ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాలు | sri rama navami vedukalu starts at vontimitta rama temple | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్టలో రాములోరి బ్రహ్మోత్సవాలు

Published Fri, Apr 15 2016 11:04 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM

sri rama navami vedukalu starts at vontimitta rama temple

వైఎస్ఆర్ జిల్లా : ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమైనాయి. అందులోభాగంగా నిర్వహించిన ధ్వజారోహణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామి,అమ్మవార్లకు ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

నేటి మధ్యాహ్నం శ్రీరామ జయంతి, సాయంత్రం భక్త పోతన జయంతిని నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన స్వామి వారికి కళ్యాణం, 21వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అలాగే ధ్వజారోహణ కార్యక్రమాన్ని  తిలకించేందుకు పలు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఒంటిమిట్ట రామాలయానికి చేరుకున్నారు.  ఈ కార్యక్రమానికి టీటీడీ జేఈవో పి.భాస్కర్ హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement