'కిరణ్పై నమ్మకం లేకే రాజీనామా చేశా' | I resigned after losing faith in CM kiran kumar reddy, sasy viswaroop | Sakshi
Sakshi News home page

'కిరణ్పై నమ్మకం లేకే రాజీనామా చేశా'

Published Fri, Oct 11 2013 11:39 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'కిరణ్పై నమ్మకం లేకే రాజీనామా చేశా' - Sakshi

'కిరణ్పై నమ్మకం లేకే రాజీనామా చేశా'

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపై నమ్మకం లేకే రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి విశ్వరూప్ అన్నారు. ఆయన శుక్రవారం నిమ్స్లో  వైఎస్ జగన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి విశ్వరూప్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కేంద్రం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గటం లేదన్నారు.

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కట్టుబడి ఉందన్నారు. అందుకే వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్లు విశ్వరూప్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తామంటూ పదవిలో కొనసాగేందుకు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వరూప్ ఈనెల 18న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement