
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 191వ రోజు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, వైఎస్ జగన్ శనివారం పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం అనంతరం వైఎస్ జగన్ పాదయాత్రను పునఃప్రారంభించారు. కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట, పలివెలక్రాస్, గంటిపల్లిపాలెం క్రాస్ మీదుగా గంటి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. జననేతకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment