని ప్రజలందరి ముందు ఒప్పుకున్నారు పవన్. ప్రజలు తనను నమ్మే పరిస్థితి లేదని భావించిన పవన్.. కుల రాజకీయమే కరెక్ట్ అని భావించారు. అందుకే పిఠాపురం నుంచి పోటీకి సిద్దమయిన ఉదయ్ శ్రీనివాస్‌ను తప్పించి అక్కడనుంచి పోటికి సిద్దమయ్యారు. అందుకోసం ఉదయ్‌కి ఎంపీ సీటు కేటాయించారు పవన్. ఇక కూటమి పేరిట ఎన్ని పార్టీలు కలిసిన పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో జబర్దస్త్ కమెడియన్లను రంగంలోకి దించారు. ఆది, రాంప్రసాద్, గెటప్ శ్రీనుతో పిఠాపురంలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాపు ఓటర్లపై నమ్మకంతో పిఠాపురం వెళ్లిన పవన్‌ను ఆ సామాజిక వర్గం ఓటర్లు ఏమాత్రం నమ్మడం లేదు. ఇక చేసిందేమీలేక అన్న చిరంజీవి దగ్గరకు వెళ్లి మద్దతు కోరారు. కష్టాల్లో ఉన్నానంటూ ఐదు కోట్లు ఫండింగ్ కూడా తీసుకుని.. చిరంజీవిని ఫ్యాన్స్‌ను తన వైపు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్.
Comments
Please login to add a commentAdd a comment