
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సంద ర్భం గా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి.
మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’అని పేర్కొన్నారు.