
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్ జగన్ పైలాన్‌ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
అంతకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)