vontimitta temple
-
ఒంటిమిట్టలో వైభవంగా కోదండరామస్వామి కల్యాణం (ఫొటోలు)
-
ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శ్రీరామనవమి వైభవంగా జరిగే ఒంటిమిట్ట రామాలయం స్పెషల్ ఫొటోలు
-
ఘనంగా కోదండరామస్వామి ధ్వజారోహణం
-
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం (ఫొటోలు)
-
వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం..
సాక్షి, వైఎస్ఆర్: ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండు వెన్నెల్లో కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. వరి గింజల కంకులు, ఫల పుష్పాలతో శోభాయమానంగా కల్యాణ వేదికను అలంకరించారు. ఒంటిమిట్టలో కోదండ రామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరవ రోజు బుధవారం ఉదయం శివ ధనుర్భంగా లంకారములో, పురవీధుల్లో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగాడు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఊరేగింపులో.. టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు శ్రీరామ నవమికి కాకుండా.. సీతారామ కల్యాణ మహోత్సవం ఒంటిమిట్టలో చైత్ర పౌర్ణమి రోజు, పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట.అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని కథనం. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు. ఒంటిమిట్ట ప్రత్యేకత ఇదే జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. శ్రీ రామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. -
ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లు పరిశీలన
వైఎస్సార్ జిల్లా: ఒంటిమిట్ట రాములోరి కళ్యాణ వేదిక ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ నెల 5వ తేదీన జరుగనున్న రాములోరి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అక్కడ ఏర్పాట్లను పరిశిలించారు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈవో.. ‘ ఏప్రిల్ 5వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాములోరి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులకు కంపార్ట్మెంట్లలోనే ప్రసాదాలను అందజేస్తాం. కళ్యాణ ప్రాంగణమంతా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
ఒంటిమిట్టలో మార్మోగిన రామనామ స్మరణ
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా రామనామ స్మరణ మార్మోగింది. టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా శ్రీకోదండరామస్వామికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే అందజేసిన ముత్యాల తలంబ్రాలను స్వామి కల్యాణవేదిక వద్ద తలంబ్రాలలో కలిపారు. అనంతరం స్వామి స్నపన తిరుమంజనంలో ఎమ్మెల్యే మేడా దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి దంపతులు.. ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పెన్నా సిమెంట్స్ అధినేత వేణుగోపాల్‌రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, క్యూలైన్ల వంటి ఏర్పాట్లు టీటీడీ చేసింది. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఏకశిలానగరి (ఒంటిమిట్ట)లో శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శుక్రవారం ధ్వజారోహణ చేయనున్నారు. -
ఒంటిమిట్ట రామయ్య హుండీ లెక్కింపు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆగస్టు నెలకు సంబంధించి నెల వారి హుండీ ఆదాయం రూ. 7 లక్షల 83 వేల 142 వచ్చినట్లు సోమవారం ఆలయ టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ రంగమండపంలో టీటీడీ సిబ్బంది ద్వారా హుండీలోని కానుకలను లెక్కించారు. నిత్యపూజ స్వామి ఆలయంలో.. సిద్దవటం : వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్య పూజస్వామి హుండీ ఆదాయం రూ.1,76,803 వచ్చిందని ఆలయం ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూలై 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను దేవదాయ శాఖకు చెందిన కడప సూపర్వైజర్ ఎస్. జనార్దన్ ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లెక్కించామన్నారు. రూ. 1,76,803 నగదు, 191 గ్రాముల బంగారం, 1.700 గ్రాముల వెండి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండారెడ్డి, ఆలయ సిబ్బంది చంద్ర, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రెడ్డెమ్మకొండ ఆదాయం రూ. 7 లక్షలు గుర్రంకొండ : మండలంలోని సంతానదేవత శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి హుండీ ద్వారా రూ.7,00,121 ఆదాయం సమకూరింది. సోమవారం స్థానిక ఆలయంలో మదనపల్లె దేవదాయశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదు రూపంలో రూ. 7,00,121, బంగారు నగలు 20 గ్రాములు, వెండికానుకలు 489 గ్రాములు వచ్చినట్లు లెక్కతేల్చారు. హుండీ ఆదాయాన్ని గుర్రంకొండ గ్రామీణబ్యాంకులో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈఓ మంజుల, ,సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట.. విశేషాల పుట్ట..
ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ, లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. – ఒంటిమిట్ట/కడప కల్చరల్ రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు. జాంబవంతుడి ప్రతిష్ట ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీ రామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ, సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు. విదేశీ మెచ్చుకోలు క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. వెన్నెల్లో కల్యాణం శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ, భరత, శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం. రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట చెరువు జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది. కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. తన పరిధిలోని ప్రాంతమంతా స్వయంగా పర్యటిస్తూ అవసరమనిపించిన చోట దేవాలయాలు, చెరువులు నిర్మింపజేశారు. ఆయన నిర్మించిన చిట్వేలి చెరువు వద్దగల కంపసముద్రం అగ్రహారం, నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం తదితర ప్రాంతాలు నేటికీ ఆయన పేరుతోనే ఉన్నాయి. తన పాలనలో ఆయన అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవలు అందించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి, ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద, చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు. కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు, లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. 1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. ► అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారా లు చెబుతున్నాయి. రామాభ్యుదయం కా వ్యం ఆయన కలం నుంచి జాలువారింది. ► బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. ► వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ► కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ► వర కవి నల్లకాలువ అయ్యప్ప, ఉప్పు గొండూరు వెంకట కవి, మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం క్రీ.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయులు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరు రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరు చెరువు, రామాలయం నిర్మించాలని కంప రాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటడు, మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. ► క్రీ.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం, ఎదుర్కోలు మండపాలు, ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. -
9న ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరగనుంది.10 తేదీన ఉదయం 8నుంచి 9 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం శేషవాహనం, 11న వేణుగాన అలంకారం, హంసవాహనం, 12న వటపత్రశాయి అలంకారం, సింహవాహనం, 13న నవనీత కృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14న మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శివధనుర్భాలంకారం, రాత్రి 8 గంటలకు శ్రీ సీతా రాముల కల్యాణం, గజవాహనం, 16న రథోత్సవం, 17న కాళీయమర్ధన అలంకారం, ఆశ్వవాహనం, 18న చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావ రోహణం, 19న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరగనున్నాయి. కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు : ఎస్పీ కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్సోత్సవాల్లో భాంగా ఈనెల 15న నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి విచ్చేయనుండటంతో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధికసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయపరిసరాలు, కల్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్ డిఎస్పీ రమణయ్య, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ బాలస్వామిరెడ్డి, ఎస్బి సీఐలు వెంకటకుమార్, రెడ్డెప్ప, ఆర్ఐ మహబూబ్‌బాషా, కడప ఒన్‌టౌన్ సీఐ టివి సత్యనారాయణ, అర్బన్ సీఐ ఎస్ఎం ఆలీ తదితరులు పాల్గొన్నారు -
ప్రేమ పెళ్లి.. అడ్డంగా బుక్కైన జంట
సాక్షి, కడప : ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భయపడ్డారు. ఇందుకోసం స్నేహితుల సహకారంతో గుడిలో వివాహం చేసుకునేలా పథకం రచించారు. అనుకున్న ప్రకారం తమ ప్లాన్ అమలు చేశారు. మరికొద్ది సేపట్లో తంతు ముగిసేదే.. ఇంతలో అనుకోని విధంగా వారి పెళ్లి పెటాకులైంది. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ప్రేమ జంట రహస్య వివాహం చేసుకోవడానికి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చారు. అయితే వారు తీరుతో అనుమానం వచ్చిన అధికారులు, వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ మైనర్లుగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని ఒంటిమిట్ల పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రలకు విషయాన్ని తెలిపి, ఒంటిమిట్ట రావాలని సూచించారు. -
‘చంద్రబాబు రాకను ప్రకృతి కూడా సహించలేదు’
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనం జరుగుతోందని, ఆయన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టకు రావడాన్ని ప్రకృతి కూడా సహించలేకపోయిందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. ఓ పక్క హుదూద్.. మరోవైపు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు ఒంటిమిట్టలో అదే జరిగిందంటూ వ్యాఖ్యానించారు. విజయవాడలో జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన పాపాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మనుషులే కాదు ప్రకృతి కూడా ఆయనపై కోపంగా ఉందన్నారు. కన్నులపండువలా ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణం జరుగుతుంటే చంద్రబాబు వచ్చారని ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదని, దాంతో నలుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోదావరి పుష్కరాల్లో వీడియో పేరుతో 30 మంది భక్తులను పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రకృతి విలయతాండవం చేస్తుందని, చంద్రబాబు చేసిన పాపాలే అందుకు కారణమంటూ ఎద్దేవా చేశారు. ఆయనలో ఉన్న భయాన్ని ప్రజలపై రుద్దే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని, నీతివంతంగా ఉన్నంతవరకూ ఎవరో ఏదో చేస్తారని భయాలెందుకు ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా ప్యాకేజీ రాగం అందుకున్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ పోరాటాలతో, ఎన్నికల భయంతో హోదా కోసం పోరాడామంటూ కొత్తరాగం అందుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తన అవసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అడుగులో అడుగు వేసుందుకు రాష్ట్రంలో ఎవరూ సిద్ధంగాలేరని, 'నువ్వు అవినీతి పరుడివి, దొంగవి, మోసకాడివని' ఏపీ సీఎంతో తిరిగిన వాళ్లే చెప్పారని వివరించారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కల్పించలేదని, ఏపీ రైతులకు, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని తెలిపారు. ఇంకా రైతులు రుణాల సమస్యలతో బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, అసమర్ధ సీఎం ఉన్నంతవరకూ ఏ వర్గానికి న్యాయం జరగదంటూ చంద్రబాబుపై జోగి రమేష్ ధ్వజమెత్తారు. -
ఒంటమిట్ట: అధికారులపై సీఎం అసహనం
సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా తీవ్ర అపశ్రుతి చోటుచేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఈ సందర్భంగా అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఒంటిమిట్టలో శుక్రవారం శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం సమయంలో భారీ వర్షం కురువడంతో నలుగురు మృతిచెందారు. మరో 80 మంది దాకా గాయాల పాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరాముడు–సీతమ్మల వివాహం సందర్భంగా వెలుగులతో కళకళలాడాల్సిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరుణదేవుడి ప్రతాపానికి అంధకారంగా మారింది. శుక్రవారం ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. వెనువెంటనే ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన మొదలైంది. గంటకుపైగా కుండపోత వర్షం కురిసింది. ఒకవైపు విపరీతమైన గాలులు, మరోవైపు ఉరుముల శబ్దాలతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన ఫోకస్ లైట్ల స్తంభాలు, డెకరేషన్ లైట్లతో అలంకరించిన బొమ్మలు ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. చలువ పందిళ్లకు వేసిన టెంట్లు, రేకులు కూడా లేచిపోయాయి. వడగండ్లు రేకులపై పడుతుండడంతో భక్తులు భయకంపితులయ్యారు. కోదండ రామస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న వేపచెట్లు నేలకూలగా, అక్కడే ఉన్న చలువ పందిరి కూలిపోయింది. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో అంధకారం నెలకొంది. ప్రాణాలు తీసిన లైట్లు: ఆలయ సమీపంలో కల్యాణోత్సవం వేదిక రేకులు కూలిపోయి నలుగురు మృత్యువాత పడ్డారు. బద్వేలు ఎస్సీ కాలనీకి చెందిన చిన్నయ్య(48) మృతి చెందాడు. ఫోకస్ లైట్లు మీద పడడంతో పోరుమామిళ్లకు చెందిన చెంగయ్య(70) అనే వృద్ధుడు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఒంటిమిట్టకు చెందిన వెంకట సుబ్బమ్మ(65) అనే భక్తురాలు దక్షిణ గోపురం వద్ద కొయ్యలు మీదపడటంతో మృతి చెందారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పట్టణానికి చెందిన మీనా(45) రాములోరి కల్యాణానికి వచ్చి గాయపడి, తుదిశ్వాస విడిచారు. వడగళ్ల వానకు రేకులు గాలికి లేచి పడడం, విరిగిన చెట్లు తగలడం, డెకరేషన్ లైట్లు మీదపడడం వంటి కారణాలతో దాదాపు 80 మంది గాయపడ్డారు. అందులో 25 మందిని కడప రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఐదుగురిని తిరుపతికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6.30 సమయంలో విద్యుత్ నిలిపివేయడంతో అప్పటి నుంచి రాత్రి 9.30 వరకు ఆలయం అంధకారంలోనే ఉండిపోయింది. -
ఒంటిమిట్టలో భారీ వర్షం
-
ఒంటిమిట్టలో గాలివాన బీభత్సం
-
ఒంటిమిట్ట వేడుకల్లో అపశ్రుతి.. నలుగురి మృతి
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన మృత్త్యువాత పడ్డ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ నలుగురు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండరాముడి వేడకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షం కారణంగా ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతుండటంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య మృత్యువాత పడ్డాడు. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో మరణించగా, దక్షిణ గోపురం వద్ద బారికేడ్స కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతి మరణించింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనా అనే మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి బోయినపల్లికి చెందిన భాస్కర్, నందలూరుకు చెందిన ధనుంజయ్ నాయుడులకు స్వల్పగాయాలయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పక్కనే ఉన్న హరిత హోటల్‌కు వద్దకు చేరుకుంటున్నారు. బలమైన గాలుల వీస్తుండంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరుయ్యాయి. కల్యాణం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగండ్లు, ఈదురు గాలులు కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఒంటిమిట్ట, ఆలయంలో అంధకారం అలముకుంది. రేకులు మీద పడటంతో గాయపడిన భక్తుడు పోలీసుల ఓవర్ యాక్షన్ : ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప పోలీసులు స్వామి భక్తి చాటుకొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం నుంచే కడపలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రయల్ రన్ అంటూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరచారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంతంలో దుకాణాలు అన్నింటినీ బలవంతంగా మూసేయించారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కర్నూలు రేంజ్ డీఐజీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సంతాపం తెలిపిన వైఎస్ జగన్ ఒంటిమిట్ట శ్రీరామ నవమి వేడుకలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. -
ఒంటిమిట్టకు పూర్వవైభవం తీసుకొస్తాం: చంద్రబాబు
కడప : వచ్చే ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేసి... ఒంటిమిట్టకు పూర్వవైభవం తీసుకోస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం కడపలో మాట్లాడుతూ... పెద్దదర్గా, గండికోటలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామన్నారు. తాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి ప్రతి ప్రాంతానికి నీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి అయితే జిల్లాలో నీటి కొరత ఉండదన్నారు. కడపను ఉద్యాన హబ్‌గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. -
రెండో భద్రాద్రి - భద్రత ఏదీ?
-
ఒంటిమిట్టలో శ్రీరామ నవమి వేడుకలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ నవమి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నకాలంలో నవమి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఖమ్మం జిల్లా భద్రాచలంలో సీతారాముల స్వామి దేవస్థానంలో నిర్వహించేది. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేవారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. దీంతో వచ్చే మార్చి 28న నిర్వహించనున్న నవమి వేడుకలకు ఒంటిమిట్టలోని రామాలయాన్ని అధికారులు ఎంపిక చేశారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. అయితే దీనికి సంబంధించి జీవో విడుదల కావాల్సి ఉంది. -
'ఒంటిమిట్ట ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలి'
కడప: వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బుధవారం రాజకీయ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా సమావేశం జరగడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.