భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం  | Vontimitta Ramalayam Talambralu In East Godavari | Sakshi
Sakshi News home page

భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం 

Published Sat, Nov 13 2021 7:17 AM | Last Updated on Sat, Nov 13 2021 9:44 AM

Vontimitta Ramalayam Talambralu In East Godavari - Sakshi

సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు.

పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement