minors
-
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్‌పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని గన్‌ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిదంటే... అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. -
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో మైనర్ పేరిట సంరక్షకులు చేసే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో సెబీ మార్పులు చేసింది. దీని కింద మైనర్ పేరిట చేసే పెట్టుబడులకు.. వారి ఖాతా లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఖాతాల నుంచి ఏ రూపంలో అయినా చెల్లింపులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతించాలి. తల్లిదండ్రి లేదా సంరక్షకులతో జాయింట్ అకౌంట్ నుంచి చెల్లింపులు చేసినా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ జూన్ 15 నుంచి ఇందుకు అవకాశం కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లను, సవరణలను చేసుకోవాలని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీలు) సెబీ ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ మొత్తాన్ని మైనర్ ఖాతా లేదా తల్లిదండ్రి, సంరక్షకులతో జాయింట్ ఖాతాకు మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్‌కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్‌కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
షాకింగ్ వీడియో.. బైక్‌ను వెంబడించి మరీ.. యువకుడిని కత్తితో పొడిచి..
భోపాల్: ఆరుగురు మైనర్లు ఓ బైక్‌ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డిసెంబర్ 31న చోటుచేసుకుంది. భన్వర్ కౌన్ ప్రాంతంలో ఆయుష్(22) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంత మంది అబ్బాయిలు నిలబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో హారన్ కొట్టిన ఆయుష్..దారి క్లియర్ చేసి వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఈ క్రమంలో మైనర్లకు, యువకుడికి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం కొంతమంది మైనర్లు బైక్ వెనక పరుగెత్తి బైక్‌పై వెనకాల కూర్చున్న ఆయుష్‌పై కత్తితో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు. అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. मध्यप्रदेश इंदौर में रात पौने तीन बजे युवक की हत्या, हार्न बजाने की बात पर हुआ था विवाद#Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/SWpWlC6jB2 — manishkharya (@manishkharya1) January 1, 2023 -
Telangana: ఆధార్ ఉంటేనే ‘నిఖా’
సాక్షి, హైదరాబాద్: మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మైనార్టీ తీరనివారికి పెళ్లి జరిపిన ఖాజీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ‘షాదీ’ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. యుక్త వయసు రాకముందే పెళ్లిళ్లు జరుగుతుండడం.. కొందరు షేక్‌లు గుట్టుగా నగరానికి వచ్చి పేద పిల్లలను వివాహం పేరిట మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ షాదీల వెనుక కీలక పాత్ర వహిస్తున్న ఖాజీలను నియంత్రించేందుకు.. పెళ్లి చేసుకునే వరుడు, వధువు ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా ఖాజీలు ఏదో ఒక దస్తావేజు తీసుకొని పెళ్లి చేయడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఆధార్ నమోదైన వివరాలకు అనుగుణంగా మైనరా? మేజర్? అనే విషయాన్ని నిర్దేశించుకోవాలని.. పెళ్లిళ్ల వివరాలను వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని సూచించింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లి చేసే ఖాజీలపై చట్టరీత్యా చర్యలు తప్పవని హుకుం జారీ చేసింది. మరోవైపు గతంలో మాదిరిగా ఖాజీల నియామకం నేరుగా మైనార్టీ సంక్షేమ శాఖ చేయదు. జిల్లా కలెక్టర్లు ఖాజీలకు సంబంధించి వివరాలన్ని పరిశీలించిన అనంతరం వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఖాజీల నియామకం చేయాలని ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లూ ఆన్లైన్లోనే.. షాదీకి సంబంధిచిన సరి్టఫికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పెళ్లి సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం అన్ని వ్యవహారాలు రాతపూర్వకంగానే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఎక్కుడ జరిగినా మ్యారేజ్ సర్టిఫికెట్లకు హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నాజిరుల్ ఖజాత్ కార్యాలయానికి రావాల్సి వస్తుంది. ఆన్లైన్ సర్టిఫికెట్‌కు పెళ్లి సందర్భంగా ఇచ్చే పెళ్లి పుస్తకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దరఖాస్తు ఆన్లైన్లో అందిన తర్వాత అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్‌ను ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైతే దేశంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ డోన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ముస్లింల షాదీ వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. గతంలో జరిగిన వాటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి షాదీనీ వక్ఫ్ బోర్డు కార్యాలయలయంలో నమోదు చేస్తున్నారు. దీంతో మోసాలను కట్టడి చేసేందుకు వీలు ఉంటుంది. – ఎండీ మసీవుల్లా ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
సాక్షి, హైదరాబాద్: క్షణ కాలం ఆవేశం వారి ప్రాణాలను బలిగింది. సికింద్రాబాద్‌లో మైనర్ ఫేస్బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల ప్రకారం.. శ్రీకాంత్‌కు ఫేస్బుక్లో ఓ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా, యువతిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తన ప్రేయసి ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్‌కు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్.. అమ్ముగూడ రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణాలతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు.. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు దుర్మరణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృత్యువాత పడ్డారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లికి చెందిన ఆవుల వెంకయ్య, శివలక్ష్మిల కుమారుడు ఆవుల తిరుమలరావు(17), గండికోటయ్య, ప్రభావతిల కుమారుడు గండి మహేష్‌బాబు(17), వావిలాల నగర్‌కు చెందిన శ్రీధర్, సత్యవాణిల కుమారుడు సత్యంశ్రీధర్(17) మిత్రులు. బెల్లంకొండ మండలం కందిపాడుకు వెళ్లేందుకు కంకణాలపల్లి నుంచి బైక్‌పై బయల్దేరారు. ధూళిపాళ్ల వద్ద ఆర్టీసీ బస్సును దాటేందుకు ప్రయత్నించగా.. ఎదురుగా మరో ఆర్టీసీ బస్సు రావడంతో బైక్ వేగాన్ని తగ్గించారు. కాగా, వీరిముందు ఉన్న బస్సుకు బైక్ హ్యాండిల్ తగలడంతో రోడ్డుకు కుడివైపున పడిపోయారు. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి మీదుగా వెళ్లడంతో తిరుమలరావు, సత్యంశ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన గండి మహేష్‌బాబును గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. ఆవుల తిరుమలరావు పదో తరగతి పూర్తి చేసి సిమెంటు పనులకు వెళుతుండగా, సత్యంశ్రీధర్ ఇంటర్, గండి మహేష్‌బాబు పదో తరగతి చదువుతున్నారు. మహేష్‌బాబు సోదరి మమతశ్రీకి త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కందిపాడులో నగదు ఇచ్చేందుకు మహేష్‌బాబుతో పాటు స్నేహితులు బైక్‌పై వెళుతుండగా దారుణం జరిగింది. ముగ్గురి మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ పార్టీకి మైనర్లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అభిషేక్, అనిల్‌ను అరెస్ట్ చేయగా.. అర్జున్, కిరణ్‌రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1 అనిల్, ఏ2 అభిషేక్, ఏ3గా ఎన్టీఆర్ కూతురి అల్లుడు అర్జున్ వీరమాచినేని, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్‌రాజ్‌ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. 2017-20 వరకు తన భార్యతో కలిసి కిరణ్‌రాజ్ పబ్ నడిపాడు. 2020 ఆగష్టులో అభిషేక్, అనిల్‌కు లీజు ఇచ్చిన కిరణ్‌రాజ్.. పార్ట్నర్గా కొనసాగుతున్నట్లు సమాచారం. చదవండి: పబ్‌లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా.. హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉందని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగించే స్పాట్స్‌పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్‌లు, రెస్టారెంట్, రిసార్ట్స్‌పై పూర్తి నిఘా ఉంచామన్నారు. గోవా నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డగ్ర్స్ రవాణా అవుతుందన్నారు. డార్క్ నెట్ ఢీకోడ్ చేసే టెక్నాలజీ తమ వద్ద ఉందన్నారు. డక్స్ ఫెడ్లర్స్, కంజూమర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్స్‌లను రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు లిక్కర్ సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. జనవరి 7న లిక్కర్ లైసెన్స్‌కి అనుమతి తీసుకోగా, రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకుంది. పబ్‌లో డ్రగ్స్ బయటపడటంతో లైసెన్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. చదవండి: పబ్‌లతో తారల బంధం! వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్‌బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్‌కు చార్జ్‌మెమో జారీ చేశారు. -
రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు
Ukrainian Member of Parliament Lesia Vasylenk: ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా దాడులు కొనసాగిస్తున్న రష్యా ఇప్పుడు మరింత దారుణమైన అకృత్యాలకు పాల్పడుతోంది. రష్యా బలగాలను వెనక్కి మళ్లించి సైనిక దాడిని తగ్గించింది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సమీపంలో బుచా నగరంలో రష్యా బలగాలు పౌరులపై అత్యంత దారుణంగా కాల్పులు జరపడమే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెనియన్ ఎంపీ, పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్ ట్విట్టర్లో రష్యా ఆగడాల పై విరుచుకుపడ్డారు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లోని ప్రజలను దోచుకోవడమే కాకుండా అత్యాచారాలు చేసి చంపుతున్నారని ఆక్రోశించారు. రష్యాని అనైతిక నేరాల దేశంగా అభివర్ణించారామె. మైనర్లని కూడా చూడకుండా అత్యాచారాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పార్ట్‌లను నాశనం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా రేప్ చేసి శరీరాలపై స్వస్తిక్ ఆకారంలోని ముద్రలు వేస్తున్నారని చెప్పారు. అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది అని ట్వీట్ ఆమె చేశారు. యుద్ధానికి సంబంధించిన ముఖ్యాంశాలు: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి నిరవధిక దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూనే ఉంది. యుద్ధంలో వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోగా, 4 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని కైవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి ఉక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టి సారిస్తామని రష్యా గత వారం ప్రకటించింది. రష్యా బలగాల తిరోగమనం నేపథ్యంలో వారు విధ్వంసాన్ని విడిచిపెట్టి నరమేథానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్‌లో బుచా నగరం చుట్టూ అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించగా, రష్యా ఆరోపణలను ఖండించింది. Russian soldiers loot, rape and kill. 10 y.o. girls with vaginal and rectal tears. Women with swastika shaped burns. Russia. Russian Men did this. And Russian mothers raised them. A nation of immoral criminals — Lesia Vasylenko (@lesiavasylenko) April 3, 2022 (చదవండి: భయానకం: ఉక్రెయిన్ బుచాలో శవాల గుట్టలు.. అత్యాచార బాధితుల శవాలు!) -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం
Google Blocks 18 Below Target Ads: ఫ్లస్ విషయంలో బ్రౌజింగ్‌కు గూగుల్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్ టార్గెటింగ్ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈ మేరకు పద్దెనిమిది ఏళ్లలోపు యూజర్లపై టెక్ దిగ్గజం నిఘా వేయనుంది. సాధారణంగా వయసు, లింగ నిర్ధారణ, యూజర్ల ఆసక్తుల ఆధారంగా యాడ్ కంపెనీలు యాడ్లను డిస్ప్లే చేస్తుంటాయి. ఈ క్రమంలో మోసాలు జరుగుతుంటాయి కూడా. అయితే 18 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ల విషయంలో ఈ స్కామ్‌లు జరుగుతుండడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ తరహా యాడ్లను నిలువరించేందుకు బ్లాక్ యాడ్ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది గూగుల్. ఈ మేరకు యూజర్ యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాదిలో పలు చర్యలు చేపట్టబోతున్నాం అంటూ గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పిల్లలకు, టీనేజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభూతి కోసం, ఏజ్ సెన్సిటివిటీ యాడ్ కేటగిరీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాం. ఇక మీద 18 ఫ్లస్ లోపు వాళ్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తాం అని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎబౌట్ దిస్ యాడ్ లాంటి మెనూలతో పాటు ఆ యాడ్లు ఎందుకు డిస్ప్లే అవుతున్నాయో, ఎవరు దానిని ప్రదర్శిస్తున్నారో తెలియజేస్తూ ఫీచర్స్‌ను ఇప్పటికే తీసుకొచ్చింది గూగుల్. చదవండి: ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్! -
స్కూల్లో అందరు చూస్తుండగా.. విద్యార్థి దారుణ హత్య
