వెన్నుపోటు పొడవలేను: ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ | MP Pilli Subhash Chandra Bose Reacts On Party Change Rumours, Says He Will Continue In YSRCP | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడవలేను: ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

Published Fri, Aug 30 2024 4:08 AM | Last Updated on Fri, Aug 30 2024 9:40 AM

MP Pilli Subhash Chandra Bose says he will continue in YSRCP

వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా

ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

రామచంద్రపురం: ‘నాకు రాజకీయ విలు­వలు ఉన్నాయి. వైఎ­స్సార్‌­సీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవ­లేను. నేను వైఎస్సార్‌­సీపీలోనే కొనసాగుతాను...’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ తనకు కలలో కూడా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయక­త్వం­లోనే పని చేస్తానని, వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాçపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని పేర్కొ­న్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement