vontimitta rama temple
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
రేపు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
కడప సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాలోని ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరై స్వామి వారిని దర్శించుకోనున్నారు. అదేరోజు తిరిగి సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్లనున్నారు. పర్యటన వివరాలిలా.. ఈనెల 5వ తేదీన ► మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళతారు. ► 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ► 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు. ► 2.40 నుంచి 3.15 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ► 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు. ► 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ► 3.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి టీటీడీ అతిథి గృహానికి చేరుకుని 4.20 గంటల వరకు అక్కడే ఉంటారు. ► 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ► యంత్రం 5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 6.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
వైభవంగా కోదండరాముడి రథోత్సవం
ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రథోత్సవం నిర్వహించారు. దీనికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికి గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రాములవారు రథాన్ని అధిష్టించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కాయకర్పూర నీరాజనాలు అందించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం కాళీయమర్ధని అలంకారంలో రాములవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామి వారు విహరిస్తారు. -
భద్రాద్రి రాముడి తలంబ్రాలకు సీమంతం
సాక్షి, గోకవరం(తూర్పుగోదావరి): భద్రాచలం, ఒంటిమిట్టలలో జరిగే శ్రీరాముని కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటకు శుక్రవారం సీమంతం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో పండిస్తున్న ఈ కోటి తలంబ్రాల పంటకు కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సీమంతం జరిపారు. పొట్టదశలో ఉన్న పంటకు గాజులు, రవిక, పండ్లు, పుష్పాలు సమర్పించారు. సీతారామ అష్టోత్తర సహస్రనామార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. శ్రీరామతత్వం ప్రచారం, కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. 11వ సారి భద్రాచలంకు, 5వ సారి ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలు పంపుతుండటం సంతోషంగా ఉందన్నారు. -
ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాలు
వైఎస్ఆర్ జిల్లా : ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి. అందులోభాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్లకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేటి మధ్యాహ్నం శ్రీరామ జయంతి, సాయంత్రం భక్త పోతన జయంతిని నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన స్వామి వారికి కళ్యాణం, 21వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఒంటిమిట్ట రామాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈవో పి.భాస్కర్ హాజరయ్యారు.