రాయ్‌పూర్: ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ తరహాలో చదువులు, ఆటలు మధ్య గడపాల్సిన ఇద్దరు మైనర్ల బాల్యం తాము చేసిన హత్య కారణంగా కటకటాల్లోకి నెట్టేసింది. ఈ ఘటన ఛతీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాయ్‌గఢ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంతలో 17 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు అక్కడికి వచ్చి ఆ విద్యార్థితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త ముదిరి వారిద్దరు అతన్ని తీవ్రంగా కొట్టి పొడిచారు. అనంతరం వాళ్లు స్కూలు సిబ్బందిని కత్తితో బెదిరించి ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మీనా నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అదే రోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని, కానీ ప్రేమ వ్యవహారం దీనికి కారణమని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
పోకిరీ మైనర్.. అమ్మాయిల్ని వేధిస్తున్న వారిలో 11.11% వీరే
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. ► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్‌ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి. ►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు. ►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్‌కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్ఐ యాప్, ఫేస్బుక్, 100 ద్వారా ఆశ్రయించారు. ►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ వాడండి మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి. – షీ టీమ్స్‌తో నగర కొత్వాల్ -
మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ క్లాసులను ఆసరాగా చేసుకుని... సోషల్‌మీడియా ద్వారా మైనర్లకు ఎర వేస్తూ.. అందినకాడికి దండుకోవడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ హయత్‌నగర్ పోలీసులకు చిక్కిన బచ్చనబోయిన సాయికుమార్ అలి యాస్ సాయి వర్ధన్ యాదవ్ కేసులో మరికొందరూ నిందితులుగా ఉండి ఉంటారని పోలీసులు అను మానిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. బాధితులు అంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సాయిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ► సాయి ప్రధానంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, షేర్‌చాట్ వంటి యాప్స్‌ను వినియోగించాడు. ఆకర్షణీయమైన ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఇటీవల దాదాపు అన్ని పాఠశాలలు ఆన్లైన్ విధానంలో విద్యను బోధిస్తుండటంతో ఇతడికి కలిసి వచ్చింది. ► ప్రధానంగా మైనర్లను టార్గెట్‌గా చేసుకున్న సాయి తొలుత వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆపై హాయ్ అంటూ పలకరింపు సందేశాలు పంపించేవాడు. వీటిని స్పందించిన వారితో పరిచయం పెంచుకుంటూ సెంటిమెంట్‌తో కూడిన తియ్యటి మాటలు చెప్తూ ముందుకు వెళ్లి ఆపై అసలు కథ మొదలెట్టేవాడు. ► ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు చదవుతున్న వారితోనూ ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తీసుకువచ్చేవాడు. వారిని పూర్తిగా తన ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి ‘నీవు కాదంటే చచ్చిపోతా’, ‘నీవు లేకపోతే బతకలేను’ అంటూ చాటింగ్స్ చేసేవాడు. కొందరు బాలికలకు సాయి అసభ్యకర సందేశాలు పంపి వేధించినట్లు అనుమానాలున్నాయి. ► ఇతడి చేష్టలకు భయపడకుండా ఎవరైనా ఎదిరు తిరిగితే ఇక వారి జోలికి వెళ్లేవాడు కాదు. అలా కాకుండా తన వల్లోపడిన వారిని ఏకాంతంగా గడిపే వరకు తీసుకువెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు, సెక్స్ చాటింగ్స్‌తో బెదిరింపులకు దిగేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి దండుకునే వాడు. ► ఇతడి వల్లోపడిన వారిలో అనేక మంది బాలికలు తమ ఇళ్లల్లోనే చోరీలు సైతం చేశారని పోలీసులు చెప్తున్నారు. కొందరు నగదు, మరికొందరు బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి సాయికి అప్పగించారు. ఇతడి వ్యవహారం గుట్టురట్టయింది కూడా ఓ బాలిక చేసిన ఇలాంటి చోరీ తోనే కావడం గమనార్హం. ► ఈ వ్యవహారంలో సాయితో మరికొందరు జట్టు కట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ► సాయి ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా బాధితులను, అతడికి సహకరించిన వారికి పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముఠాలో కనీసం ఐదారుగురు ఉండి ఉంటారని, వారంతా సాయి స్నేహితులు లేదా క్లాస్మేట్స్ అని భావిస్తున్నారు. ► ఆన్లైన్ యాక్టివిటీస్ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులూ తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని పోలీసులు కోరుతున్నారు. -
ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతోంది
-
ఈ వయసులో పెళ్లి సరి కాదన్నందుకు..
