సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలో మద్యం ధరలు మరోమారు పెరిగాయి. ఆర్డినరీ, మీడియం మద్యం 180 ఎంఎల్ లిక్కర్ (క్వార్టర్) బాటిల్‌పై రూ.20, ప్రీమియం మద్యం క్వార్టర్ బాటిల్‌పై రూ.40 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆర్డినరీ, మీడియం మద్యం 375 ఎంఎల్ (హాఫ్) బాటిల్‌పై రూ. 40, 750 ఎంఎల్ (ఫుల్) బాటిల్‌పై రూ.80 చొప్పున.. ప్రీమియం మద్యం హాఫ్ బాటిల్‌పై రూ.80, ఫుల్ బాటిల్‌పై రూ.160 చొప్పున పెంచింది. లిక్కర్‌తో పాటు వైన్, బీర్ల ధరలు కూడా పెరిగాయి.
వైన్ క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున.. ప్రతి బీరుపై రూ.10 చొప్పున రేటు పెరిగింది. ఈ మేరకు బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ శాఖాపరమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెంచాలని నిర్ణయించడంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి మద్యం తరలింపును నిలిపేశారు. ఆన్‌లైన్ ద్వారా మద్యం ఆర్డర్ చేసే వెబ్‌సైట్ కూడా సాంకేతిక కారణాలతో పనిచేయలేదు. వెబ్‌సైట్‌ను గురువారం పునరుద్ధరిస్తారని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర
Comments
Please login to add a commentAdd a comment