చిన్నపిల్లలకు మద్యం అమ్మితే చర్యలు | dont sale liquer to minors says excise departement | Sakshi
Sakshi News home page

చిన్నపిల్లలకు మద్యం అమ్మితే చర్యలు

Published Sat, Aug 6 2016 9:27 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

చిన్నపిల్లలకు మద్యం అమ్మితే చర్యలు - Sakshi

చిన్నపిల్లలకు మద్యం అమ్మితే చర్యలు

 కుల్కచర్ల: ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లలకు మద్యం అమ్మరాదని ఎక్సైజ్ శాఖ జిల్లా విజిలెన్‌‌స అధికారి సాంబయ్య అన్నారు. మండల కేంద్రంలోని రెండు వైన్‌‌సలను  శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌తో పాటు రోజువారీ రిజిస్టర్లను పరిశీలించారు. 21 సంవత్సరాలలోపు వారికి మద్యం విక్రయిస్తే లెసైన్‌‌స రద్దు చేస్తామని హెచ్చరించారు.

మద్యం సీసాపై ఉన్న ధరకంటే ఎక్కువకు విక్రరుుంచినా, నకిలీ లిక్కరు అమ్మినా చర్యలు తప్పవన్నారు. అనంతరం మండల పరిధిలోని కిష్టంపల్లి, మరికల్, కొత్తపల్లి గ్రామాల్లో నాటు సారాపై తనిఖీలు చేశారు. కిష్టంపల్లిలో నల్లబెల్లం ఊటలను ధ్వంసం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు జైలుశిక్ష, జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement