విప్లవాత్మక మార్పులకు అది రాచబాట | Sakshi
Sakshi News home page

విప్లవాత్మక మార్పులకు అది రాచబాట

Published Wed, Jan 10 2024 5:20 AM

CM YS Jagan Praja Sankalpa Yatra Completes 5 Years - Sakshi

నెహ్రూనగర్‌/కర్నూలు(టౌన్‌)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్‌ జగన్‌ మాత్ర­మేనని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్య­క్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొని­యా­డాయి. రాష్ట్ర చరిత్రలో సువ­ర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పా­దయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు.

ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియా­డారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడ­దల రజిని పార్టీ కా­ర్యకర్తలతో కలసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజ­కీయం అని నమ్మిన నేత జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు.

కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహ­కార కేంద్ర బ్యాంకు చైర్‌పర్సన్‌ విజ­యమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ­న్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద వైఎ­స్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబ­రాలు నిర్వ­హించారు.

తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్‌ కట్‌ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్న­బాబు మాట్లా­డుతూ.. వైఎస్‌ జగన్‌­సీఎంగా ప్రజా­రంజక పాలన అందిస్తు­న్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగో­దావరి జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్‌ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్‌ రాజశేఖర­రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషే­కాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వ­రరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పు­ప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్య­క్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరు­పుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘ­ట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.

కోట్లాది హృదయాలను స్పృశిస్తూ..
2017 నవంబర్‌ 6వ తేదీన వైఎస్‌ జగన్‌ ఇడు­పులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకా­కుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్‌.. రావాలి జగన్‌.. అంటూ నినదించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement