సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో నదిలో గల్లంతైన వారిలో ఓ మహిళ మృతదేహాం లభ్యమైంది. కొమ్మలపల్లి వద్ద గల్లా నాగమణి మృతదేహాన్ని గాలింపు చర్యలో సిబ్బంది గుర్తించారు. గల్లంతైన ఆరుగురి విద్యార్ధుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సలాదివారిపాలెం లంక నుంచి పశువలలంకకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలికాఫ్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత లేదు..!
గోదావరి నదిలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. యానం బీచ్ నుంచి కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకధాటిగా వర్షం కురుస్తున్నా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోజులో 45 నిమిషాలు మినహా వర్షం కురుస్తూనే ఉంది. అంతేకాక విద్యార్థినుల కోసం హెలికాప్టర్‌తో సెర్చ్ చేసినా స్పష్టత రావడం లేదని కలెక్టర్ చెప్పారు. రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. మూడు డ్రోన్లు కూడా వినియోగిస్తామని తెలిపారు. రేపు కూడా ఆపరేషన్ కొనసాగుతుందని తెలియజేశారు.
గల్లంతైన విద్యార్ధుల వివరాలు..
తిరుకోటి ప్రియ(14), 8వ తరగతి, వలసలతిప్ప, ముమ్మిడివరం మండలం
సుంకర శ్రీజ(15), 10వ తరగతి, సలాదివారి పాలెం
పోలిశెట్టి వీర మనీషా(15), 10వ తరగతి
పోలిశెట్టి అనూష(13), 9వ తరగతి, సలాదివారి పాలెం
పోలిశెట్టి సుచిత్ర (11), 6 వ తరగతి, సలాది వారి పాలెం
కొండేపూడి రమ్య(14), 9వ తరగతి, శేరిలంక
Comments
Please login to add a commentAdd a comment