![Minor Lovers Caught In Vontimitta Ramalayam - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/13/Minors.jpg.webp?itok=uC6Vimo8)
సాక్షి, కడప : ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భయపడ్డారు. ఇందుకోసం స్నేహితుల సహకారంతో గుడిలో వివాహం చేసుకునేలా పథకం రచించారు. అనుకున్న ప్రకారం తమ ప్లాన్ అమలు చేశారు. మరికొద్ది సేపట్లో తంతు ముగిసేదే.. ఇంతలో అనుకోని విధంగా వారి పెళ్లి పెటాకులైంది. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ప్రేమ జంట రహస్య వివాహం చేసుకోవడానికి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చారు.
అయితే వారు తీరుతో అనుమానం వచ్చిన అధికారులు, వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ మైనర్లుగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని ఒంటిమిట్ల పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రలకు విషయాన్ని తెలిపి, ఒంటిమిట్ట రావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment