ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి

Published Mon, Nov 6 2023 1:14 AM | Last Updated on Mon, Nov 6 2023 12:33 PM

- - Sakshi

ఏలూరు జిల్లా: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర  6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకలూరులో సంబరాలు
►వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి,కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు

కృష్ణాజిల్లా: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా  పెడన వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ 
►పాల్గొన్న పెడన పట్టణ  వైఎస్సార్‌సీపీ కన్వీనర్  బండారు మల్లి, పార్టీ నాయకులు

పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.
►అనంతరం పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్సీ, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
►హాజరైన పలు కార్పోరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు

నెల్లూరు: జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆఫీస్ లో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాని
►అనంతరం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి
►కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి.
►ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. ‘ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం నెరవేర్చాం.  మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పని చెయ్యాలి.

తిరుపతి: తుడా వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ  శ్రేణులు. 

►సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్  కేతం జయ చంద్రారెడ్డి, కార్పొరేటర్‌లు వెంకటేష్, మునిరామిరెడ్డి,పొన్నాల చంద్ర, నరసింహచారి

పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి 2018 డిసెంబర్‌ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాలమీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేశారు.

ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది జననేతతో కలసి అడుగులు వేశారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను, అనుభవాలను మేనిఫెస్టోగా రూపొందించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో 90శాతం, నాలుగున్నరేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్ర సృష్టించారు.

అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రకు ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలులో పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్‌ కటింగ్‌ చేయనున్నట్లు జిల్లా కమిటీ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement