
సాక్షి, పత్తిపాడు : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 232వ రోజు ప్రారంభమైంది. రాజన్న తనయుడు వైఎస్ జగన్ బుధవారం ఉదయం బి.బి.పట్నం క్రాస్ నుంచి తన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గిడిజాం, ఎస్ అగ్రహారం మీదుగా డీజే పురం వరకూ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. వైఎస్ జగన్ పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిపక్షనేతకు మద్దతుగా ప్రజలు పాదయాత్రలో పాల్గొని వారి సమస్యలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్న తనయుడు ముందుకు సాగుతున్నారు. కాగా, మంగళవారం నాటికి ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మొత్తం 2,677.9 కిలోమీటర్లు నడిచారు.