liquor prices
-
‘మార్జిన్’లో చీర్స్! బాబు చీర్స్!
సాక్షి, అమరావతి: మద్యం దందా దోపిడీ ఇచ్చే కిక్కు ‘ముఖ్య’నేతకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు..! అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు..! 40 ఇయర్స్ ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు! ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ(TDP) సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులెవరూ టెండర్లు వేయకుండా బెదిరించి సీఐల నుంచి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చ ముఠాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ‘ముఖ్య’నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్‌తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా రూ.వందల కోట్లు కమీషన్ వసూలు చేసుకునేందుకు ‘ఛీర్స్’ చెప్పారు! ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే చానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14 శాతానికి పెంచేందుకు ‘పచ్చ’జెండా ఊపారు! ఈమేరకు ‘ఏఆర్టీ’ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు(liquor prices) భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడనుంది. ఒక్క డీల్‌తో ఈ కుతంత్రం కథను నడిపించిన తీరు ఇదిగో ఇలా ఉంది...ముందస్తు పన్నాగం..అటు నుంచి నరుక్కురావడం అంటే ఏమిటో ‘ముఖ్య’నేత మరోసారి చేతల్లో చూపించారు. మద్యం దోపిడీ కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిన తీరే అందుకు తాజా నిదర్శనం. కూటమి సర్కారు గతేడాది అక్టోబరు నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చింది. ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో అడ్డుకుని టీడీపీ సిండికేట్‌కు మద్యం దుకాణాలను ఏకపక్షంగా కట్టబెట్టింది. 2024 అక్టోబరు నుంచి రెండేళ్లపాటు లైసెన్సులు కేటాయించేందుకు భారీ ముడుపులు కొల్లగొట్టారు. మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాకు రూ.5 చొప్పున కమీషన్ కింద లెక్కించి ముందుగానే రెండేళ్ల మద్యం అమ్మకాలపై ఏకమొత్తంగా భారీ కమీషన్ల మూటలు కరకట్ట బంగ్లాకు చేరేలా కథ నడిపారు. అనంతరమే మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశారు. ‘ముఖ్య’నేత అంతటితో ఆగలేదు. మద్యం దందాలో మరింత పిండుకోవాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో.. మద్యం విక్రయాలపై తమకు మార్జిన్ పెంచాలని సిండికేట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమకు మద్యం అమ్మకాలపై వాస్తవంగా వస్తున్న 10 శాతం లాభం మార్జిన్ సరిపోవడం లేదనే వాదనను అందుకుంది. తమకు వాస్తవంగా 14 శాతం మార్జిన్ వచ్చేలా చూడాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.మూటలు ఇస్తేనే మార్జిన్ పెంచుతాం...– మెలిక పెట్టిన ‘ముఖ్య’ నేత మార్జిన్ పెంచాలని మద్యం సిండికేట్ నుంచి డిమాండ్ మొదలైన తరువాత ‘ముఖ్య’నేత అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టారు. మరి మార్జిన్ పెంచితే ‘నాకేంటి..?’ అని ఆయన సూటిగానే అడిగేసినట్లు సమాచారం. దీంతో ‘ముఖ్య’నేత ఆంతర్యం ఏమిటన్నది మద్యం సిండికేట్‌కు అర్థమైంది. ఈ అంశంపై తర్జన భర్జనల తరువాత ‘ముఖ్య’నేతతో డీల్ కుదుర్చుకున్నారు. తమ మార్జిన్‌ను వాస్తవంగా 14 శాతానికి పెంచితే అందుకు తగిన కమీషన్ ఇస్తామంటూ మంతనాలు సాగించారు. ‘ముఖ్య’నేత కోరుకున్నదీ... సిండికేట్ ఇస్తానన్నది ఒకటే కావడంతో డీల్ కుదిరింది. దాంతో మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను వాస్తవంగా 14 శాతం వచ్చేలా చేసేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం కూడా పొందారు.‘ముఖ్య’నేతకు ఏటా మూట..!మద్యం అమ్మకాలపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే మద్యం దుకాణదారులకు మార్జిన్ 14 శాతం వచ్చేటట్లు చేస్తే ప్రభుత్వ ఆదాయం దాదాపు రూ.3 వేల కోట్ల మేర తగ్గుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ మేరకు మద్యం దుకాణదారులకు ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి అందులో మూడో వంతు తనకు కమీషన్‌గా ఇవ్వాల్సిందేనని ‘ముఖ్య’నేత పట్టుబట్టారు. అందుకు మద్యం సిండికేట్ సమ్మతించింది. అంటే మద్యం సిండికేట్ ‘ముఖ్య’నేతకు ఏటా రూ.వెయ్యి కోట్ల మూట ముట్టజెప్పనుందన్నది స్పష్టమవుతోంది. ఈ డీల్ ద్వారా ‘ముఖ్య’నేత సొంత ఖజానాకు ఏటా రూ.వెయ్యి కోట్లు చేరనుండగా టీడీపీ మద్యం సిండికేట్ రూ.2 వేల కోట్ల వరకు అదనపు లాభం కొల్లగొట్టనుందన్నది తేటతెల్లమవుతోంది. డీల్ కుదరడంతో ఈ పన్నాగానికి ముగింపుగా మద్యం ధరలపై అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్టీ)సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తద్వారా మద్యం దుకాణదారులకు 14 శాతం మార్జిన్ వచ్చేలా చేశారు.ధరలు భారీగా పెంపు...రాష్ట్రంలో రూ.99కి అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్‌పై మినహా మిగిలిన అన్ని మద్యం బ్రాండ్లపై ధరలను మూడు కేటగిరీల కింద పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 – 20 శాతం వరకు పెరగనున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం ధరల పెంపు ప్రభావం భారీగా ఉండనుంది. అంతిమంగా మందుబాబులపై భారీగా భారం పడనుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 4.25 కోట్ల లిక్కర్ కేసులు, 3.25 కోట్ల బీరు కేసుల విక్రయాలు జరగనున్నట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం క్వార్టర్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు పెంపు అంటే మద్యం ప్రియులపై భారీ ఆర్థిక భారం పడనుందన్నది సుస్పష్టం. ‘ముఖ్య’ నేత కమీషన్ల కోసం ఇంత కథ నడిపించడం పట్ల ఎక్సైజ్ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దోపిడీ కోసం అటు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి... ఇటు మద్యం సిండికేట్ నుంచి భారీ కమీషన్లు వసూలు చేస్తూ... మరోవైపు మద్యం ధరలు పెంచి మందు బాబుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యారు. -
మందు బాబులకు చంద్రబాబు షాక్
విజయవాడ: ఎన్నికలకు ముందు మద్యం ధరలు(Liquor Prices) తగ్గిస్తానంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).. ప్రభుత్వం ఏర్పాడ్డాక షాక్‌లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా భారీగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. క్వార్టర్ కు రూ. 20 వరకు ధర పెంచాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లుపైనా మద్యం ధరలు పెంచడానికి సిద్ధమైంది. కాస్ట్ లీ బ్రాండ్లపైనా ధరలు పెంచాలని నిర్ణయించింది.మద్యం షాపులకి మార్జిన్ పెంచి మందు బాబులకు నెత్తిన పెంపు పిడుగు పడేసింది. దీనిపై మందుబాబులను చంద్రబాబు ప్రభుత్వం మోసంచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మద్యం ధరల రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఇలా మోసం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
మందుబాబులకు షాక్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
-
మందుబాబులకు షాక్.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. మద్యం ధరలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం. ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు.తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. పంచాయితీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచేందుకు ప్లాన్ సిద్ధమైంది. ఇప్పటికే మద్యం ధరల పెంపుపై తత్రిసభ్య కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ క్రమంలో త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక, వచ్చే కేబినెట్ సమావేశంలో మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
బాబూ.. ఇదే మందు నాడు విషమైతే నేడు అమృతమా?: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్సే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల సమయంలో మందుబాబులను రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయి. మా ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అధిక ధరలన్నాడు.. నాణ్యత లేదన్నాడు. ఆడ పిల్లల మంగళ సూత్రాలు తెంపుతాడు.. మీ ఆరోగ్యం గోవింద అన్నాడు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయాడు. 99 రూపాయలకే మద్యం అన్నాడు.. కానీ ఆ చీఫ్ లిక్కర్ మాత్రం దొరకడం లేదు. మీరిచ్చిన మాట ప్రకారం ధరలు ఎక్కడ తగ్గించారు?. జగన్ ప్రభుత్వంలో అది విషం.. ఇప్పుడు అదే మందు అమృతం అవుతుందా?. ఇప్పుడు ఆడ బిడ్డల మెడలో తాళిబొట్టు తెగవా?. మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం మద్యం తాగే సోదరులే. వారితో ఓటు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారిని కూడా బాబు మోసం చేశాడు.చంద్రబాబు ఇచ్చే చీఫ్ లిక్కర్ 99కి అమ్మితే.. అదే మందు కేరళలో 85కి ఇస్తున్నారు. దానికి తోడు ఈ చీఫ్ లిక్కర్ నాణ్యమైనది కాదనేది నా అభిప్రాయం. కొన్ని ఏళ్లు ఈ మద్యం తాగితే వారి ఆరోగ్యం తప్పకుండా చెడిపోతుంది. చివరికి మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు. వారికి 20 శాతం మార్జిన్ అని చెప్పి ఇప్పుడు 9.5శాతం మార్జిన్ ఇస్తున్నాడు. విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయి.. అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. మా ప్రభుత్వంలో 47వేల బెల్టు షాపులు రద్దు చేస్తే మళ్ళీ వాటిని తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం షాపులు సంఖ్య తగ్గించి పర్మిట్ రూమ్స్ లేకుండా చేశాం. కానీ, మళ్ళీ చంద్రబాబు పాత రోజులు తెచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు -
మద్యం ధరలు పెంపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచి పెరిగేది ఖరారు కాకపోయినా కచ్చితంగా మద్యం ధరలు పెంచాల్సిన పరిస్థితి ఎక్సైజ్ శాఖకు ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రాబడి తగ్గిపోవడం, గత ఏడాదిలో మద్యం ధరలు తగ్గించిన కారణంగా ఏర్పడిన లోటును ఇప్పుడు పూడ్చుకునే యోచనలో ఎక్సైజ్ యంత్రాంగం ఉంది. ఈ మేరకు మద్యం ధరల పెంపు ద్వారా రూ.2వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మద్యం ధరల పెంపుపై ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి క్వార్టర్ లిక్కర్‌కు రూ.20, బీరు సీసాపై రూ.10 పెంచేందుకు ఎక్సైజ్‌శాఖ సర్వం సిద్ధం చేసుకుంది.గత ఏడాది రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయంఎన్నికల షెడ్యూల్ వస్తుందనే ఆలోచనతో గత ఏడాది ముందస్తుగానే వైన్‌షాపుల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. లైసెన్సు ఫీజులు, దరఖాస్తు రుసుం రూపేణా రూ.2వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది. దీంతో ఇప్పుడు రూ.2,500 కోట్లు లోటు చూపెడుతోందని, అమ్మకాల వారీగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే తగ్గలేదని ఎక్సైజ్ శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు గత ఏడాది మేలో ప్రతి క్వార్టర్ బాటిల్‌పై రూ.10 తగ్గించడంతో రూ.800 కోట్లు లోటు వచ్చిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మేలో తగ్గించిన రూ.10తో పాటు మరో రూ.10 పెంచితే రూ.1600 కోట్లు, బీర్ల రేటు రూ.10 పెంచడం ద్వారా రూ.300 కలిపి మొత్తం రూ.1900 కోట్ల వరకు నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావిస్తోంది. ఇటీవల సీఎం సమక్షంలో రాబడి శాఖలపై జరిగిన సమీక్షలో మద్యం ధరల పెంపు గురించి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, సీఎం రేవంత్ ఇందుకు అంగీకరించలేదని, ఈ ప్రతిపాదనపై మరోమారు చర్చిద్దామని వాయిదా వేసినట్టు సమాచారం.ఎలైట్ బార్లకు ‘నో’...గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఎలైట్ బార్ల విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సాధారణ బార్అండ్ రెస్టారెంట్లకు తోడు గత మూడు, నాలుగేళ్ల కాలంలో 89 ఎలైట్ బార్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లైసెన్స్ ఫీజు 10 శాతం అదనంగా ఉండే ఈ షాపుల కోసం మరో 50 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ దరఖాస్తులన్నింటిని రద్దు చేయాలని, ఇప్పటివరకు అనుమతి వచ్చిన ఎలైట్ బార్లు మినహా భవిష్యత్‌లో అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థానంలో ఎలైట్ వైన్‌షాపుల విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. నగరపాలికలతో పాటు కీలకమైన మున్సిపాలిటీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 25 వరకు ఎలైట్ వైన్‌షాపులకు అనుమతిచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని, ఈ మేరకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఎలైట్ వైన్‌షాపులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌లో మోత మోగుతున్న మద్యం ధరలు... సీఎం చంద్రబాబుపై మద్యం ప్రియుల ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: మద్యం మాఫియా వీరంగం
సాక్షి నెట్వర్క్ : రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలన్నీ తమ చేతుల్లోనే ఉండాలని అధికార కూటమి పార్టీల నేతలు హుకుం జారీ చేస్తున్నారు. తమకు ఉచితంగా 20 శాతం వాటా ఇవ్వాలని, లేదా లాభాల్లో 30–35 శాతం కమీషన్ అయినా ఇవ్వాలని తెగేసి చెబుతున్నారు. ఇందుకు కాదు.. కూడదన్న చోట విధ్వంసం సృష్టిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మద్యం మాఫియా రెచి్చపోయింది. తమ సిండికేట్‌లో చేరలేదన్న కారణంతో ధర్మవరం పట్టణ వైఎస్సార్సీపీ నాయకుడు బాలిరెడ్డికి చెందిన మద్యం దుకాణాన్ని కూటమి పారీ్టల నాయకులు, కార్యకర్తలు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.రాత్రి మద్యం స్టాక్‌ను షాపులో దించుకుని తాళం వేసుకుని వెళ్లిపోయాడు. తమ సిండికేట్‌లో చేరాలని అప్పటికే కూటమి పార్టీల నాయకులు బాలిరెడ్డిని బెదిరించారు. అధిక ధరలకు మద్యం విక్రయించే ప్రశ్నే లేదని, సిండికేట్‌లో చేరబోమని ఆయన తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన వారు అర్ధరాత్రి.. దుకాణం తాళాలు పగలగొట్టి.. లోపల నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను, కంప్యూటర్, ఫరీ్నచర్‌ను ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారు. మరికొన్ని మద్యం కేస్‌లను తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనపై బాలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులంతా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులని తెలిసింది.తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూటమి నేతల బెదిరింపులు.. షాపులు దక్కించుకున్న వారికి స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోవటంతో కేవలం 127 షాపులు మాత్రమే బుధవారం ప్రారంభానికి నోచుకున్నాయి. 204 దుకాణాలు ప్రారంభం కాలేదు. పలమనేరు, పూతలపట్టు, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి పరిధిలో టీడీపీ, జనసేన నేతల అరాచకాల కారణంగా షాపులు దక్కించుకున్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ‘మేము అడిగినంత వాటా ఇవ్వాల్సిందే. కాదూ కూడదు అంటే.. జరిగే నష్టానికి మాకు సంబంధం ఉండదని’ అని కూటమి నాయకులు హుకుం జారీ చేశారు. అప్పుడే ‘బెల్ట్’ దందా టీడీపీ మద్యం మాఫియా తొలి రోజే రాష్ట్రంలో బెల్ట్ దుకాణాల దందాకు తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాలు బుధవారం తెరచుకోగానే.. వాటికి అనుబంధంగా బెల్డ్ దుకాణాలకు తలుపులు బార్లా తీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ దుకాణాలు వెనువెంటనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం మద్యం దుకాణాలతోపాటే పలు చోట్ల బెల్ట్ దుకాణాల్లో అమ్మకాలు మొదలు పెట్టడం గమనార్హం.విజయవాడ తొమ్మిదో డివిజన్లోని చేపల మారెŠక్ట్ ప్రాంతంలో బుధవారం ఉదయమే ఓ బెల్ట్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. విపరీతమైన రద్దీతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ బెల్డ్ దుకాణాన్ని తాత్కాలికంగా మూయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇదే రీతిలో బెల్ట్ దుకాణాల దందా జోరందుకుంది. సర్కారుపై జనం కన్నెర్రపలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థానికుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గుడి, బడి, గృహాల మధ్యే దుకాణాలు ఏర్పాటు చేస్తుండటం పట్ల స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. బుధవారం ఎక్కడికక్కడ దుకాణాల ఏర్పాటును మహిళలు, విద్యార్థులు అడ్డుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉంటున్న తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని, తమ మాట కాదని ఏర్పాటు చేస్తే అందరం ఆత్మహత్యలు చేసుకుంటామని చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట ఆది ఆంద్రవాడ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. బుధవారం ‘వద్దు వద్దు.. వైన్‌షాపు వద్దు’ అంటూ జోరువానలో నిరసనకు దిగారు. తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో, బాపట్లలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాత గుంటూరు మణి హోటల్ సెంటర్లో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తమ విద్యా సంస్థ వద్ద మద్యం షాపు ఏర్పాటు చేయొద్దంటూ బుధవారం విద్యార్థులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నివాసానికి చేరుకుని విద్యా సంస్థ పక్కన మద్యం షాపు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి, ఆచంట మండలం వల్లూరులో, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం రోడ్డులోని వినాయక స్వామి గుడి వద్ద స్థానికులు, రైతులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ⇒ ఇళ్ల మద్య దుకాణం వద్దంటూ చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో స్థానికులు నిరసన తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కొలుకుల రోడ్డులో, కృష్ణా జిల్లా ఘంటసాల సత్రం సెంటర్లో, గన్నవరంలోని కోనాయి చెరువు సమీపంలోని శ్రీ కాశీ విశాలాక్షి ఆలయం వద్ద, ఎనీ్టఆర్ జిల్లా వెల్వడం–చిననందిగామ రహదారిలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను మహిళలు అడ్డుకున్నారు. ⇒ కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ శంభులింగేశ్వరస్వామి దేవాలయం పక్కన మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానిక మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథికి, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. హొళగుందలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ⇒ విశాఖలోని 8వ వార్డు ఎండాడ దరి సుభా‹Ùనగర్, మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ సమీపంలోని వికలాంగుల కాలనీలో నివాసాల చెంత వైన్ షాపు ఏర్పాటు సహించబోమంటూ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి.. ఆ పక్కనే నిరి్మంచిన ఇంటిని వైన్ షాపు కోసం అద్దెకు ఇచ్చారంటూ ఆక్షేపించారు. – సాక్షి నెట్వర్క్ -
AP: మోత మోగిస్తున్న మద్యం ధరలు
‘ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే తన దుర్నీతిని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి చేతల్లో చూపించారు. ‘తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తాం..’ అని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని ఆయన తుంగలో తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం తెరుచుకున్న టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో మద్యం ధరలు మోత మోగించాయి. తక్కువ ధరకు మద్యం లభిస్తుందని మద్యం దుకాణాలకు వెళ్లిన మద్యం ప్రియులకు ధరలు షాక్ కొట్టాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధరల కంటే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల్లో ధరలు అధికంగా ఉన్నాయని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.రూ.99 మద్యం ఇంకా లేదు.. ఒక బ్రాండు మద్యాన్ని రూ.99కే అందిస్తామన్న విధాన నిర్ణయాన్ని టీడీపీ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకు రాలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దుకాణాల్లో చీప్ లిక్కర్ (క్వార్టర్)కు కూడా రూ.130 ధర నిర్ణయించడం గమనార్హం. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కనిష్ట మద్యం బ్రాండు ధర రూ.120కే విక్రయించారు. కానీ ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్ దుకాణాల్లో చీప్ లిక్కరే రూ.130కి విక్రయించడంపై మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూ.99కే మద్యం బ్రాండు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై ఎకైŠస్జ్ శాఖ స్పష్టత ఇవ్వనే లేదు. రూ.99కు మద్యం బ్రాండు కావాలని డిమాండ్ చేస్తున్న వారిపై టీడీపీ సిండికేట్ యజమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మాకు ఎలాంటి సమాచారం లేదు.. చీప్ లిక్కర్ రూ.130 చొప్పునే విక్రయిస్తాం.. నచ్చితే కొనండి.. లేకపోతే పొండి’ అని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో పలు మద్యం దుకాణాల వద్ద వాగ్వాదాలు, ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మద్యం ధరలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పెంచే మార్గాలను, అందుబాటులో ఉన్న వనరులను గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమ వారం సచివాలయంలో ఎక్సైజ్, టూరిజం శాఖల అధికారులతో సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపైనే కాకుండా కట్టడిపైనా దృష్టి పెట్టి పనిచేయాలని కోరారు. ఎలైట్ బార్ల తో పాటు ఎలైట్ షాప్‌ల విషయంలో ఏకీకృత విధానాలను అమలు చేయాలని, రాష్ట్రమంతటా ఒకటే నిబంధనలు అమలయ్యేలా మార్గదర్శకాలు రూ పొందించాలని కోరారు. పోలీస్, సమాచార శాఖలతో కలిసి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ను కట్టడి చేయాలని ఆదేశించారు. ఇందుకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో పురాతన కట్టడాలు, దేవాలయాలు ఉన్న ప్రదేశాల్లో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను అన్వేషించాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ, పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని భట్టి కోరారు. తగిన మార్కెటింగ్ వ్యవస్థ లేని కారణంగా సహజసిద్ధమైన పర్యాటక ప్రదేశాలను వినియోగించుకోలేక పోతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ అన్ని టూరిజం ప్రాజెక్టులను ప్రభుత్వమే చేపట్టలేదని, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రైవేటు కంపెనీల పెట్టుబడులకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. సమావేశంలో భాగంగా కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం, చెక్‌పోస్టుల పటిష్టత కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు నిధులను కోరగా కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, స్పిల్ఓవర్ పనులకు టూరిజం శాఖ నిధులను ప్రతిపాదించింది. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పాల్గొన్నారు. -
Liquor Price: స్టాకు ఉన్నంత వరకు పాత ధరలే!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘రాజు వరమిచ్చినా.. మంత్రి అడ్డుకున్నట్లు’గా ఉంది మందుబాబుల పరిస్థితి. ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినట్లు ప్రకటించి మూడురోజులు గడుస్తున్నా.. సరుకుపై ధరలు తగ్గించకపోవడంపై మందుబాబులు మండిపడుతున్నారు. దీనిపై వైన్‌షాపుల యజమానులు మాత్రం తమకు కొత్త స్టాకు వచ్చేంత వరకు పాతధరలే కొనసాగుతాయని చెబుతున్నారు. ఈనెల 5 నుంచి మద్యంపై ధరలను ప్రభుత్వం సవరించింది. ఫుల్‌బాటిల్‌పై రూ.40, హాఫ్ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా చెప్పింది. అయితే దీన్ని క్షేత్రస్థాయిలో మందుబాబులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో శని, ఆది, సోమ వారాల్లో మద్యం ధరలు తగ్గాయి కదా? అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. వారికి సర్ది చెప్పడం ఎలాగో తెలియక వైన్‌షాపుల నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. దాదాపు పూర్తయిన లేబులింగ్.. ప్రభుత్వం మద్యం ధరలను సవరించిన ప్రతీసారి ప్రభుత్వం కొత్త లేబులింగ్‌తో మద్యం సీసాలు విక్రయిస్తుంది. ఆదేశాలు వెలువడిన అనంతరం తక్షణమే అమలు కావాలి. కానీ అప్పటికే మద్యంషాపులు కొని తెచ్చుకున్న స్టాకు అలాగే ఉండిపోయింది. చాలాషాపుల్లో స్టాకు వారం పది రోజులకు ఒకసారి మారుస్తారు. పాత ధరలకు కొన్న రేట్లకే ఆ మద్యాన్ని అమ్ముకునే వీలుంది. ఎక్కువకు కొని తక్కువకు ఎవరూ విక్రయించరు కదా! ఈ మేరకు ఎకై ్సజ్‌శాఖ కూడా వీరికి పాత స్టాకును, పాత ధరలకు విక్రయించుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈలోపు ఐఎంల్ గోదాముల్లో ఉన్న లిక్కర్ స్టాకు లేబులింగ్ మార్చాల్సి వచ్చింది. పాత ధరలతో ఉన్న స్టాకుపై కొత్తగా సవరించిన ధరలను ముద్రించిన లేబుళ్లను వేస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌లోని వైన్‌షాపులకు వెళ్లే స్టాకుపై కొత్తగా ముద్రించిన లేబులింగ్ ప్రకారం మద్యం సీసాలు విక్రయించనున్నారు. ఈ వ్యవహారం తెలియని మందుబాబులు మాత్రం పాత ధరలకే మద్యం విక్రయిస్తున్నారంటూ యజమానులతో గొడవకు దిగుతున్నారు. పాత ధరలకు విక్రయిస్తే చర్యలు ధరల విషయంలో ఇప్పటికే పలువురు ఎకై ్సజ్ అధికారులకు పలువురు మద్యం ప్రియులు ఫిర్యాదులు చేస్తున్నారు. పాత లేబుల్ ఉన్నవాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని పాత స్టాకు ఉన్నంత వరకు పాత ధరలు అమలవుతాయని, కొత్త లేబులింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత పాత ధరలతో విక్రయిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిమిషానికి 78 బీర్లు..! వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. మే మొదలైనప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని మందుబాబులు బీర్లను తెగతాగేశారు. మే 1 నుంచి 7వ తేదీల్లో రూ.23.17 కోట్ల విలువైన 65,961 కాటన్ల బీర్లు అమ్ముడుపోయాయి. కాటన్‌కు 12 బీర్లు చొప్పున మొత్తం 7,91,532 బీర్లు విక్రయించారు. ఈ లెక్కన రోజుకు 1,13,076 బీర్లు, ప్రతీ గంటకు 4,711, నిమిషానికి 78 చొప్పున బీర్లు తాగేశారు. వేసవి తాపానికి మద్యంప్రియులు అంతా బీర్లకు మారుతున్నారు. లిక్కర్ ధరలో మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం బీర్ల ధరల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అయినా మందుబాబులు మాత్రం చల్లగా బీర్లను పీల్చేస్తున్నారు. -
మందుబాబులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గనున్న ధరలు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్ న్యూస్ చప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది. అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ పాలసీ తొమ్మిది నెలల పాటు 2023, 31 మార్చి వరకు అమల్లో ఉంటుంది. మద్యం కల్తీ, స్మగ్లింగ్, అక్రమ డిస్టిలరీలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్లోని ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖకు రెండు అదనపు బెటాలియన్లు కేటాయించనున్నామన్నారు. ఫలితంగా హర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండ నున్నాయి. కొన్ని బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్ఎల్ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు దిగిరానుంది. -
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్‌పై రూ. 40, 750 ఎంఎల్ (ఫుల్) బాటిల్‌పై రూ.80 చొప్పున.. ప్రీమియం మద్యం హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.160 చొప్పున పెంచింది. లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి. వైన్ క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున.. ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెంచాలని నిర్ణయించడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి మద్యం తరలింపును నిలిపేశారు. ఆన్లైన్ ద్వారా మద్యం ఆర్డర్ చేసే వెబ్సైట్ కూడా సాంకేతిక కారణాలతో పనిచేయలేదు. వెబ్‌సైట్‌ను గురువారం పునరుద్ధరిస్తారని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర -
మా నివేదికను తప్పుగా అన్వయించారు
సాక్షి, అమరావతి: ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి బట్టబయలైంది. మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు తప్పుడు రిపోర్టులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న పన్నాగం బెడిసికొట్టింది. తప్పుడు నివేదికలను ప్రస్తావిస్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ద్వారా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కుట్రను తారాస్థాయికి చేర్చారు. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న చెన్నైలోని ఎస్జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్.. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో తాము చెప్పలేదని స్పష్టం చేసింది. ఏమాత్రం హానికరం కాని సేంద్రియ, మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు అందులో ఉన్నట్లు తాము పేర్కొన్నామని వెల్లడించింది. అవాస్తవాలతో రాద్ధాంతం రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలున్నట్లు ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు ఫిబ్రవరి 3న ప్రధాని మోదీకి లేఖ రాశారు. స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే ప్రమాదకర అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి ఆ మద్యం నమూనాలను గత డిసెంబర్లో చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఈ విషయం నిర్ధారణ అయినట్లు లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ, ఓ వర్గం మీడియా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగాయి. అసలు నిజం ఏమిటంటే... దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాల పరీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని లేఖ రాయడంతో ఎస్జీఎస్ ల్యాబొరేటరీ అన్ని అంశాలను వెల్లడిస్తూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి గత డిసెంబర్ 11న పంపిన మద్యం నమూనాలను పరీక్షించి ఫలితాల నివేదికను అదే నెల 24వ తేదీన అందచేసినట్లు తెలిపింది. ఆ మద్యం నమూనాల్లో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాము నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ) ప్రమాణాల మేరకు తాము మద్యం నమూనాలను పరీక్షించలేదని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని లిఖిత పూర్వకంగా స్పష్టం చేసిన ఎస్జీఎస్ ల్యాబొరేటరీ అదే మాట చెప్పిన గుంటూరు ల్యాబ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను గుంటూరులోని కెమికల్ ల్యాబొరేటరీకి కూడా పంపి పరీక్షించింది. మద్యం నమూనాల్లో ప్రమాదకర అవశేషాలులేవని ఆ ల్యాబొరేటరీ కూడా నిర్ధారించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం ‘రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలున్నట్లు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఎస్జీఎస్ ల్యాబరేటరీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబరేటరీలలో పరీక్షించి అనంతరమే మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చడంతోపాటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’ – వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ -
బాబూ.. నీది ఏ బ్రాండ్?
చంద్రబాబును మోస్తున్న ఓ వర్గం మీడియా... ఎన్నటికీ చెప్పని నిజాలు. అసలు కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. అన్నీ పాతవే!!. మరి ఆ డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యం ఉన్నట్టుండి ఇప్పుడెందుకు ప్రమాదకరమయ్యింది? గతంలో ఇది ఆరోగ్యానికి మంచిదా? ఇదే డిస్టిలరీలు తయారు చేస్తున్న బ్రాండ్లు ఇప్పుడెందుకు ‘జె’ బ్రాండ్లయ్యాయి? ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ వంటి వింత వింత పేర్లతో బ్రాండ్లకు అనుమతిచ్చిన చంద్రబాబును అప్పట్లో ఈ మీడియా ఎందుకు నిలదీయలేదు? బెల్టు షాపులు పెట్టించి ఊరూరా మద్యం తాగమని ప్రోత్సహించిన నారా వారిపై అప్పుడెందుకు ఆగ్రహం వ్యక్తంచేయలేదు? ఎందుకంటే.. ఆయన చంద్రబాబు! ఈయన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. అదే తేడా!!. నిజం చెప్పాలంటే గతంలో ఏవైతే డిస్టిలరీలు, బ్రూవరీలు మద్యాన్ని సరఫరా చేశాయో... ఇప్పుడూ అవే చేస్తున్నాయి. అందులో చాలావరకూ తెలుగుదేశం నేతలవే. అయ్యన్నపాత్రుడు, యనమల బంధువు, డీకే ఆదికేశవులు నాయుడు... వీరంతా డిస్టిలరీల ఓనర్లే. అప్పుడు... ఇప్పుడు కూడా!!. ఇక బ్రాండ్లనేవి ఈ డిస్టిలరీల ఇష్టం. కావాలనుకున్నపుడు పేర్లు మారుస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న బ్రాండ్లన్నీ దాదాపుగా గతంలోనూ ఉన్నవే. కాకుంటే వై.ఎస్.జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం విషయంలో జరిగిందొక్కటే!. షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. మద్యం దుకాణాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఊరూరా వెలిసే బెల్టు షాపుల్ని అడ్డుకోలేమని భావించి... మద్యం దుకాణాలను ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకున్నారు. మద్యం విక్రయించే వేళల్ని తగ్గించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి... ఎలాంటి ఉల్లంఘనలూ లేకుండా కట్టుదిట్టంగా వీటిని అమలు చేస్తున్నారు. కాకుంటే చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు మాత్రం ఇవన్నీ మద్యం విక్రయాల్ని పెంచే చర్యలుగా కనిపించటమే... ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. చదవండి: ఐదు కోట్ల ఆంధ్రుల సమాచారం చోరీ? సభా సంఘానికి సై ఏది నిజం? ► ప్రెసిడెంట్ మెడల్... గవర్నర్ రిజర్వ్ – ఈ విస్కీ బ్రాండ్లకు 2018 ఫిబ్రవరి 6న అనుమతి ఇచ్చింది చంద్రబాబు సర్కారే.. ► 3 క్యాపిటల్స్... స్పెషల్ స్టేటస్ – ఇదంతా టీడీపీ ఎల్లో మీడియా బూటకపు ప్రచారమే. అసలు ఈ పేర్లతో విస్కీనే లేదు. ► కొత్తవి ఒక్కటీ లేవు.. -వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతివ్వలేదు. ప్రస్తుతం ఉన్నవన్నీ గత సర్కారు హయాం నుంచీ కొనసాగుతున్నవే. ఇవన్నీ నిఖార్సయిన నిజాలు. ఏదైనా హానికరమే కదా? తెలుగుదేశం చెబుతున్నట్లుగా అవి ‘జే’ బ్రాండ్లయినా... బాబు అనుమతిచ్చిన నారా బ్రాండ్లయినా... చీప్ లిక్కరైనా... ప్రీమియం బ్రాండ్లయినా... ఏదైనా మద్యమే. ఏదైనా ఆరోగ్యానికి హానికరమే. ఆరోగ్యానికి మేలు చేసే మద్యమేదీ ఉండదు. కాకపోతే ప్రీమియం కాస్త ప్రాసెస్ ఎక్కువ చేసి ఉంటుంది కనక కాస్త తక్కువ హానికరం. చీప్ లిక్కర్ ఏ బ్రాండయినా దాదాపు ఒకటే. సిగరెట్‌కు.. బీడీకి ఉన్న తేడానే వీటిది కూడా. సిగరెట్ కాస్త ప్రాసెస్ ఎక్కువ చేసి ఫిల్టర్‌తో వచ్చేది కొంచెం తక్కువ హానికరం. బీడీకి అవేవీ ఉండవు కనక ఎక్కువ హానికరం. ఏదైనా హానిచేసేదే. కాకపోతే వీళ్లకు రాజకీయం తప్ప ఏదీ అవసరం లేదు కనక చీప్ లిక్కర్లో సైతం పేరు పేరునా ఆరోగ్య సూత్రాలు వల్లిస్తోంది బాబు గ్యాంగ్. ఫలానా బ్రాండ్ మంచిదని, ఫలానా బ్రాండ్ మంచిది కాదని రేటింగులిస్తోంది. తమ వాదనను నిరూపించడానికంటూ ఏ స్థాయికైనా దిగజారుతోంది. కొన్ని బ్రాండ్ల మద్యాన్ని తమకు నచ్చినట్లుగా మార్చేసి... ఆ బాటిళ్లను తమ తాబేదార్ల చేత టెస్టింగ్ ఏజెన్సీలకు పంపిస్తోంది. తమకు ఎలాంటి రిపోర్టులు కావాలో కూడా అడుగుతోంది. ఆ రిపోర్టుల్ని పట్టుకుని వై.ఎస్.జగన్ వ్యతిరేకుల ద్వారా ఏకంగా ప్రధానికి సైతం లేఖలు రాయించే భారీ కుట్రలకు తెరతీసింది. ఇన్ని చేసినా... ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ఏమాత్రం హానికరం కాని సేంద్రీయ, మొక్కల నుంచి వచ్చిన పదార్థాల అవశేషాలే ఉన్నట్లు సదరు టెస్టింగ్ సంస్థ తెలియజేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్ల కుట్రల స్థాయీ తెలుసుకోవచ్చు. 2018లో బాబు అనుమతి ఇచ్చిన మద్యం బ్రాండ్లు 2019 మే 14న ఎన్నికల ఫలితాలకు 2 వారాల ముందు బాబు అనుమతించిన బ్రాండ్లు టీడీపీ సర్కారు తెచ్చిన బ్రాండ్లలో కొన్ని.. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చారు. ఇక హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలకు 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతి ఇచ్చారు. బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చారు. అప్పటివరకు రాష్ట్రంలో వినిపించని, కనిపించని ఈ విచిత్రమైన మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు సర్కారు పుణ్యమే. చదవండి: పెగసస్ వ్యవహారంలో దొరికిపోవడం ఖాయం డిస్టిలరీలన్నీ బాబు జమానావే... రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలుండగా వాటిలో మెజారిటీ... అంటే 11 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే. ఒక్కటంటే ఒక్కటి కూడా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది లేదు. 11లో నాలుగు డిస్టిలరీలకు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు అంటే 1995–99లో అనుమతివ్వగా మరో ఏడు డిస్టిలరీలకు 2014–19 మధ్య ఆయనే అనుమతులిచ్చారు. ఈ వాస్తవాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి చంద్రబాబు అనుకూల మీడియా ఎన్నడూ చెప్పదు. ఎందుకంటే ఇవన్నీ చెబితే బాబును చీకొట్టని వారుండరు. అందుకే వాళ్లు చెప్పరు. డిస్టిలరీలు... బాబు అండ్ కో రాష్ట్రంలోని మద్యం బ్రాండ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్ కుమారుడు. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ దివంగత టీడీపీ నేత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. ఇక ఎస్పీవై ఆగ్రో ప్రొడక్సŠట్ను టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది. వైసీపీ తరపున ఎంపీగా గెలిచాక... నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీవై రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. అందుకు నజరానాగా చంద్రబాబు ఆ డిస్టిలరీకి అనుమతిచ్చారు. ఇక చంద్రబాబు సర్కారు ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో... గతేడాది వరకూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుడు. లేని బ్రాండ్ల పేరుతో దుష్ప్రచారం... కోవిడ్ ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో దిక్కు తోచని విపక్షం దిగజారుడు రాజకీయాలకు తెర తీసింది. ‘3 క్యాపిటల్స్’ ‘స్పెషల్ స్టేటస్’ అనే మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగించింది. వాస్తవానికి రాష్ట్రంలో ఇలాంటి పేర్లతో మద్యం బ్రాండ్లు ఏవీ లేవు. విపక్ష టీడీపీ అభూత కల్పనలకు ఇది మరో నిదర్శనం. అవే డిస్టిలరీలు... అదే బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతినిచ్చిన డిస్టిలరీలు మద్యాన్ని తయారు చేస్తుండగా ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ దాన్ని కొనుగోలు చేసి మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తోంది. ఇది దశాబ్దాలుగా ఉన్న విధానమే. గతంలో ప్రైవేట్ మద్యం దుకాణాలుండేవి. బెల్టు షాపుల్ని, మద్యం అమ్మకాల్ని నియంత్రించాలంటే అవి ప్రభుత్వం చేతిలోనే ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్... ప్రైవేటు పద్ధతిని రద్దు చేశారు. అయితే ఈ మంచి పనికి ముసుగు వేసేసి... అప్పుల కోసమే ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నట్లు టీడీపీ విష ప్రచారానికి దిగింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహించి 43 వేల బెల్ట్ దుకాణాల్ని తెచ్చిన దుర్మార్గాన్ని ఈ మీడియా ఏనాడూ ప్రస్తావించ లేదు. 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలకు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చినా ప్రశ్నించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను అడ్డుకోవడం అసాధ్యమే. అందుకే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించడంతోపాటు విక్రయ వేళలను కుదించడంతో విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2020–21లో మద్యం విక్రయాలు 40 శాతం, బీర్ విక్రయాలు 73 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనం. మరణాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం ఒకవైపు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ.. మద్యం విక్రయాలు తగ్గి సారా వాడకం పెరిగిందనే మరో విష ప్రచారానికీ పూనుకుంది. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ వీధి నాటకానికి తెర తీసింది. ఈ మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని వైద్య పరీక్షలు నిర్ధారించినా... తమ కుటుంబీకులకు తాగుడు అలవాటే లేదని కొందరు మృతుల బంధువులు వాపోయినా... ఎల్లో గ్యాంగ్‌కు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. అసలంతటి జనసమ్మర్థం... పోలీసు నిఘా ఉండే ప్రాంతంలో నాటుసారా ఎలా కాస్తారు? వేర్వేరు ప్రాంతాల్లోని మృతులంతా ఒకే కారణంతో మరణించే అవకాశం ఎక్కడుంటుంది? అనే కనీస ఇంగితజ్ఞానాన్ని వదిలేసి మరీ విషప్రచారానికి దిగుతున్నారంటే... అది ప్రజల విజ్ఞతపై వీరికున్న చులకనభావమే తప్ప వేరొకటి కాదనుకోవాలి. -
మద్యం ధరల సవరణ
సాక్షి, అమరావతి: అక్రమ మద్యం, పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది. పేద ప్రజలు వినియోగించే మద్యం ధరలను తగ్గిస్తూ గత నెలలోనే ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదాయం కాదు.. ఆరోగ్యమే ముఖ్యం మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరిచి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను రద్దు చేసింది. పర్మిట్ రూంలను తొలగించింది. ఆదాయాన్ని పట్టించుకోకుండా రిటైల్ అవుట్లెట్లను 4,380 నుంచి 2,934కి కుదించింది. మద్యం లభ్యతను తగ్గించేందుకే 33 శాతం షాపులను తగ్గించింది. బార్లను 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మద్యం/మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించేందుకు మద్య నిషేధ ప్రచార కమిటీని నియమించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘పొరుగు’ నుంచి స్మగ్లింగ్.. రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం గతేడాది అక్టోబరు 1 నుంచి ధరలు క్రమంగా పెంచుకుంటూ వెళ్లింది. కోవిడ్ సమయంలో మద్యం వినియోగాన్ని నియంత్రించేందుకు ధరలు 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మద్యం వినియోగం రాష్ట్రంలో భారీగా తగ్గింది. అయితే మద్యానికి అలవాటైన కొందరు మిథైల్ ఆల్కహాల్, శానిటైజర్లను ఆశ్రయించారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక నుంచి ఏపీలోకి పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటిపై సమీక్షించిన ప్రభుత్వం.. శానిటైజర్లు తాగి పేదలు ప్రాణాలు కోల్పోతుండటం, స్మగ్లింగ్‌ను నిరోధించే దిశగా చీప్ లిక్కర్, బీరు, రెడీ టు డ్రింక్ కేటగిరీల ధరలు తగ్గిస్తూ గత నెల 3న నిర్ణయం తీసుకుంది. ఎస్ఈబీ నివేదికతో ధరల సవరణ.. ఈ ఏడాది మే నుంచి ఏపీలోకి అక్రమ మద్యం ప్రవాహం పెరిగింది. దీని ప్రభావంపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనికి ప్రధాన కారణం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉండటమేనని ఎస్ఈబీ నివేదించింది. ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదు కావడం గమనార్హం. తెలంగాణ నుంచి 630, కర్నాటక నుంచి 546 , ఒడిషా నుంచి 24, తమిళనాడు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా 11 కేసులు నమోదయ్యాయి. గత నెలలో ఏపీలో చీప్ లిక్కర్ ధరలు తగ్గించిన తర్వాత రాష్ట్ర సరిహద్దు మండలాల్లో చౌక మద్యం అక్రమ రవాణా గణనీయంగా తగ్గిందని ఎస్ఈబీ పేర్కొంది. ఇదే సమయంలో ప్రీమియం, మీడియం బ్రాండ్ల స్మగ్లింగ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీల బ్రాండ్ల ధరలను హేతుబద్ధీకరిస్తే అక్రమ రవాణాకు తెర పడుతుందని ఎస్ఈబీ నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ల ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన ధరల ప్రకారం మీడియం, ప్రీమియం బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.1,350 వరకు ధరలు తగ్గాయి. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకే మద్యం ధరల సవరణ సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ, కర్నాటకలో మద్యం ధరలు రెండింతలు తక్కువ కావడంతో అక్కడ నుంచి రాష్ట్రంలోకి స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రీమియం, మీడియం బ్రాండ్ల ధరలు సవరించామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) నివేదిక ప్రకారం మద్యం ధరలు సవరించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. -
ఆధార్ ఉంటేనే మద్యం
సాక్షి, అమరావతి: వ్యసనపరులు మద్యం జోలికెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ధరలను భారీగా పెంచి మద్యాన్ని దూరం చేసే ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొనుగోళ్లపై పలు నిబంధనలు విధించారు. నగరాలు/పట్టణాల్లో ఆధార్ కార్డు చూపిస్తేనే మద్యం విక్రయాలు జరపనున్నారు. రెడ్జోన్లు, కంటైన్మెంట్ క్లస్టర్ల నుంచి వచ్చే వారిని గుర్తించేందుకు ఆధార్ కార్డు చూపాలనే నిబంధన విధించారు. గొడుగులు, మాస్కులు ధరించకుంటే మద్యం విక్రయించరాదనే ఆంక్షలు విధించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల దగ్గర క్యూ లైన్లు తగ్గిపోయాయి. కొన్ని చోట్ల దుకాణాలు వెలవెలబోయాయి. చదవండి: మద్యం ఇక హోం డెలివరీ..! ► రాష్ట్రంలో మొత్తం 3,463 మద్యం షాపులుండగా 2,330 దుకాణాలను మాత్రమే తెరిచారు. ► 663 మద్యం దుకాణాలు కంటైన్మెంట్ క్లస్టర్ల పరిధిలో ఉండటంతో వీటిని తెరవలేదు. సాంకేతిక కారణాలతో మరో 18 షాపులను తెరవలేదు. ప్రజల ఆందోళనలతో 16 షాపులను, శాంతి భద్రతల సమస్యల కారణంగా 69, ఇతర కారణాలతో 284 మద్యం షాపులను మూసివేశారు. స్టాకు లేకపోవడంతో 83 షాపులు తెరుచుకోలేదు. ఏటా 25 శాతం పెంచుతాం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే రాష్ట్రంలో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చినట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి దశలవారీగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేసి తీరుతారన్నారు. ఇందులో భాగంగానే మద్యం జోలికి వెళ్లాలంటే షాక్ కొట్టేలా ధరలను 75 శాతం పెంచామన్నారు. ఏటా 20 శాతం మద్యం షాపులను తొలగిస్తూ వస్తున్నామని వెల్లడించారు. వీటితో పాటు ఏటా 25 శాతం మద్యం ధరలు పెంచుతామన్నారు. -
మద్యం ప్రియులకు భారీ షాక్..
లక్నో : మద్యం ప్రియులకు యూపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఒక్కో బాటిల్‌పై బాటిల్ పరిమాణం, కేటగిరీని బట్టి రూ 5 నుంచి రూ 400 వరకూ ధరలను పెంచింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెల్లడించారు. మద్యం ధరల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ 2350 కోట్ల రాబడి సమకూరుతుందని చెప్పారు. దేశీ మద్యం ధరలను బాటిల్‌కు రూ 5 మేర పెంచామని తెలిపారు. ఇక ఐఎంఎఫ్ఎల్ మద్యం 500 ఎంఎల్ బాటిల్ రూ 30 చొప్పున పెరుగుతాయని, ప్రీమియం బ్రాండ్లపై 500 ఎంఎల్ పైబడిన బాటిల్స్ రూ 50 మేర భారమవుతాయని చెప్పారు. విదేశీ మద్యం బ్రాండ్లు 180 ఎంఎల్‌పై రూ 100, 180 నుంచి 500 ఎంఎల్‌లోపు బాటిల్స్‌పై రూ 200..500 ఎంఎల్ పైబడిన బాటిల్స్‌పై రూ 400 చొప్పున ధరలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. పెరిగిన మద్యం ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. చదవండి : ఇకపై మద్యం హోం డెలివరీ..ఇవిగో టైమింగ్స్ -
తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు ఇవే..
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరుచుకున్నాయి. దాదాపు 45 రోజుల తర్వాత వైన్స్ తెరుచుకోవడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. చాలా మంది వినియోగదారులు క్యూ లైన్లలో భౌతిక దూరం పాటిస్తున్నారు. అయితే నేటి నుంచి మద్యం విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్.. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16 శాతం ధర పెంచుతున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. కాగా, తెలంగాణలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు సాగనున్నాయి. పెరిగిన ధరలు.. ప్రతి బీర్‌పై రూ. 30 పెంపు చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 40 పెంపు ఆర్డినరి లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 80 పెంపు ప్రీమియం లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 120 పెంపు స్కాచ్ లిక్కర్ ఫుల్ బాటిల్‌పై రూ. 160 పెంపు చదవండి : ఆ ప్రాంతాలు మినహా అన్నిజోన్లలో మద్యం విక్రయాలు -
మద్యపానాన్ని తగ్గిస్తాం
మద్యపానాన్ని నిరుత్సాహపరచాలంటే ధరలు షాక్ కొట్టేలా ఉండాలి. ఇందులో భాగంగానే 75% ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలు మరింతగా తగ్గించుకుంటూ పోతాం.ఇంతకు ముందు ప్రతి షాపు వద్ద ప్రైవేట్ రూమ్స్ (పర్మిట్ రూమ్స్) ఉండేవి. మనం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేశాం. దీంతో పాటు ఏకంగా 43 వేల బెల్టుషాపులను కూడా రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా ఉండకూడదనేది.. లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందువల్లే దుకాణాలు ప్రైవేట్ వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మద్యం విక్రయించే సమయాన్ని కూడా తగ్గించాం. అక్రమ మద్యం రవాణా, తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు గట్టిగా చెబుతున్నా. ఇసుక మాఫియా అనేది ఎక్కడా ఉండకూడదు. మీ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వీటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కారం ఇవ్వొద్దు. ఈ అంశాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తాను. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: మద్యపానాన్ని నిరుత్సాహ పరచడమే తమ ప్రభుత్వ విధానమని, ఇందులో భాగంగానే మద్యం ధరలను 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమంగా మద్యం రవాణా, తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. వీటిని ఉపేక్షించడానికి వీల్లేదన్నారు. కోవిడ్–19 నివారణ చర్యలు, ఖరీఫ్ సీజన్లో వ్యవసాయం, తాగు నీరు, నాడు–నేడు కింద కార్యక్రమాలు, గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు, ఉపాధి హామీ కార్యక్రమాలతో పాటు మద్యం ధరల పెంపు, అక్రమ మద్యం అరికట్టడం తదితర అంశాలపై మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్య నియంత్రణపై కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అందుకే మరింతగా పెంచాం ► లిక్కర్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతోందనే విషయాన్ని టీవీ చానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. తొలి నుంచీ మద్యపానాన్ని నిరుత్సాహ పరచాలన్నదే మా విధానం. ఇందులో భాగంగానే మద్యం ధరలు 75 శాతం పెంచాం. ► మనం 25 శాతం ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే మనం ఏకంగా 75 శాతం పెంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. దుకాణాల సంఖ్య కూడా ఇప్పటికే 20 శాతం తగ్గించాం. ఇప్పుడు మరో 13 నుంచి 15 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది అమలయ్యే నాటికి మనం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో మూడింట ఒక వంతు.. అంటే 33 శాతానికిపైగా మద్యం దుకాణాలను తగ్గించినట్లవుతుంది. దశల వారీగా, ప్రణాళికా బద్ధంగా పూర్తి మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం. ► గత ప్రభుత్వంలో మద్యాన్ని ఎప్పుడుపడితే అప్పుడే విక్రయించే వారు. ఇప్పుడు మద్యం విక్రయించే వేళలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే (లాక్డౌన్లో రాత్రి 7 వరకే) పరిమితం చేశాం. కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యత ► రాష్ట్రంలో మద్యం నియంత్రించడంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగకుండా, రాష్ట్రంలో అక్రమ మద్యం తయారు కాకుండా చూడటం చాలా ముఖ్యం. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. ఇందు కోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. ► కలెక్టర్లు, ఎస్పీలు లిక్కర్, ఇసుక మీద గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్ స్టాఫ్ మాత్రమే ఏమీ చేయలేరు. వారి సంఖ్య చాలా తక్కువ. దీంట్లో పోలీసుల భాగస్వామ్యం కావాలి. ► వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యుడు వీపీఆర్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మొబైల్ యాప్: మద్యం డోర్ డెలివరీ
రాయ్‌పూర్ : లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరటనిచ్చేలా కేంద్రం మద్యం దుకాణాలకు సడలింపులు ఇవ్వడంతో సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజామున నుంచే షాపుల ముందు బారులు తీరారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఏమాత్రం సామాజిక దూరం పాటించకుండా మందుకోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మద్యాన్ని డోర్ డెలివరీ చేయలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను సైతం రూపొందించింది. (ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..) ఎలా లాగిన్ కావాలి.. ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీఎస్‌ఎమ్‌సీఎల్) ఆధ్యర్యంలో లిక్కర్ విక్రయాల కోసం ప్రభుత్వం ఈ వెబ్‌సైట్‌ను మందుబాబులకు అందుబాటులో ఉంచింది. లిక్కర్ కావాల్సిన వాళ్లు తొలుత యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ సంఖ్యతో పాటు వినియోగదారుడి పూర్తి వివరాలను యాప్‌లో పొందుపరచాలి. అనంతరం ఫోన్‌ను వచ్చిన పాస్‌వార్డుతో యాప్‌లోకి లాగిన్ అయ్యి సమీపంలో వైన్ షాపులలో నచ్చిన మందును కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం డెలివరీ బాయ్ ద్వారా సరుకును ఇంటి వద్ద డెలివరీ చేస్తారు. దీనికి ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. (ధరలు పెంచడానికి కారణం అదే: సీఎం జగన్) అలాగే ప్రతి డెలివరీకి అదనంగా రూ.120 వసూలు చేయనున్నారు. ఒక్కో వినియోగదారుడికి 5000 మిల్కీ లీటర్ మద్యం విక్రయించబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ యాప్ అందుబాటులో ఉంటుందని అని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కాగా రాష్ట్రం వ్యాప్తంగా గల గ్రీన్ జోన్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. మొత్తం 26 జిల్లాల్లో రాయ్‌పూర్, కోబ్రా తప్ప మిగతా జిల్లాలన్నీ గ్రీన్ జోన్లోనే ఉన్నాయి. దీంతో దాదాపు రాష్ట్ర మంతా మద్యం అమ్మకాలను ప్రభుత్వం ప్రారంభించింది. -
ఏపీలో పెరిగిన మద్యం ధరలు ఇవే..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మద్య నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మద్యం ధరలను మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ల ప్రతి బాటిల్‌పై ట్యాక్స్ విధించారు. అలాగే పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఇంతకు ముందు పెంచిన దానితో కలుపుకుని ఏపీలో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. రాష్ట్రంలో మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. (చదవండి : ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..) పెరిగిన ధరలు.. రూ. 120 నుంచి 150 మధ్య ఉన్న క్వార్టర్ ధరపై రూ. 80 పెంపు రూ. 150 ఉన్న క్వార్టర్‌పై రూ. 120 పెంపు బీర్‌పై రూ. 60, మినీ బీర్‌పై రూ. 40 పెంపు -
మద్యం ధరలు అందుకే పెంచాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి: దశల వారీ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి లిక్కర్ ధరలను భారీగా పెంచినట్టు ఆయన వెల్లండిచారు. ఇదే సమయంలో అక్రమ మద్యం రవాణాకు గట్టి చర్యలు చేపడతామని తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఎలా జరుగుతుందో అన్న విషయాన్నిన్ని టీవీఛానళ్లు, పేపర్లు చూపిస్తున్నాయి. మద్యపానాన్ని నిరుత్సాహపరచడానికి 75 శాతం పెంచాలి. మనం 25 శాతం పెంచి తగ్గించాలనుకుంటే.. ఢిల్లీలో 70 శాతం పెంచారు. అందుకే 75 శాతం పెంచి.. గట్టి చర్య తీసుకున్నాం. మద్యం దుకాణాల సంఖ్యను మరో 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 20 శాతం తగ్గించాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం తగ్గించినట్టు అవుతుంది. ప్రతి షాపు వద్ద ఇంతకుముందు ప్రైవేటు రూమ్స్ పెట్టారు. మనం దీన్ని రద్దుచేశాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43 వేల బెల్టు షాపులను రద్దు చేశాం. గ్రామాల్లో బెల్టు షాపులు శాశ్వతంగా లేకుండా చేయాలంటే... లాభాపేక్ష లేనప్పుడే జరుగుతుంది. అందుకనే ప్రైవేటు వారికి కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. లేకపోతే సేల్స్‌ను పెంచుకోవడం కోసం ప్రైవేటు వాళ్లు బెల్టు షాపులను ప్రోత్సహిస్తారు. (43 రోజుల అనంతరం సందడి..) మద్యపాన నియంత్రణలో భాగంగా మద్యం విక్రయించే వేళలలను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటవరకూ పరిమితం చేశాం. అందులో భాగంగానే ఈ 75 శాతం పెంపు నిర్ణయం కూడా తీసుకున్నాం. షాక్ కొట్టించే రేట్లు ఉండాలని నిశ్చయించుకున్నాం. దీనివల్ల పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, అలాగే రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కూడా అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటి బాధ్యత ఎస్పీల మీద ఉంటుంది. దీనికోసం ప్రత్యేక పోలీసు అధికారిని పెట్టాం. లిక్కర్, ఇసుక మీద కలెక్టర్లు, ఎస్పీలు గట్టి ధ్యాస పెట్టాలి. కేవలం ఎక్సైజ్ సిబ్బంది మాత్రమే పూర్తిగా నియంత్రించలేరు. పోలీసులు దీంట్లో భాగస్వామ్యం కావాలి. అక్రమ మద్యం రవాణా, మద్యం తయారీ, ఇసుక అక్రమాలు ఎట్టి పరిస్థితులోనూ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష అనేది ఉండకూడదని కలెక్టర్లకు, ఎస్పీలకు గట్టిగా చెప్తున్నా. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ అంశాలను దగ్గరుండి నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాల’ని వైఎస్ జగన్ అన్నారు. ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు.. -
ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు..
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా మద్యం ధరలను మరో 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం మధ్యం ధరలను 25 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం ధరలు మొత్తం 75 శాతం పెరిగినట్టయింది. పెంచిన ధరలు నేటి(మంగళవారం) నుంచే అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మద్యం షాపులు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం మార్గదర్శకాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత నిన్న మద్యం దుకాణాలకు అనుమతించడంతో.. నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మద్యాపానాన్ని నిరుత్సాహరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి : పేదలకు దూరం చేయడానికే) ఇందుకు సంబంధించి ఎక్సైస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. కొత్తగా పెంచిన 50 శాతం ధరలను నేటి నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఒక గంట ఆలస్యంగా మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఉదయం 11 గంటలకు బదులుగా 12 గంటలకు ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. -
ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్ కరోనా ఫీజు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం. లాక్డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది. -
మద్యం అమ్మకాలు షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలు, కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తూ సోమవారం నుంచి విక్రయాలకు అనుమతించడంతో 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. చాలా రోజుల తరువాత దుకాణాలు తెరవడంతో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. కొన్నిచోట్ల మధ్యాహ్నం 2 గంటలకు షాపులు తెరిచారు. మద్యం షాపుల సీల్ తెరిచేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉండటం, కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితాలు అందకపోవడంతో కొంత ఆలస్యమైంది. రెడ్జోన్లలో దుకాణాలు బంద్ ► రాష్ట్రంలో మొత్తం 3,468 మద్యం షాపులుండగా కంటైన్మెంట్ క్లస్టర్లను మినహాయించి మిగిలిన చోట్ల 2,345 దుకాణాలు తెరిచారు. మద్యం షాపులను రెడ్‌జోన్‌లో కూడా తెరవవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో వీటిని తెరవలేదు. ► విజయవాడతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక్క మద్యం షాపు కూడా తెరవలేదు. ప్రకాశం జిల్లాలోని మద్యం గోడౌన్లు కంటైన్మెంట్ క్లస్టర్లలో ఉండటంతో ఎక్సైజ్ శాఖ షాపులను తెరవలేదు. విజయవాడలో కంటైన్మెంట్ క్లస్టర్ల జాబితా అందకపోవడం వల్ల తెరవలేదు. ► గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో మద్యం దొరకపోవడంతో సోమవారం మద్యం ప్రియులు ఒక్కసారిగా షాపుల వద్దకు చేరుకున్నారు. మద్యం దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూ కట్టారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలలో నిలుచుని తమ వంతు కోసం నిరీక్షించారు. అయితే కొన్నిచోట్ల భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు. ► మద్యం ధరలు పెంచినా కొన్ని దుకాణాల్లో మధ్యాహ్నానికల్లా సరుకు ఖాళీ అయింది. మద్యం షాపుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, వలంటీర్లు విధులు నిర్వహించారు. ఎక్కువ చోట్ల భౌతిక దూరం పాటించినప్పటికీ కొన్నిచోట్ల మొదటిరోజు కావడం మూలాన మాత్రం ఉల్లంఘనలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి సినిమా హాలు రోడ్డులో మద్యం దుకాణం వద్ద క్యూ లైన్ పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం కోసం.. ► కొందరు తమిళనాడు వాసులు ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకుని మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడంతో షాపుల్ని మూసివేసి వారిని వెనక్కి పంపించారు. నెల్లూరు జిల్లా జీవీ పాలెం, రామాపురం, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణాల వద్దకు పొరుగు రాష్ట్రం నుంచి ప్రజలు రావడంతో అమ్మకాలు నిలిపివేశారు. ► ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో కూడా మద్యం దుకాణాల వద్దకు భద్రాచలం వాసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో షాపులను మూసివేశారు. ► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని మాచవరం, పిల్లుట్ల ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రాంతం వారు మరో ప్రాంతానికి రావడంతో ఘర్షణ నెలకొంది. భారీగా పెరిగిన మద్యం ధరలు అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కింద మద్యం ధరలను భారీగా పెంచారు. మద్యపానాన్ని నీరుగార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీయూష్ కుమార్ సోమవారం జీవో జారీ చేశారు. -
మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు
కోల్కత్తా : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆంక్షల నుంచి మద్యం షాపులకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీంతో వైన్‌షాపుల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. దాదాపు 45 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. తాజాగా మద్యం ధరలపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను ఏకంగా 30శాతం పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా జీవో జారీ చేసింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. (మద్యం ధరలు మార్గదర్శకాలు) మద్యం ధరలపై బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని పలు రాష్ట్రాలు సైతం భావిస్తున్నాయి. కాగా ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇక మద్యం షాపులు తెరవడంతో ఛత్తీస్గడ్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా మద్యం ప్రియులు బారులు తీరారు. ఇక ఏపీలోనూ మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (వైన్‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర) -
మద్యం ధరలు మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొహిబిషన్ ట్యాక్స్‌తో ధరల పెంపు ► ‘ప్రొహిబిషన్ ట్యాక్స్’ ద్వారా మద్యం ధరలను పెంచనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. ► మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 25 శాతం అదనంగా పెంచుతారు. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్ ధర రూ.300 ఉందనుకుంటే 25 శాతం ధర పెంచి రూ.375కి విక్రయిస్తారు. ► బీరు, దేశీయ, విదేశీ, రెడీ టు డ్రింక్ అన్ని వెరైటీలు, అన్ని పరిమాణాల బాటిళ్లకు పెరిగే ధరలు వర్తిస్తాయి. ► పెంచిన ధరలతోనే సోమవారం నుంచి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులను తెరవనున్నారు. కంటైన్మెంట్ క్లస్టర్స్ వెలుపల మాత్రమే మద్యం షాపులను తెరుస్తారు. రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. విక్రయాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు: రజత్ భార్గవ మద్యం విక్రయాలపై కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపినట్లు ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆదివారం రాత్రి మీడియాకు తెలిపారు. ‘మద్యం షాపుల వద్ద సోషల్ వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటాం. రద్దీ ఎక్కువగా ఉంటే షాపులను కొంతసేపు మూసివేస్తాం. వార్డు వలంటీర్లు విధులు నిర్వహించేలా కలెక్టర్లకు సూచనలు చేశాం. మద్యం షాపుల ఎదుట నిబంధనలు తెలిపే బోర్డులుండాలి. కంటైన్మెంట్ క్లస్టర్స్ బయట షాపులు తెరుస్తాం. మాల్స్, బార్లు, క్లబ్‌లు తెరుచుకోవు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు’ అని ఆయన వివరించారు. మద్యం విక్రయాలపై మార్గదర్శకాలు ఇవీ.. ► మద్యం షాపుల్లో శానిటైజర్లు ఉండాలి. ఒకేసారి ఐదుగురికి మించి అనుమతించరు. ఐదుగురు మాత్రమే నిలుచునే విధంగా వృత్తాలు ఏర్పాటు చేస్తారు. రెండు వృత్తాల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండాలి. మాస్కులు ధరించడం తప్పనిసరి. ► మద్యం షాపుల వద్ద పోలీసుల పర్యవేక్షణతోపాటు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అదనపు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ► మద్యం షాపుల వద్ద జనం గుమిగూడితే పోలీసులను రప్పించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలి. ► మద్యం వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా వార్డు/గ్రామ వలంటీర్లను షాపుల వద్ద ఉంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ► కలెక్టర్లు మద్యం అమ్మకాలపై మీడియా/ఆడియో విజువల్స్ ద్వారా తెలియజేయాలి. ► పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన లిక్కర్ లైసెన్సులు, బార్లు, క్లబ్‌లను మద్యం విక్రయాలకు అనుమతించరు. మద్యం ధరలు 25 శాతం పెంపు మద్యపానాన్ని నిరుత్సాహపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం తన నివాసంలో జరిగిన సమీక్షలో మద్యం నియంత్రణపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో చెప్పిందని, ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో దుకాణాలు తెరుస్తున్నారని అధికారులు ప్రస్తావించగా.. మద్యం నియంత్రణ మన విధానమని ఆ దిశగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, మరిన్ని చర్యలు కూడా తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మద్యం ధరలను 25% పెంచాలని.. రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్యను మరింత తగ్గించాలని నిర్ణయించారు. -
మద్యం ధరల పెంపు వెనుక ఓ ఎంపీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న మద్యం ధరల పెంపు నిర్ణయం వెనుక భారీ కుంభకోణం ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాల వరకు మాఫియా గుప్పిట్లో ఉందని, తాజా మద్యం ధరల పెంపు విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఢిల్లీ, చెన్నైలలో మకాం వేసి బేరం కుదిర్చారని అన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని మంగళవారం ఆయన రాసిన బహిరంగ లేఖలో కోరారు. వెంటనే పెంచిన మద్యం ధరలను ఉపసంహరించుకోవాలని, లేదంటే న్యాయస్థానాల ద్వారా సీబీఐ విచారణ కోసం పోరాడుతామని లేఖలో రేవంత్ వెల్లడించారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ.. ఎక్సైజ్ అండ్ ప్రమోషన్ శాఖగా మారిందని ఎద్దేవా చేశారు. -
మద్యం ధరలు పెంపు?
సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయాన్వేషణలో భాగంగా మద్యం ధరల ను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసర త్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రు లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించబోతోందని ఎక్సైజ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సబ్‌కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి.. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5–10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమో దిస్తే ఏటా రూ. 1,200–1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆ వర్గాల అంచనా. ఈ ప్రతిపాదనలను త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అంశంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు మధ్య ఇటీవల చర్చ జరిగిన ట్టు తెలుస్తోంది. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ నిర్ధారించిన ధరలపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని సమా చారం. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు జాప్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజు! కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఏర్పాటైన 73 మున్సిపాలిటీల్లో కూడా బార్ నోటిఫికేషన్ రానుంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాటు రాజధాని తో పాటు శివార్లలో, రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో నిర్వహించే ఈవెంట్లను వర్గీకరించాలని, ఈవెంట్ల స్థాయిని బట్టి ఫీజును సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యం లో మద్యం ధరల పెంపు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు నోటిఫికేషన్, ఈవెంట్ చార్జీల పెంపు ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందని ఎక్సైజ్ వర్గాలు అంటున్నాయి. -
మళ్లీ ‘బెల్టు’ బాదుడు!
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ సిండికేట్లు మద్యం మార్కెట్‌పై మళ్లీ పట్టు సాధించారు. బెల్టు దుకాణాల ద్వారా ఎమ్మార్పీ ధరలను ఉల్లంఘిస్తూ భారీగా దండుకుంటున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.40 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను నిండా ముంచుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని బెల్టు దుకాణాల్లో ఫుల్ బాటిల్‌కు ఎమ్మార్పీపై రూ. 80 అదనంగా వసూలు చేస్తుండగా.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల్లాలోని ఏ4 దుకాణాల్లో క్వార్టర్‌కు రూ. 10, ఫుల్ బాటిల్‌కు రూ. 40 చొప్పున వసూలు చేస్తున్నట్లు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. ఆదివారం ఈ జిల్లాల్లోని 3 దుకాణాల్లో విక్రయాల తీరును ‘సాక్షి’పరిశీలించింది. మద్యం విక్రయాల రేటు 3 జిల్లాల్లో దాదాపు ఒకేలా ఉంది. బెల్టు దుకాణాలపై దాడులు జరగకుండా ఏ4 దుకాణ యజమానులే చూసుకుంటున్నారని, ఇందుకు పోలీసులకు నెలకు రూ. 20 వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ. 8 వేల చొప్పన మామూళ్లు ఇస్తున్నారని తెలిసింది. దుకాణాదారుల ‘కొత్త’ రూటు ఎక్సైజ్ శాఖ లిక్కర్ ప్రైస్ యాప్ అమల్లోకి తెచ్చాక ఎమ్మార్పీ ఉల్లంఘనలపై భారీగా ఫిర్యాదు లొచ్చాయి. తొలిరోజుల్లో ఎౖMð్సజ్ ఎన్ఫోర్స్మెంట్ భారీగా దాడులు చేయడంతో దుకాణాదారులు కొత్త ఎత్తుగడ వేశారు. ఏ4 దుకాణంలో నేరుగా జరిగే విక్రయాల్లో, బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలపై కేసులు పెట్టొద్దని ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బెల్టు దుకాణాలకిచ్చే ప్రతి క్వార్టర్ సీసా ఎమ్మార్పీ మీద రూ. 10, ఫుల్ బాటిల్‌పై రూ.40 అదనంగా తీసుకోవడం మొదలైంది. వారం వారం జాతర జరిగే దేవాలయాల పరిధిలోని దుకాణాల నిర్వాహకులైతే ఫుల్ బాటిల్‌కు రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణదారులు అదనపు సొమ్మకు రెట్టింపు సంఖ్యలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా ‘బెల్టు’లు రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా బెల్టు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల మద్యం వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. బెల్టు దుకాణాల నిర్వాహణలో చూసి చూడనట్లుగా ఉండాలని ఎక్సైజ్ బాస్ నుంచి సంకేతాలు వెళ్లడంతో లిక్కర్ సిండికేట్లు రెచిపోతున్నారు. నేరుగా దుకాణాల్లో మద్యం తీసుకునే వినియోగదారులనూ బాదేస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ ఎమ్మార్పీ మీద రూ. 2 అదనంగా తీసుకుంటున్నారు. -
ఎం.ఆర్.పి అక్రమాలకు కళ్లెం
సంగారెడ్డి క్రైం: మాగ్జిమం రిటైల్ ప్రైస్ (ఎం.ఆర్.పి.) ధరల కంటే అధిక రేట్లకు మద్యం విక్రయించడం, ఒక బ్రాండ్‌కు బదులు మరోటి ఇవ్వడం.. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై యజమానులు దాడులు చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి అక్రమాలను నియంత్రించడానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. ఆన్‌లైన్‌తో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో జరిగే అవకతవకలకు కళ్లెం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని మద్యం దుకాణాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను రూపొందించారు. దాని ద్వారా మద్యం అధిక ధరలను నియంత్రించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడాన్ని అరికట్టనుంది. గతంలో మద్యం దుకాణాల నిర్వాహకులు అధికారికంగా కొంత మొత్తాన్ని కొనుగోలు చేసి మిగిలిన మద్యాన్ని దొడ్డిదారిన తెచ్చుకొని కల్తీ చేసి అంటగట్టి లాభాలు ఆర్జించిన సంఘటనలు కోకొల్లలు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖపై వచ్చిన విమర్శల దృష్ట్యా ఆ శాఖ నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. మద్యం ధరలను ఎమ్మార్పీకే విక్రయించేలా చూడడంతోపాటు దుకాణాదారులు దొడ్డిదారిన తెచ్చుకునే సరుకును సైతం అడ్డుకునేందుకు యాప్ విడుదల చేసింది. యాప్‌ను ఉపయోగించే విధానం రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ ప్రైస్ తెలంగాణ యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం విక్రయించే 800 పైచిలుకు మద్యం బ్రాండ్ల ధరలను సైజులవారీగా కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎమ్మార్పీ విషయంలో ఏదైనా దుకాణ యాజమాన్యం నిబంధనలు అతిక్రమిస్తే యాప్ నుంచే ఫిర్యాదు చేయడానికి వీలుంది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత ఫోన్ నంబర్‌తో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం సైజ్ లేక ప్రైస్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కావాలి్సన బ్రాండ్‌ను నమోదు చేసుకోమని అడుగుతుంది. అనంతరం మీరు ఎంటర్ చేసిన బ్రాండ్ లభించే పరిమాణం, ఎమ్మార్పీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫిర్యాదులు ఇలా చేసుకోవచ్చు.. దుకాణ యజమానులు ఎంత ధరకు మద్యాన్ని అమ్మారో, దుకాణం పేరు, అడ్రస్, ఫిర్యాదుదారుడి పేరు, మొబైల్ నంబర్, సంబంధిత దుకాణం ఫొటో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన అనంతరం కొన్ని వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. దుకాణాల వద్ద అపరిశుభ్రత, పరిసరాలు తదితర విషయాలు, కల్తీ, దుకాణ సిబ్బంది దురుసు ప్రవర్తన, అర్ధరాత్రి అమ్మకాలు సాగించినా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం మద్యం దుకాణాల్లో అధిక ధరలను నియంత్రించడానికి, యాజమాన్యాలు, వినియోగదారుల మధ్య ప్రవర్తనలో మార్పులకు సీసీ కెమెరాల ఏర్పాటు దోహదం చేస్తుంది. ఇప్పటికే సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎమ్మార్పీ ధరలకన్నా అధిక రేట్లకు అమ్మకుండా చర్యలు తీసుకున్నాం. అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిఘా పెట్టాం. – ఏబీకే శాస్త్రి, ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ వాట్సప్ ద్వారా.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు వైన్ షాపు యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారులు వాట్సాప్ నంబర్ 7989911122 ద్వారా కానీ టోల్ ఫ్రీ నంబర్ 1800–4252–523 ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్‌కు ఒక సంఖ్య వస్తుంది. కేటాయించిన నంబర్ ఆధారంగా చర్యలు తీసుకున్న వివరాలను ఎక్సైజ్ శాఖ తెలియజేస్తుంది. ఉమ్మడి జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో 191 మద్యం దుకాణాలు, 29బార్ అండ్ రెస్టారెంట్లలో ఒక్కో దుకాణం వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కనీసం 440 సీసీ కెమెరాల నిఘాలోకి మద్యం దుకాణాల క్రయ, విక్రయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పా టు వల్ల ఎలాంటి గొడవలు జరిగినా తెలిసిపోయే అవకాశముంది. -
ఆబ్కారీ ఆన్లైన్
విధిగా ధరల పట్టికను ప్రదర్శించడం.. మందు పోసే విధానంలో అక్రమాలను అరికట్టడం.. నకిలీ మద్యానికి చెక్‌పెట్టడం.. సిండికేట్, అనుమతి లేని సిట్టింగ్‌లకు స్వస్తి చెప్పడం.. ధరలను అదుపు చేయడం.. మద్యం దుకాణాలపై పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు వ్యాపారులు చేస్తున్న ఇటువంటì అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను తెరమీదకు తెచ్చి అక్రమాలకు చెక్ పెట్టేందుకు పూనుకుంది. యాప్‌లో అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పొందుపరచగా.. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మద్యం ప్రియులకు త్వరలోనే అవగాహన కల్పించేందుకు.. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. ఖమ్మం, వైరా: మద్యం దుకాణాల్లో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి మద్యం షాపులో యజమాని రెండు సీసీ కెమెరాలను రికార్డింగ్ సదుపాయంతో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఆ సొమ్మును ఎలాగోలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. కల్తీ మద్యంతోపాటు ఎమ్మార్పీ ధరలకు మించి మద్యం విక్రయిస్తున్నారు. సిట్టింగ్‌లు అనుమతి లేకుండా నిర్వహించడంతోపాటు కౌంటర్ వద్దే మద్యం ప్రియులకు పెగ్గుల ద్వారా మద్యం విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఎక్కువ సమయం వరకు వైన్ షాపులు, బార్లు తెరిచి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటికీ కళ్లెం వేసేందుకే ప్రభుత్వం ‘లిక్కర్ ప్రైస్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్రంలో లభించే 880 లిక్కర్ బ్రాండ్ల ధరలు పొందుపరిచారు. విస్కీ, బ్రాందీ, రమ్, బీరు.. ఇలా రకాలవారీగా వివరాలున్నాయి. యాప్‌లోకి వెళ్లి కావాల్సిన మద్యం రకంపై క్లిక్ చేసి.. సైజులు నమోదు చేస్తే మద్యం ధర ఫోన్ తెరపై వెనువెంటనే ప్రత్యక్షమవుతుంది. ఫిర్యాదు చేయడం ఇలా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 162 మద్యం దుకాణాలను ఇటీవలే లక్కీడిప్ ద్వారా సొంతం చేసుకున్నారు. కొందరు పట్టణ ప్రాంతాల్లో సిండికేట్‌గా మారి మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు నాసికరమైన మద్యాన్ని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. వీటన్నింటినీ నిరోధించడం.. మద్యం ధరల్లో తేడా వస్తే వినియోగదారులు దుకాణం యజమానులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన వాట్సప్ నంబర్ 7989111222కు ఫిర్యాదు చేయొచ్చు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2533కు ఉచిత ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఇలా హైదరాబాద్‌లోని ప్రధాన కాల్ సెంటర్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా ఫిర్యాదుదారు తన ఫిర్యాదు పరిస్థితిని తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో ప్లేస్టోర్ ద్వారా ‘లిక్కర్ ప్రైస్’ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే యాప్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అ«ధికారులు అధికారికంగా విడుదల చేసిన విషయం విదితమే. ధరల పట్టిక తప్పనిసరి.. కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రతి దుకాణంలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే దుకాణాల ఎదుట ధరల పట్టిక కూడా ఉంచాలి. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలు, 5 బీర్ బ్రాండ్ల ధరలు పట్టికపై ముద్రించాలి. 12 నెలల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ బ్రాండ్ల ధరలను పట్టికపై ముద్రిస్తారు. ఇది మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పులో ఉండేలా.. తెలుగులో ప్రతి బ్రాండ్ ఎమ్మార్పీని పొందుపరచాల్సి ఉంటుంది. మద్యం దుకాణం పేరు, గెజిట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. అవగాహన కల్పిస్తాం.. మద్యం దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాం. మద్యం అమ్మకాల్లో ఎటువంటి అక్రమాలు తలెత్తకుండా యాప్ ఉపయోగపడుతుంది. ఇటీవలే యాప్‌ను అధికారంగా విడుదల చేయగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మూడు ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేపడతాం. బాధితులకు న్యాయం చేస్తాం. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగకరం. మద్యం ప్రియులు దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – సోమిరెడ్డి,ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఖమ్మం -
తాగినోళ్లకు తాగినంత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నా.. మందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మేడారం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చింది. ఎమ్మా ర్పీ నిబంధనలను సడలించి దుకాణదారుడు ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గిరిజనుల పేర్ల మీద గిరిజనేతర లిక్కర్ మాఫియా ఈ బార్లను దక్కించుకుంది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజు మేడారం జాతరలో ఈవెంట్ పర్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 22 తాత్కాలిక బార్లను అనుమతించింది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజుతో స్థానిక గిరిజనుల పేరు మీద వీటిని ఇచ్చింది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటు వీటిని నిర్వహించుకోవచ్చు. మేడారం, మేడారం చెరువు, నార్లపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం, కొత్తూరు, చింతల్ క్రాస్ రోడ్డు తదితర గ్రామాల పరిధిలో బార్లను అనుమతించింది. వాస్తవిక మద్యం ధర మీద 30 శాతం అదనపు రేటుతో టీఎస్‌బీసీఎల్ తాత్కిలిక బార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నుంచే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయిస్తే వారికి గిట్టుబాటు కాదు కాబట్టి.. ఆ నిబంధన ఎత్తివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఒక్క రోజులో రూ.2.5 కోట్ల మద్యం విక్రయం వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే మద్యం దుకాణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనేతర లిక్కర్ మాఫియా స్థానిక గిరిజనుల పేరు మీద బార్లను దక్కించుకుంది. దీనికి ఎమ్మార్పీ నుంచి సడలింపు ఉండటంతో ఇష్టం వచ్చిన కాడికి దండుకుంటున్నారు. 28న అనుమతి పొందిన దుకాణాలు 29వ తేదీ ఒక్కరోజే రూ.2.5 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే రోజుల్లో భారీగా లిక్కర్ వ్యాపారం జరగవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మద్యం డిపోల్లో ప్రజలు ఎక్కువగా తాగే మద్యం బ్రాండ్లకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు. -
న్యూ ఇయర్ వేళ మందుబాబులకు షాక్!
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. మీడియం, ప్రీమియం మద్యం బ్రాండ్ల ధరలను 5 నుంచి 12 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి రాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎంఆర్పీ ధరలకు అనుగుణంగా నిర్ధేశిత శాతం ప్రకారం నేటి రాత్రి నుంచి ధరలు పెరుగుతాయి. ఒక్కో క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిలకు రూ.40 నుంచి రూ.60 వరకూ పెరుగుతాయి. అయితే ధరల పెంపు లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. రూ.400లోపు లభించే మద్యం ధరల్లో మాత్రం ఏమార్పు లేదు. బీర్ల ధరల పెంపు ప్రస్థావన ప్రస్తుతానికి లేదని, వాటి ధరలు యధావిధిగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2012 డిసెంబర్లో మద్యం ధరలు పెంచారు. -
మందు.. ఇక కాస్ట్లీ గురూ!
ఎక్కడైనా మందు మామూలుగానే దొరుకుతుందేమో గానీ, హరియాణా వెళ్లారంటే మాత్రం మామూలు కంటే అదనంగా డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే, అక్కడ రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల మద్యం సీసాల ధరలను 20 శాతం చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని బ్రాండ్లకు చెందిన స్వదేశీ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్), విదేశీ మద్యం అన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది. ఇందుకు గాను 2017-18 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీని రాష్ట్ర ఎక్సైజ్, పన్నుల శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు విడుదల చేశారు. దీనివల్ల రీటైలర్ల ఆదాయం బాగా పెరుగుతుందని అంటున్నారు. అంతేకాదు.. గుర్గావ్, ఫరీదాబాద్ ఎక్సైజ్ జోన్లోల నివసించేవాళ్లు పబ్‌లలో తాగాలంటే మరింత ఎక్కువ వదిలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, అక్కడి పబ్‌లు, బార్ల లైసెన్సు ఫీజులను ఏడాదికి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లోలవరకు పెంచారు. దీంతోపాటు ఇతర పన్నులు అదనం. ఇప్పుడు మద్యం దుకాణాల వాళ్లు తాము ఏ రకం మద్యం కావాలనుకుంటే దాన్ని అమ్ముకోవచ్చు. జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలను నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. ఇక నగరాలు, పట్టణాల్లో ఎక్కడ అమ్ముకుంటారో ఆ ప్రదేశం ఎంపిక నిర్ణయాన్ని వ్యాపారులకే ప్రభుత్వం వదిలేసింది. దాన్ని బట్టి చూస్తే.. మద్యం అమ్మకందారులు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వచ్చు. అంటే ఒకరకంగా ఇవి అధికారిక బెల్టుషాపుల లాంటివన్న మాట. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ. 4900 కోట్ల ఆదాయం రావాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం రూ. 4071 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈసారి కాస్త కోటా పెంచి రూ. 5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని విధించారు. లైసెన్సు ఫీజులతో పాటు కొన్ని పన్నుల ద్వారా ఈ అదనపు ఆదాయం వస్తుందని కెప్టెన్ అభిమన్యు అంటున్నారు. ఒక్కో లైసెన్సుకు తోడు అదనంగా రెండు బెల్టుషాపులు నిర్వహించుకోడానికి అనుమతి ఇవ్వడంతో.. ఇప్పటివరకు ఉన్న 3500 మద్యం షాపులు కాస్తా ఇప్పుడు 9వేల వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. -
మందులకు ధరల వాపు
సామాన్య ప్రజలకు మందులు కొనే స్తోమత ఉండాలంటే, వాటి ధరల అదుపుతోనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్య రక్షణ మాంద్యాన్ని అడ్డుకోవడానికి పశ్చిమ దేశాల స్వేచ్ఛా విపణులలో కూడా పటిష్టమైన ధరల అదుపు వ్యవస్థలను అమలు చేస్తున్నారు. కెనడాకు పేటెంట్ హక్కులు ఉన్న ఔషధాల ధరల సమీక్షా వ్యవస్థ ఉంది. ఈజిప్ట్ మొత్తం ఔషధాలు అన్నింటినీ ధరల అదుపు వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. లెబనాన్‌లో పేటెంట్ ఔషధాల ధరలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. రోజుకు కేవలం రూ. 250/- సంపాదించుకునే ప్రభుత్వోద్యోగి, లేదా సాధారణ కార్మికుడు దీర్ఘకాలంపాటు వేధించే ట్యుబర్క్యులోసిస్ (టీబీ/ క్షయ) వంటి వ్యాధికి గురైతే దుర్భర దారిద్య్రం బారిన పడక తప్పదు. ఆ వ్యాధి నివారణకు అవసరమైన వైద్యానికీ, అందుకు ఉపయోగించే మిశ్రమ ఔషధాలకీ అయ్యే ఖర్చు రమారమీ రూ. 1.2 నుంచి 1.5 లక్షలు. ఈ మొత్తం అలాంటి వ్యాధి పీడితుల నాలుగైదేళ్ల పొదుపు మొత్తంతో సమానం. నిజానికి మధుమేహం వంటి ఒక వ్యాధికి గురైనా వారి నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం దాని మందులకే ఖర్చు చేయవలసి ఉంటుంది. అనేక ఇక్కట్లతో సతమతమవుతున్న భారతీయ వినియోగదారుడంటే అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థలు బంగారుగుడ్లు పెట్టే బాతు మాదిరిగా చూస్తున్నాయి. మార్టిన్ షెక్రెలి ఆధ్వర్యంలో నడిచే ట్యురింగ్ ఫార్మాసూటికల్స్ తయారు చేసే ఔషధం డారాప్రిమ్ను కొనుగోలు చేస్తున్న పాపానికి ఆ సంస్థ వినియోగదారుడిని దారుణంగా శిక్షిస్తోంది. హెచ్ఐవీ రోగుల కోసం ఉపయోగించే ఈ మందు ధరను ట్యురింగ్ ఫార్మాసూటికల్స్ కేవలం 20 డాలర్ల నుంచి 750 డాలర్లకు పెంచేసింది. ఇంత దారుణమైన పెంపు ఔషధ పరిశ్రమ పాలిట కూడా పెద్ద భారమే (హెచ్ఐవీఎంఏ, సెప్టెంబర్ 2015). గ్లెన్‌మార్క్ అనే ఔషధాల తయారీ సంస్థ రెండు కేన్సర్ నిరోధక ఔషధాలను నెలవారీ ఈఏంఐల ద్వారా కొనుగోలు చేసే సౌకర్యాన్ని భారతదేశంలో ప్రకటించింది. అవే అబిరాప్రో(250 ఎంజీ, 120 ప్యాక్, ధర రూ. 39,990), ఎవర్మిల్ (10 ఎంజీ, పది ట్యాబ్లెట్ల ప్యాకెట్ ధర రూ. 29,965). కేన్సర్ వ్యాధి నిరోధించడానికి ఉపయోగించే మరో ఔషధం గ్లివెక్. దీని మౌలిక ధర రూ. 8,500 నుంచి లక్షరూపాయలకు చేరింది. కొత్తగా వచ్చిన హెపటైటిస్ సి ఔషధం- సొవాల్డి, దీని ధర మాత్ర ఒక్కంటికి వేయి డాలర్లు. చెవిలో ఇన్ఫెక్షన్ను తగ్గించే కార్టిస్పోరిన్ అనే ఔషధాన్ని 1975లో గ్లాక్సో వెల్కమ్ సంస్థ మెరుగు పరచి తయారుచేసింది. దీని ధరను 10 డాలర్ల నుంచి 195 డాలర్లకు పెంచింది. అయితే ఈ ఔషధం అసలు తయారీదారు ఎండో హెల్త్ సొల్యూషన్స్ ఈ ధర పెంపును ‘హేతుబద్ధం, సముచితం’ అని సమర్థించింది (డేవిడ్ లాజరస్, ఫిబ్రవరి 2016). కాగా చైనాలో ఐదు సంస్థలు కుమ్మక్కయి అలోప్యూరినాల్ ట్యాబ్లెట్ల ధరలు పెంచేసినందుకు ఆ దేశ గుత్తాధిపత్య నిరోధక వ్యవస్థ వాటి మీద జరిమానా విధించింది (ఎన్డీఆర్సీ 2015). ఇతర వ్యవహారాలు కూడా ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. వాలంటరీ లెసైన్స్ (వీఎల్) వ్యవహారంలో 11 భారతీయ జనరిక్ (సాధా రణ) ఔషధాల తయారీ సంస్థలకు, గైలీడ్ సైన్స్‌కు మధ్య జరుగుతున్న ఒప్పం దాలలో నిర్ణయిస్తున్న ధరలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు ఔషధాల దిగుమతుల మీద కస్టమ్స్ సుంకం మినహాయింపును పునరుద్ధరించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయమే ఆ ఔషధాలకి ఉన్న గిరాకీని బహిరంగపరుస్తున్నది. అందువల్ల ఆ ఔషధాల ద్వారా జరిగే వైద్యం సంవత్సరం పాటు యథేచ్ఛగా సాగుతుంది. అంటే తీవ్ర అస్వస్థత ఇప్పుడు ఔషధ సంస్థలకు బంగారు గని వంటిదన్నమాట. పేదలకు సంబంధించి భారతదేశంలో ఆరోగ్య రక్షణ చాలా అస్తవ్యస్తంగా సాగుతోంది. ఆరోగ్యం కోసం చేసే వ్యయంలో 80 శాతం వరకు సొంతంగా వ్యక్తులు తమ జేబు నుంచి పెట్టుకుంటున్నదే. మళ్లీ ఇందులో 70 శాతం ఔట్ పేషెంట్‌గా మందులు కొనుగోలు చేయడానికి వ్యయం చేయాలి (క్రీస్.ఎ, కొత్వానీ. ఎ, కుట్జిన్. జె, పిళ్లై. ఎ 2004). అందుబాటులో ఉన్న మందులు ఏవి అన్న అంశం మరీ అందోళన కలిస్తున్నది. అంటే మందులు కొనుగోలు చేసే స్తోమత ఎంతవరకు? దేశ రాజధాని ఢిల్లీలో కొనగలిగిన ఔషధాల అందుబాటు 48.8 శాతమే (అనితా కొత్వానీ, 2013). పారాసిటామల్ వంటి మౌలిక ఔషధాన్ని కొనుగోలు చేసే స్తోమతను అసంఘటిత రంగంలోని ఒక కార్మికుడు సాధించుకోవాలంటే గంట పాటు (ఇదే ఇంగ్లండ్‌లో అయితే పది నిమిషాలు) శ్రమించాలి (ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్, 2015). భారతదేశంలో ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థ ఏర్పడింది. 1962 నాటి ఔషధాల (ధరల పట్టిక ప్రదర్శన)ఆదేశం వాటి ధరలను నిరోధించింది. హాతీ కమిటీ నివేదిక (1975) మరో మైలురాయి. ఈ నివేదికను బట్టే ఔషధ విధానం (1979) రూపొందింది. జాతీయ ఔషధ అథారిటీ, ప్రత్యేక ఔషధాల ధరలను క్రమబద్ధీకరించే వ్యవస్థ కూడా ఆ నివేదికతోనే అమలులోకి వచ్చాయి. తయారీ, ఆవిష్కరణలలో కొన్ని మినహాయింపులు ఇచ్చి ఔషధాల ధరల అదుపు ఆదేశం-డీపీసీఓ (2013) భారత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి 348 ఔషధాలను తీసుకువచ్చింది (ఎస్. శ్రీనివాసన్, ఈపీడబ్ల్యూ, 2014). కొన్ని లొసుగులు అలాగే ఉండిపోయాయి. పారాసిటామల్ తయారీలో 358 విధానాలను ధరల అదుపు వ్యవస్థ కిందకు తీసుకురాగా, ఈ ఔషధానివే 2714 సంయోగాలను (మార్కెట్లో వీటి వాటా 80 శాతం) వదిలిపెట్టింది (శౌరీరంజన్ శ్రీనివాసన్ 2013). ధరల అదుపు ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లో 18 శాతం మందులే డీపీసీఓ 2013 పరిధిలోకి వస్తాయి. ఇది చాలా తక్కువగానే ప్రభావితం చేయగలుగుతోంది. జాతీయ ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థ 50 నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరల మీద నియంత్రణను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంతో సామాన్య ప్రజానీకానికి ఆ ఔషధాల అందుబాటు మిథ్యగా మారింది (ఎస్. శ్రీనివాసన్, ఈపీడబ్ల్యు, 2014). నిజానికి భారతీయ ఔషధ పరిశ్రమ సరైన పోటీ లేని వాతావరణంతో బాధపడుతోంది. వినియోగదారులు తమ తక్షణ అవసరం నుంచి బయటపడడానికి ఎక్కువ ధర ఉన్న ఔషధాలనే కొనుగోలు చేస్తున్నారు. దేశంలో ఔషధాల ధరల నిర్ణాయక వ్యవస్థను మార్చవలసిన తరుణం వచ్చింది. సామాన్య ప్రజలకు మందులు కొనే స్తోమత ఉండాలంటే, వాటి ధరల అదుపుతోనే అది సాధ్యమవుతుంది. ఆరోగ్య రక్షణ మాంద్యాన్ని అడ్డుకోవ డానికి పశ్చిమ దేశాల స్వేచ్ఛా విపణులలో కూడా పటిష్టమైన ధరల అదుపు వ్యవస్థలను అమలు చేస్తున్నారు. కెనడాకు పేటెంట్ హక్కులు ఉన్న ఔషధాల ధరల సమీక్షా వ్యవస్థ ఉంది. ఈజిప్ట్ మొత్తం ఔషధాలు అన్నింటినీ ధరల అదుపు వ్యవస్థ పరిధిలోకి తెచ్చింది. లెబనాన్‌లో పేటెంట్ ఔషధాల ధరలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అదే లెబనాన్ నేషనల్ డ్రగ్ ఇండెక్స్. వీటి గురించి ఆలోచించడంతో పాటు మనం కేంద్రీకృత సేకరణ విధానాన్ని ప్రోత్సహించాలి. మందులు కొనుగోలు విషయంలో తమిళనాడు అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలి. వైద్యులను, అధికారులను లోబరుచుకోవడానికి, తమ సంస్థల నుంచి ఔషధాలను కొనుగోలు చేయించే ఉద్దేశంతో ఏర్పాటు చేసే హాలిడే పర్యటనలు, కానుకలు సమర్పించుకోవడం వంటి అనైతిక చర్యలను నిరోధించడం చాలా అవసరం. ఆలిండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్ సూచించినట్టు అత్యవసర ఔషధాల జాబితాను రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. అలాగే తజక స్తాన్‌లో అమలవుతున్నట్టు అత్యవసర ఔషధాల మీద వ్యాట్‌ను తొలగించే అంశాన్ని కూడా ఆలోచించవచ్చు. దేశంలో అందరూ భరించగలిగే ఆరోగ్య రక్షణ అవసరం. ఇందుకు బీమా విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, తోడ్పడుతుంది. చౌకగా లభించే ఇన్‌పేషెంట్ బీమాను ప్రభుత్వం తీసుకురావాలి. అలాగే ఆస్పత్రి నుంచి విడుదలై వెళ్లిన తరువాత అయ్యే ఖర్చును కూడా ఇందులో జత చేయాలి. తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ విధానం, జనరిక్ ఔషధాల దుకాణాల ఏర్పాటు (రాజస్తాన్‌లో ఏర్పాటు చేసిన లైఫ్ లైన్ దుకాణాల వంటివి), తక్కువ ఖర్చుతో వైద్యం అందుకుని బయటపడే ఆస్పత్రులను, అంటే సామాన్యులు కూడా భరించగలిగిన వైద్యాన్ని (వాత్సల్య ఆస్పత్రుల వంటివి) కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. భారతదేశంలో ఔషధాలు ఇప్పటికీ అధిక ధరలతో, సామాన్యుల స్తోమతకు అందనంత దూరంగానే ఉన్నాయి. ఇది వాస్తవం. భారతదేశం ఇంకా పేద దేశమే. ఇలాంటి పేద దేశంలో మందులు, వైద్యం కోసం ప్రజలు అప్పుల పాలుకావడం, ఈ పరిణామంతోనే లక్షలాది మంది మళ్లీ పేదరికంలో మగ్గిపోవలసి రావడం రెండో పెద్ద వాస్తవం. సరికొత్త విధానాలను అమలులోకి తీసుకురావడం ద్వారా అన్ని రకాల ఔషధాలను అందుకోగల స్తోమతను సామాన్య జనానికి కూడా కలిగించవచ్చు. (వ్యాసకర్త మేనకా గాంధీ కుమారుడు, బీజేపీ ఎంపీ) - వరుణ్‌గాంధీ -
తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు
-
రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా
-
రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా
- దసరా ముందు రోజు ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. వీలైనంత ఎక్కువగా మద్యాన్ని తాగించడం ద్వారా ఎక్కువ ఆదాయం అర్జించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చౌక మద్యం పేరుతో చీప్ లిక్కర్‌కు దసరా ముందు రోజు గేట్లు తెరిచింది. అందుకనుగుణంగా తక్కువ రకం మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్‌ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రకాల మద్యంపై ఎక్సైజ్ డ్యూటీని, వ్యాట్‌ను పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీంతో తక్కువ రకం మద్యం ధరలు మరింత తక్కువ కానుండడంతో పాటు విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరగనుంది. ప్రస్తుతం 90 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా 60 మిల్లీ లీటర్ల మద్యం బాటిల్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి 60 మిల్లీ లీటర్ మద్యం రూ.20 లకే లభ్యం కానుంది. -
మద్యం ధరల పెంపు
హైదరాబాద్: ప్రయాణికుల నడ్డి విరిగేలా ఆర్టీసీ బస్ చార్జిలు పెంచిన కొద్ది సేపటికే మద్యం ధరలను కూడా పెంచుతున్నట్లు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. ఖరీదైన ప్రీమియం మద్యంతోపాటు సామాన్యుడు సేవించే చీప్ లిక్కర్ ధర కూడా పెరిగింది. ఈ మేరకు జీవో నంబర్ 394, 395 లను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని పేర్కొంది. ధరల పెరుగుదలలోని ముఖ్యాంశాలు ప్రీమియం మద్యం ధరలు: కనిష్ఠంగా రూ. 25 నుంచి గరిష్ఠంగా రూ. 100 పెంపు చీప్ లిక్కర్: కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.10 పెంపు బీరు, వైన్ ధరల్లో స్వల్ప తగ్గుదల పెరిగిన ధరలతో ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల అదనపు ఆదాయం