![Tiktok Wife And Husband Fraud In East Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/14/East-Godavari.jpg.webp?itok=0SY-Jr9P)
తూర్పు గోదావరి: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో టిక్‌టాక్‌తో ఫెమస్ అయిన ఘరానా దంపతుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితులు గోకవరానికి చెందిన గౌరిశంకర్ అనే వ్యక్తి కుమార్తెను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపిస్తామని చెప్పి మామిడాల శ్రీధర్, చెరుకుమిల్లి గాయత్రీలు 44 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఏవో మాయమాటలు చెబుతూ మాటమార్చారు.
దీంతో అనుమానం వచ్చిన బాధితులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో కేటుగాళ్లు ఇద్దరు తమ సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కాగా, బాధితులు ఇద్దరు నిందితులపై గోకవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హజరుపర్చినట్లు తెలిపారు. కోర్టు నిందితులకు 15 రోజులపాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: భర్తకు నిప్పంటించి.. బండతో బాదిన భార్య.. కారణం ఏంటంటే..
Comments
Please login to add a commentAdd a comment