
విజయవాడ: ఎన్నికలకు ముందు మద్యం ధరలు(Liquor Prices) తగ్గిస్తానంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ప్రభుత్వం ఏర్పాడ్డాక షాక్‌లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా భారీగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్వార్టర్ కు రూ. 20 వరకు ధర పెంచాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లుపైనా మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. కాస్ట్ లీ బ్రాండ్లపైనా ధరలు పెంచాలని నిర్ణయించింది.
మద్యం షాపులకి మార్జిన్ పెంచి మందు బాబులకు నెత్తిన పెంపు పిడుగు పడేసింది. దీనిపై మందుబాబులను చంద్రబాబు ప్రభుత్వం మోసంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మద్యం ధరల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.