సాక్షి, మిడ్జిల్(జడ్చర్ల): మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేములలో ఆదివారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య, శారదమ్మల రెండో కుమారుడు శ్రీకాంత్(20) ఇంటర్ వరకు చదివాడు. అదే గ్రామానికి చెందిన శ్రీను, ఈశ్వరమ్మ కూతురు అఖిల (15) మిడ్జిల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం ఇరు కుటుంబసభ్యులకు తెలియడంతో.. ఈ వయస్సులో పెళ్లి సరికాదని మందలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లి.. గ్రామానికి దూరంగా ఓ మామిడి తోట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకున్నారు. రాత్రి తోట దగ్గర కాపలా ఉండే వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. తమ పిల్లలు విగత జీవులుగా చూసి వారి తల్లిదండ్రులు విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: 9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు...!
చెన్నై: సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 14 సంవత్సరాల బాలుడు అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించడంతో కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక మూడవ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదవండి: జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై అభం శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేసిన బాలుడు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెతోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపంతో బాలిక తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు గ్రామంలోకి వచ్చిన బాలుడు తోటలో బాలిక అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు బాలికను ఎమ్‌జీఎమ్‌జీహెచ్ ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. చదవండి: అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
అక్కా చెల్లెలిపై ఐదుగురి లైంగికదాడి..
దూద్‌బౌలి: అభం..శుభం తెలియని మైనర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వారిని మోసం చేసి లైంగిక దాడికిపాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే.ఈ సంఘటన కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన మేరకు.. హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే ఓ కుటుంబం తమ ఇద్దరు కూతుళ్లను బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. కొంతకాలం క్రితం బంధువుల ఇంటికి వచ్చిన అక్కాచెల్లెలు స్థానికంగా ఉంటూ సాయంత్రం సమయంలో ట్యూషన్ కోసం వెళ్లేవారు. ఇంటి నుంచి ట్యూషన్‌కు వెళుతున్న సమయంలో అదే ట్యూషన్లో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అమ్మాయిలతో మాటలు కలిపేందుకు ప్రయత్నించారు. స్నేహంగా మాట్లాడుతున్నారని భావించిన అక్కాచెల్లెళ్లు వారితో మాటలు కలిపారు. ఇదే అదునుగా భావించిన మరో విద్యార్థి ప్రేమ వల విసిరాడు. ఒకే ట్యూషన్లో తరగతులు కావడంతో ముగ్గురు విద్యార్థులతో కలిసి వచ్చి వెళ్లేవారు. విద్యార్థులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ముగ్గురు మైనర్ విద్యార్థులు బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డాఉ. ఈ విషయం ఎక్కడైన చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పరిణామాలు అలుసుగా తీసుకున్న నిందితులు తమ స్నేహితులైన తాళం చేతుల రిపేర్ చేసే షఫిక్ (19), ఇంటర్మీడిట్ విద్యభ్యాసం కొనసాగిస్తున్న సైఫ్ అలీ (18)తో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కాచెల్లెలు ట్యూషన్ నుంచి ఆలస్యంగా వస్తున్న విషయాన్ని గమనించి ఆరా తీయగా వారిపై జరుగుతున్న వేధింపులను వివరించారు. దీంతో బాధితుల బంధువులు కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపారు. -
2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: 2018.. రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగిన ఏడాది ఇది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ)–2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం... 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు. ఎన్సీఆర్బీ–2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు - ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది. - వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్–1956 కింద 14 కేసులు నమోదు చేశారు. - 19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. - జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు. - ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగాఉన్నారు. - 2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. - చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి ‘‘బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు’’ – ఎన్.రామ్మోహన్, ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్