
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి

ఇందులో భాగంగా రెండో రోజు గురువారం స్వామివారు వేణుగానాలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు

ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఊరేగింపు నిర్వహించారు. కోలాట నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది

















