మందుబాబులకు షాక్‌.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు? | Liquor Charges May Hike In Telangana | Sakshi
Sakshi News home page

మందుబాబులకు షాక్‌.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు?

Jan 30 2025 5:34 PM | Updated on Jan 30 2025 6:15 PM

Liquor Charges May Hike In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌ షాక్‌ తగలనుంది. మద్యం ధరలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం. ఈ మేరకు మద్యం ధరలపై త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో మందుబాబులకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. పంచాయితీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచేందుకు ప్లాన్‌ సిద్ధమైంది. ఇప్పటికే మద్యం ధరల పెంపుపై తత్రిసభ్య కమిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ క్రమంలో త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక, వచ్చే కేబినెట్‌ సమావేశంలో మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement