AP: మందుబాబులకు ప్రభుత్వం షాక్‌ ! | Additional Cess On Liquor In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: మందుబాబులకు ప్రభుత్వం ‘సెస్‌’ షాక్‌

Published Tue, Oct 15 2024 3:57 PM | Last Updated on Tue, Oct 15 2024 4:46 PM

Additional Cess On Liquor In Andhra Pradesh

సాక్షి,విజయవాడ: మందుబాబులకు ఏపీ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యం అమ్మకాలపై పన్నులు కాకుండా అదనంగా 2 శాతం సెస్‌ విధిస్తూ ఎక్సైజ్‌ శాఖ మంగళవారం(అక్టోబర్‌ 15) ఉత్తర్వులిచ్చింది.

ఇప్పటికే కొత్త మద్యం పాలసీలో భాగంగా అన్ని రకాల మద్యంపై రౌండప్ చార్జీల పేరుతో బాదిన ప్రభుత్వం.. తాజాగా ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ సెస్ పేరుతో 2 శాతం అదనపు బాదుడుకు నిర్ణయించింది. ఈ బాదుడును తక్షణమే అమలులోకి తీసుకువస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది. 

కాగా, కొత్త మద్యం పాలసీలో భాగంగా వైన్‌షాపులను ప్రైవేటు రిటైలర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వారి నుంచి షాపులకు దరఖాస్తులను ఆహ్వానించి లాటరీ పద్ధతిన షాపులు కేటాయించింది.

ఈ విధానం ద్వారా రానున్న ఐదేళ్లలో ఓ పక్క మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ప్రజల నుంచి అటు ప్రభుత్వం ఇటు పచ్చ తమ్ముళ్లు అందినకాడికి దోచుకోనున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇదీ చదవండి: తాడేపల్లిలో మద్యం షాపును అడ్డుకున్న మహిళలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement