
కొత్తపల్లి/తూర్పు గోదావరి: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ మండలంలోని కొమరగిరి శివారు వెంకటరాయపురంలో శనివారం సందడి చేశారు. అమీర్‌ఖాన్ నటిస్తున్న లాల్‌సింగ్ చద్దా చిత్ర షూటింగ్ వెంకటరాయపురంలో జరుగుతోంది. రాధికాచౌదరితో కలిసి అమీర్‌ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైక్‌చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ఖాన్‌తో పాటు కరీనాకపూర్, తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. హీరో అమీర్‌ఖాన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment