సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ సవుర్పించిన రాజీనామాను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఆమోదించారు. విశ్వరూప్ నిర్వహించిన శాఖ బాధ్యతలను ఇకపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చూస్తారని గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ర్ట విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ ఆగస్టు మొదటి వారంలోనే రాజీనావూ చేశారు. అప్పట్లోనే వుుఖ్యవుంత్రికి రాజీనామా లేఖ సవుర్పించారు. అయితే నెల రోజులైనా తన రాజీనామా, ఆమోదం పొందకపోవడం, విభజనపై కాంగ్రెస్ హైకవూండ్ వైఖరిలో మార్పు రాకపోవడంతో విశ్వరూప్ రెండ్రోజుల క్రితం గవర్నర్‌కే స్వయుంగా రాజీనామా లేఖ సమర్పించారు. ఈ నేపథ్యంలో వుుఖ్యవుంత్రి శనివారం ఉదయం గవర్నర్‌కు ఫోన్ చేయుడం, విశ్వరూప్ రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం, రాజీనావూను ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం వెంటనే ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి.
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
Published Sun, Sep 29 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement