కడప సిటీ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాలోని ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఒంటిమిట్టలో జరుగుతున్న కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరై స్వామి వారిని దర్శించుకోనున్నారు. అదేరోజు తిరిగి సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి తాడేపల్లికి వెళ్లనున్నారు.
పర్యటన వివరాలిలా.. ఈనెల 5వ తేదీన
► మధ్యాహ్నం 12.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళతారు.
► 1.15 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
► 2.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.35 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహానికి చేరుకుంటారు.
► 2.40 నుంచి 3.15 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
► 3.25 గంటలకు టీటీడీ అతిథి గృహం నుంచి బయలుదేరి కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.
► 3.30 నుంచి 3.50 గంటల వరకు ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
► 3.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి టీటీడీ అతిథి గృహానికి చేరుకుని 4.20 గంటల వరకు అక్కడే ఉంటారు.
► 4.25 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4.55 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
► యంత్రం 5.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 6.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment