సాక్షి, మిడ్జిల్(జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేములలో ఆదివారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య, శారదమ్మల రెండో కుమారుడు శ్రీకాంత్(20) ఇంటర్ వరకు చదివాడు. అదే గ్రామానికి చెందిన శ్రీను, ఈశ్వరమ్మ కూతురు అఖిల (15) మిడ్జిల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం ఇరు కుటుంబసభ్యులకు తెలియడంతో.. ఈ వయస్సులో పెళ్లి సరికాదని మందలించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లి.. గ్రామానికి దూరంగా ఓ మామిడి తోట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకున్నారు. రాత్రి తోట దగ్గర కాపలా ఉండే వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. తమ పిల్లలు విగత జీవులుగా చూసి వారి తల్లిదండ్రులు విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment